iDreamPost
android-app
ios-app

ఆధార్‌ కార్డు మోసం.. కేజీఎఫ్‌ నటికి నోటీసులు!

  • Published Nov 04, 2023 | 1:38 PM Updated Updated Nov 04, 2023 | 1:38 PM

కేజీఎఫ్‌ నటి ‘మాళవిక అవినాష్‌’ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కేజీఎఫ్‌ సినిమాతో ఈమెకు దేశ వ్యాప్త గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ...

కేజీఎఫ్‌ నటి ‘మాళవిక అవినాష్‌’ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కేజీఎఫ్‌ సినిమాతో ఈమెకు దేశ వ్యాప్త గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ...

  • Published Nov 04, 2023 | 1:38 PMUpdated Nov 04, 2023 | 1:38 PM
ఆధార్‌ కార్డు మోసం.. కేజీఎఫ్‌ నటికి నోటీసులు!

కేజీఎఫ్‌ నటి ‘మాళవిక అవినాష్‌’ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కేజీఎఫ్‌ సినిమాతో ఈమెకు దేశ వ్యాప్త గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ ఉంటున్నారు. తెలుగులో నేరుగా సినిమా చేయకపోయినా.. ఇక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె చివరగా కాప్టెన్‌ సినిమా కనిపించారు. తర్వాత ఆమె ఏ సినిమాలోనూ నటించలేదు. తాజాగా, మాళవిక అవినాష్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఆధార్‌ కార్డును తప్పుడుగా వినియోగించారన్న కారణంతో ఆమెకు ట్రాయ్‌ నోటీసులు పంపంది.

అంతేకాదు! గురువారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ట్రాయ్‌నుంచి ఆమెకు ఫోన్‌ కాల్‌ కూడా వచ్చింది. దీనిపై ఆమె మాట్లాడుతూ.. ‘‘ నాకు ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ట్రాయ్‌నుంచి ఫోన్‌ వచ్చింది. మరో రెండు గంటల్లో నా మొబైల్‌ నెంబర్‌ను కట్‌ చేస్తామని వారు చెప్పారు. మరింత సమాచారం కోసం 9 కి ఫోన్‌ చేయమని వారు నాకు చెప్పారు. నేను ఫోన్‌ చేశాను. నేను నా నెంబర్‌ డిస్‌ కనెక్ట్‌ చేయవద్దని ట్రాయ్‌ అధికారుల్ని కోరాను. నేను ఆధార్‌ కార్డును తప్పుగా వాడి సిమ్‌ తీసుకోలేదని వారికి చెప్పాను. తర్వాత వారు పోలీస్‌లకు కూడా ఫోన్‌ కలిపారు. నాతో మాట్లాడిన ఎస్‌ఐ కొంచెం కూడా జాలి లేకుండా మాట్లాడాడు.

నన్ను ముంబై వచ్చి కంప్లైంట్‌ ఇవ్వమన్నాడు. నేను ఓ నటిని అని చెప్పటానికి ప్రయత్నించాను. అయితే, అతడు వినే ఆసక్తితో లేడు. నేను వీడియో కాల్‌ చేసినపుడు నన్ను కేజీఎఫ్‌ నటి అని గుర్తించాడు. వెంటనే నాకు అండగా నిలిచాడు. నా స్టేట్‌మెంట్‌ రికార్డు చేయాలన్నాడు. నేను ట్రాయ్‌ నోటిఫికేషన్‌ గురించి చెప్పాను. నాకు సిమ్‌ కొన్న దానికి సంబంధం లేదని చెప్పాను. స్టేట్‌మెంట్‌ కోర్టు ముందు ఉంచుతామని ఆ పోలీస్‌ చెప్పాడు. దీన్ని బట్టి ఆధార్‌ కూడా పాస్‌ పోర్టులా చాలా ముఖ్యమైందని అర్థం అయింది. దాన్ని చాలా భద్రంగా దాచుకోవాలి. దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేశ పౌరులుగా మనం ఆధార్‌ను సరిగా పట్టించుకోవటం లేదు’’ అని అన్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş