iDreamPost
android-app
ios-app

యశ్ ఎస్కార్ట్ వాహనం ఢీకొని అభిమాని కన్నుమూత!

  • Published Jan 09, 2024 | 1:38 PM Updated Updated Jan 09, 2024 | 1:38 PM

కన్నడ ఇండస్ట్రీలో హీరో యశ్ పుట్టిన రోజు సందర్భంగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది.. ముగ్గురు ఫ్యాన్స్ ఫ్లెక్సీ కడుతున్న సమయంలో కరెంట్ షాక్ కి గురై చనిపోయారు. మృతుల ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు యశ్.

కన్నడ ఇండస్ట్రీలో హీరో యశ్ పుట్టిన రోజు సందర్భంగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది.. ముగ్గురు ఫ్యాన్స్ ఫ్లెక్సీ కడుతున్న సమయంలో కరెంట్ షాక్ కి గురై చనిపోయారు. మృతుల ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు యశ్.

యశ్ ఎస్కార్ట్ వాహనం ఢీకొని అభిమాని కన్నుమూత!

సినీ ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు ఎన్ని సినిమాలు తీసినా సక్సెస్ కలిసి రాదు. ఒకటీ రెండు సినిమాలతోనే విపరీతమైన క్రేజ్ సంపాదించిన హీరోలు ఉన్నారు. అలాంటి వారిలో కన్నడ రాక్ స్టార్ యశ్ ఒకరు. అతి సామాన్యనమైన కుటుంబం నుంచి యశ్ మొదల బుల్లితెరపై తన సత్తా చాటాడు. 2007 లో ‘జంబడ హుడగి’ చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పలు చిత్రాల్లో నటించాడు.. కానీ పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్ సీరీస్ తో యశ్ కి ఏకంగా జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. సోమవారం యశ్ పుట్టిన రోజు.. ఈ సందర్భంగా ఆయన ఆనందం కన్నా విషాదంలోనే ఎక్కువ ఉన్నారు.. దీనికి గల కారణం ఏంటో చూద్దాం. వివరాల్లోకి వెళితే..

కన్నడ ఇండస్ట్రీలో యశ్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్వయంకృషితో పైకి వచ్చిన యశ్ ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్ 2’ చిత్రాలతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ ఇండస్ట్రీలో కూడా యశ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. నిన్న యశ్ పుట్టిన రోజు సందర్భంగా అందరూ సంతోషంగా ఉన్న సమయంలో ఆయన ఫ్లెక్సీలు కడుతూ ముగ్గురు యువకులు కన్నుమూశారు. మరణించిన వారు హనమంత హరిజన్, నడవినమణి, నవీన్ గజీ లుగా గర్తించారు. వీరు కర్ణాటకలోని గడకు జిల్లాకు చెందిన వారు. ఈ ఘటన మరువక ముందో మరో విషాదం చోటు చేసుకుంది. నిన్న కరెంట్ షాక్ ప్రమాదంలో గాయపడ్డ వారిని పరామర్శించి తిరిగి బయలుదేరాడు యశ్.

యశ్ కి భద్రత కల్పిస్తూ వస్తున్న పోలీస్ వాహనాన్ని ఓ అభిమాని తన బైక్ తో ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నిఖిల్ అనే అభిమాని తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అతన్ని హాస్పిటల్ లో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం నిఖిల్ మృతి చెందాడు. మృతుడు నిఖిల్ గడక్ తాలూకా బింకదకట్టి గ్రామానికి చెందినవాడు. తన అభిమాన హీరోని యశ్ ని చూసేందుకు అతడిని వెంబడించే క్రమంలో స్కూటీపై వెగంగా రోడ్డుపైకి వచ్చాడు.. అదే సమయంలో పోలీస్ ఎప్కార్ట్ వాహనాన్ని ఢీ కొట్టాడు. తలకు తీవ్ర గాయం కావడంతో పోలీసులు గడక్ హాస్పిటల్ కి తరలించారు. తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు కన్నుమూయడంపై యశ్ తీవ్రంగా స్పందించారు. తనకు పుట్టిన రోజు చేసుకోవాలంటేనే భయంగా ఉందని.. తన పుట్టిన రోజు వేడుకల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని కన్నీళ్లతో విజ్ఞప్తి చేశారు. మృతుల కుటుంబానికి అన్ని విధాలుగా సాయంగా ఉంటానని అన్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.