iDreamPost
android-app
ios-app

ఆగస్టు 15 ఎందుకంత స్పెషల్? హీరోల చూపు ఆ డేట్ పైనే..

  • Published Jan 31, 2024 | 4:47 PM Updated Updated Jan 31, 2024 | 4:57 PM

August 15 Tollywood Releases: టాలీవుడ్ లో ఆగస్టు నెలలో బాక్సాఫీస్ వద్ద పెద్ద యుద్ధమే జరగబోతోంది. అయితే ఆ రోజు కోసం ఎందుకంత పోటీ నెలకొందో చూడండి.

August 15 Tollywood Releases: టాలీవుడ్ లో ఆగస్టు నెలలో బాక్సాఫీస్ వద్ద పెద్ద యుద్ధమే జరగబోతోంది. అయితే ఆ రోజు కోసం ఎందుకంత పోటీ నెలకొందో చూడండి.

  • Published Jan 31, 2024 | 4:47 PMUpdated Jan 31, 2024 | 4:57 PM
ఆగస్టు 15 ఎందుకంత స్పెషల్? హీరోల చూపు ఆ డేట్ పైనే..

టాలీవుడ్ లో ఇప్పుడు అందరూ ఒక రిలీజ్ డేట్ గురించి బాగా మాట్లాడుకుంటున్నారు. అదేంటంటే.. ఆగస్టు 15. ఆ రోజు ఇప్పటికే పుష్ప 2 సినిమా రిలీజ్ కాబోతోంది అంటూ ప్రకటించారు. పుష్ప రాజ్ కాస్త ఆలస్యంగా వస్తాడు అనుకున్నారు. కానీ, చెప్పిన టైమ్ కే వచ్చేస్తాను అంటూ పుష్పరాజ్ క్లారిటీ ఇచ్చాడు. ఈ రోజు దేవర సినిమా కూడా విడుదల కాబోతోంది అంటూ టాక్ గట్టిగానే వచ్చింది. మరోవైపు సరిపోదా శనివారం సినిమా కూడా ఉంది. అయితే అసలు ఈరోజే ఎందుకు అందరూ రిలీజ్ చేయాలి అని భావిస్తున్నారో తెలుసా? అందుకు బలమైన కారణమే ఉంది. మరి.. అదేంటో తెలియాలంటే ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివేయండి.

సాధారణంగా టాలీవుడ్ లోనే కాదు.. ఏ ఇండస్ట్రీలో అయినా సినిమా రిలీజ్ కి ఒక స్పెషల్ డేట్ ని ఎంపిక చేస్తూ ఉంటారు. అలాంటప్పుడే ఆ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వస్తాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ స్పెషల్ డేట్ ఏంటి అంటే.. పండగ రోజో, పబ్లిక్ హాలిడీ రోజో రిలీజ్ పెట్టుకుంటారు. వీకెండ్స్ లో సినిమాని ప్లాన్ చేసుకుంటారు. ఆగస్టు 15 పబ్లిక్ హాలిడే కాబట్టి ఆ డేట్ కోసం పోటీ పడుతున్నారు అని సింపుల్ గా కంక్లూజన్ కి వచ్చేయకండి. ఆగస్టు 15 ఉందనే మాత్రమే కాదండోయ్.. అది వెరీ లాంగ్ వీకెండ్ అనమాట. అందుకే ఆ డేట్ కోసం ఇప్పుడు టాలీవుడ్ లో గట్టి పోటీ నెలకొంది. సాధారణంగానే వీకెండ్ లో సినిమాని రిలీజ్ చేయాలి అనుకుంటారు. కానీ, లాంగ్ వీకెండ్ దొరికితే ఎందుకు వదిలేస్తారు చెప్పండి. అందుకే అందరూ ఆగస్టు 15 కోసం పోటీలు పడుతున్నారు. అసలు ఆ వీక్ లో ఎన్ని సెలవులు ఉన్నాయో చూద్దాం.

ఆగస్టు 15 పబ్లిక్ హాలిడే అని అందరికీ తెలిసిందే. ఆగస్టు 16న వరలక్ష్మీ వ్రతం ఉంది. ఆరోజు కూడా దాదాపుగా హాలిడేనే ఉంటుంది. ఇంక తర్వాత ఆగస్టు 17 శనివారం, 18 ఆదివారం. ఆగస్టు 19న రక్షా బంధన్ ఉంది. అంటే కచ్చితంగా ఆ రోజు హాలిడే ఉంటుంది. ఆగస్టు 22న సంకష్టి చతుర్థి, కజారి తీజ్ ఉన్నాయి. మనవైపు సెలవు లేకపోయినా నార్త్ లో హాలిడే ఉండే అవకాశం ఉంది. ఆగస్టు 24 శనివారం, 25 ఆదివారం వచ్చాయి. ఆగస్టు 26న జన్మాష్టమి ఉంది. ఇలా మొత్తం మీద ఆగస్టు 15 నుంచి ఆగస్టు నెలాఖరు వరకు అడపాదడపా సెలవలు వస్తూనే ఉన్నాయి. అందుకే ఆగస్టు 15 కోసం అందరూ మల్లగుల్లాలు పడుతున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ దేవర మాత్రం ఆగస్టు 15కి వచ్చే అవకాశాలు లేవని చెబుతున్నారు. సరిపోదా శనివారం మాత్రం ఆగస్టు 15కే రానుంది. మరోవైపు పుష్ప రాజ్ మాత్రం ఈసారి తగ్గేదేలే అంటూ అదే డేట్ కి ఫిక్స్ అయిపోయాడు. మరి.. ఈ గ్యాప్ లో ఇంకా ఎన్ని చిత్రాలు ఈ డేట్ కోసం పోటీ పడతాయో చూడాలి. మార్కెట్ పరంగా పుష్ప-2కి పాన్ ఇండియా లెవల్లో ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. కథ మీద నమ్మకంతోనే సరిపోదా శనివారం కూడా పోటీకి సై అంటున్న పరిస్థితి కనిపిస్తోంది. దేవర కూడా సమరానికి సై అంటే మాత్రం టాలీవుడ్ లో బిగ్గెస్ట్ క్లాష్ అవుతుందనే చెప్పాలి. మరి.. ఆగస్టు 15కి పోటీ ఉండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet