వరద బాధితులను ఆదుకోవడంలో కనిపించని హీరోయిన్స్‌! ఇండస్ట్రీ అంటే హీరోలేనా?

Tollywood, Floods, Andhra Pradesh, Telangana: భారీ వర్షాలు, వరదలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలను ఆదుకోవడంలో హీరోలు మాత్రమే ముందున్నారు.. కానీ, హీరోయిన్లు ఎక్కడా? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.

Tollywood, Floods, Andhra Pradesh, Telangana: భారీ వర్షాలు, వరదలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలను ఆదుకోవడంలో హీరోలు మాత్రమే ముందున్నారు.. కానీ, హీరోయిన్లు ఎక్కడా? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలతో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం జిల్లాలు వరదలకు అతలాకుతలం అయ్యాయి. కొన్ని వందల ఇళ్లు నీళ్లులో పూర్తిగా మునిగిపోయాయి.. చాలా మంది నిరాశ్రయులైయ్యారు. ఉండేందుకు నిలువ నీడలేక, తినేందుకు తిండి లేక.. దుర్భర జీవితం అనుభిస్తున్నారు. అలాగే పదుల సంఖ్యలో ప్రాణ నష్టం కూడా జరిగింది. వరద బాధితుల కోసం ప్రభుత్వం నుంచి, సామాన్య పౌరుల వరకు అంతా తమ వంతు సాయం చేస్తున్నారు. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీ హీరోలు, నిర్మాతలు సైతం.. సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు తమ వంతు ఆర్థిక సాయం అందిస్తూ. వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నారు. కానీ, ఇండస్ట్రీ అంటే ఒక్క హీరోలు మాత్రమే కాదు కదా? హీరోయిన్స్‌ కూడా ఉ​ంటారు.. కానీ, ఈ కష్టకాలంలో వాళ్లు ఎక్కడా కనిపించడం లేదు?

ఒక వైపు.. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, పవన్‌ కళ్యాణ్‌, రామ్‌చరణ్‌, మహేష్‌ బాబు, ప్రభాస్‌, అల్లు అర్జున్‌, విశ్వక్‌సేన్‌, సిద్ధూ జొన్నలగడ్డ లాంటి స్టార్లంతా.. తమ వంతు ఆర్థిక సాయం ప్రకటించారు. వీరితో పాటు పెద్ద పెద్ద సినిమాల్లో అవకాశాలు రాకపోయినా, స్టార్‌ హీరోయిన్‌ హోదా ఇంకా దక్కకపోయినా.. అనన్య నాగళ్ల అనే తెలుగు హీరోయిన్‌ సైతం రూ.5 లక్షల సాయం ప్రకటించారు. కానీ, తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్లుగా చెలామణి అవుతూ.. కొంతమంది హీరోలకంటే కూడా ఎక్కువ రెమ్యూనరేషన్‌ తీసుకునే వాళ్లు.. సాయం ప్రకటించినట్లు కనిపించలేదు. కోట్లు, లక్షలు సాయమే ప్రకటించాల్సిన అవసరం లేదు.. కనీసం వరదలపై, రాష్ట్రాల్లో నెలకొన్న విపత్కర పరిస్థితులపై  ఒక్క ట్వీట్‌ కూడా చేయని వాళ్లు ఉన్నారు. ప్రజలు టిక్కెట్‌ కొని సినిమా చూస్తేనే వాళ్లు స్టార్లు అయింది.. ఈ క్రేజ్‌, పాపులారిటీ, డబ్బు అంతా.. ఇప్పుడు వరదల్లో ఇబ్బంది పడుతున్న వాళ్లు ఇచ్చిందే.

అయినా.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్లుగా ఉన్నది మనవాళ్లు కాదు.. అంటే తెలుగు వాళ్లు కాదు. మన వాళ్లు కాని వారికి మన కష్టాలు ఏం తెలుస్తాయనే విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అనన్య నాగెళ్ల, యాంకర్‌ స్రవంతిలు మన తెలుగు అమ్మాయిలు కనుక.. వారికి మన కష్టం, మన బాధ అర్థమయ్యాయి.. అందుకే వారికి తోచినంత ఆర్థిక సాయిం అందించేందుకు ముందుకు వచ్చారు. ఆర్థిక సాయం ఇస్తేనే మనవాళ్లు అని కాదు కానీ, కనీసం మానవతా హృదయంతో.. కనీసం అయ్యో పాపం అని ఒక ట్వీట్‌ చేసిన పాపాన కూడా పోలేదు మనం నెత్తిన పెట్టుకున్న స్టార్‌ హీరోయిన్లు. ఎంత టాలెంట్‌ ఉన్నా, ఎంత అందమున్నా.. కష్ట సమయంలో కనీసం పట్టించుకోని వాళ్లు ఎంత వాళ్లైతే ఏంటి? ఇప్పటికైనా.. మన వాళ్లు ఎవరో? పరాయి వాళ్లు ఎవరో? మన దర్శక నిర్మాతలు, హీరోలు తెలుసుకొని.. అవకాశాలు ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాలు సినీ అభిమానులు నుంచి వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments