పెద్ద హీరోలు సేఫ్.. ఎటొచ్చీ చిన్న హీరోలే నలిగిపోతున్నారు!

Tollywood Young Heros Suffering For Releases: టాలీవుడ్ లో స్టార్ హీరోలకు ఎలాంటి ఇబ్బందులు ఉండటం లేదు. కానీ, యంగ్ హీరోల పరిస్థితి మాత్రం అలా ఉండటం లేదు.

Tollywood Young Heros Suffering For Releases: టాలీవుడ్ లో స్టార్ హీరోలకు ఎలాంటి ఇబ్బందులు ఉండటం లేదు. కానీ, యంగ్ హీరోల పరిస్థితి మాత్రం అలా ఉండటం లేదు.

సినిమా ఇండస్ట్రీ అంటే కేవలం స్టార్ హీరోలు మాత్రమే కాదు అని అందరికీ తెలుసు. ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ స్టార్లు మాత్రమే కాకుండా చిన్న చిన్న హీరోలు కూడా ఉంటారు. కేవలం పెద్ద హీరోల సినిమాలు మాత్రమే ఆడితేనే ఇండస్ట్రీ బాగుంటుంది అని చెప్పలేం. ఇక్కడ అందరు హీరోల సినిమాలు ఆడాలి.. అందరు హీరోలు హిట్లు కొట్టాలి. అలా అయితే ఇండస్ట్రీ బాగుంటుంది, ఆర్టిస్టులు బాగుంటారు. ఏ విషయం తీసుకున్నా పెద్ద హీరోల సినిమాలకు ఎలాంటి ఢోకా ఉండటం లేదు. కానీ, ఎటొచ్చీ చిన్న హీరోలు, వాళ్ల సినిమాలు మాత్రమే నలిగిపోతున్నాయి. ఏ ఏ విషయాల్లో ప్రధానంగా ఆ సమస్య ఎదురవుతోందో చూద్దాం.

ఇండస్ట్రీలో ఏడాది పొడవునా సినిమాలు రిలీజ్ కావు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పండగ సీజన్, లాంగ్ వీకెండ్, స్పెషల్ డేస్ అంటూ సినిమాలను సరైన సమయం చూసి రిలీజ్ చేస్తుంటారు. ఇలా కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే సినిమాలు రిలీజ్ చేస్తుంటారు కాబట్టి ఇండస్ట్రీలో కచ్చితంగా పోటీ వాతావరణం అయితే ఉంటుంది. పండగ సీజన్ కోసమో.. లాంగ్ వీకెండ్ కోసమో లెక్కకు మించిన సినిమాలు బరిలోకి దిగుతూ ఉంటాయి. ఒకేసారి రెండు, మూడు సినిమాలు అంటే కొన్ని ఇబ్బందులు కచ్చితంగా ఉంటాయి. సింగిల్ స్క్రీన్స్ కావచ్చు, డిస్టిబ్యూటర్లు కావచ్చు, రిలీజ్ డేట్ కి సంబంధించి పోటీ ఉంటుంది. అయితే పెద్ద హీరోల సినిమాలు అనగానే నిర్మాతలే కలిసి మాట్లాడుకుని రిలీజ్ డేట్ల విషయంలో, స్క్రీన్స్ విషయంలో సర్దుబాట్లు చేసుకుంటున్నారు. ఆ పరిస్థితిని తాజాగా మనం సంక్రాంతి సందర్భంగా చూశాం.

ఇప్పుడు పుష్ప 2, దేవర సినిమాలు కూడా ఎక్కడా క్లాష్ కాకూడని నిర్మాతలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. డిస్టిబ్యూటర్ల విషయానికి వస్తే.. స్టార్ హీరోలకు ఒక్కో హీరోకి ఒక డిస్టిబ్యూటర్ ఉంటారని తెలిసిందే. స్టార్ హీరోల చిత్రాలకు టికెట్ రేట్స్ హైక్ కూడా సునాయసంగా జరిగిపోతుంది. వీటన్నింటి పరంగా చూసుకుంటే పెద్ద హీరోలు ఎప్పుడు రిలీజ్ పెట్టుకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండటం లేదు. కానీ, చిన్న హీరోల పరిస్థితి మాత్రం అలా ఉండటం లేదు. సింగిల్ స్ట్రీన్స్ కావచ్చు, రిలీజ్ డేట్లు కావచ్చు, డిస్టిబ్యూటర్లు కావచ్చు ఇలా అన్ని విషయాల్లో వారికి తిప్పలు తప్పడం లేదు. ఉదాహరణకు విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా తీసుకుందాం. ఈ సినిమాని కూడా హారికా హాసినీ క్రియేషన్స్ వాళ్లే నిర్మించారు. కానీ, గుంటూరు కారం సినిమా కోసం ఈ మూవీ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది.

అలాగే సందీప్ కిషన్ ఊరి పేరు భైరవ కోన సినిమా చూస్తే.. సోలో రిలీజ్ కోసం చాలానే ప్రయత్నాలు చేశారు. కానీ, వాళ్ల కోరిక తీరలేదు. ఒకవేళ ఒక చిన్న హీరో సినిమా సోలో రిలీజ్ ప్లాన్ చేసుకుంటే.. వారికి మిగిలిన చిన్న హీరోల సినిమాల నుంచి పోటీ తప్పడం లేదు. ఎందుకంటే వాళ్లకి స్టార్ హీరోలతో పోటీ కంటే ఇది కాస్త సులువుగా ఉంటుంది కాబట్టి. ఇలా ఏ రకంగా చూసుకున్నా, ఏ టైమ్ చూసుకున్నా, ఏ కేటగిరీ చూసుకున్నా పెద్ద హీరోలకు ఎలాంటి ఇబ్బందులు ఉండటం లేదు. కానీ, చిన్న హీరోలు మాత్రం నలిగిపోవడం తప్పడం లేదు. మరి.. ఈ విషయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments