iDreamPost
android-app
ios-app

మిరాయ్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో !

  • Published Sep 06, 2025 | 11:16 AM Updated Updated Sep 06, 2025 | 11:16 AM

ప్రతి శుక్రవారం మీద పెట్టుకునే అంచనాలు ఓ రకంగా ఉంటే.. దాని ఫలితాలు మరో విధంగా ఉంటున్నాయి. ఈ వారం ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన సినిమానాల జాతకం తేలిపోయింది. ఏ సినిమాకు ఎలాంటి టాక్ రావాలో అలాంటి టాక్ ఏ వచ్చింది. కమర్షియల్ గా ఎవరెంత కొల్లగొట్టారన్నది ఈ వీకెండ్ కంప్లీట్ అయిన తర్వాత తెలుస్తుంది

ప్రతి శుక్రవారం మీద పెట్టుకునే అంచనాలు ఓ రకంగా ఉంటే.. దాని ఫలితాలు మరో విధంగా ఉంటున్నాయి. ఈ వారం ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన సినిమానాల జాతకం తేలిపోయింది. ఏ సినిమాకు ఎలాంటి టాక్ రావాలో అలాంటి టాక్ ఏ వచ్చింది. కమర్షియల్ గా ఎవరెంత కొల్లగొట్టారన్నది ఈ వీకెండ్ కంప్లీట్ అయిన తర్వాత తెలుస్తుంది

  • Published Sep 06, 2025 | 11:16 AMUpdated Sep 06, 2025 | 11:16 AM
మిరాయ్  ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో !

ప్రతి శుక్రవారం మీద పెట్టుకునే అంచనాలు ఓ రకంగా ఉంటే.. దాని ఫలితాలు మరో విధంగా ఉంటున్నాయి. ఈ వారం ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన సినిమానాల జాతకం తేలిపోయింది. ఏ సినిమాకు ఎలాంటి టాక్ రావాలో అలాంటి టాక్ ఏ వచ్చింది. కమర్షియల్ గా ఎవరెంత కొల్లగొట్టారన్నది ఈ వీకెండ్ కంప్లీట్ అయిన తర్వాత తెలుస్తుంది. ఈ మూడు సినిమాల సంగతి పక్కన పెట్టేస్తే… సరిగ్గా వారం తర్వాత తేజ సజ్జా మిరాయ్ మూవీ సీన్ లోకి ఎంట్రీ ఇస్తుంది. హనుమాన్ తర్వాత తేజ సజ్జా సినిమాలంటే ఏజ్ డిఫరెన్స్ లేకుండా థియేటర్స్ కు తరలి వస్తున్నారు.

పైగా ప్రమోషన్స్ లో కూడా చాలా క్లియర్ గా సినిమా గురించి చెప్పడం.. రీజనబుల్ బిజినెస్ జరుపుకోవడంతో బయ్యర్లకు భారీ లాభాలు రావడం ఖాయమని అంతా భావిస్తున్నారు. ఇక ఆ తర్వాత రోజు బెల్లంకొండ శ్రీనివాస్ కిష్కింధపురి రిలీజ్ కానుంది. కాకపోతే ఇది హర్రర్ జోనర్ కావడంతో మిరాయ్ కి ఇది అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఒకసారి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఏకంగా 13 రోజులు ఓపెన్ గ్రౌండ్ దక్కుతుంది. మిరాయ్ సక్సెస్ అవ్వాలంటే మొదటి రోజు పెద్ద మ్యాజిక్ జరగాల్సిందే. ఒకవేళ హిట్ అయితే తేజ సజ్జాతో పాటు విలన్ గా మంచు మనోజ్ కి కూడా మంచి అవకాశాలు దక్కుతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

సమ్మర్ బ్రేక్ తర్వాత సినిమాల జోరు పెరుగుతుంది అనుకుంటే.. మొదటి వీకెండ్ దాటిన తర్వాత హౌస్ ఫుల్స్ చేయిస్తున్న సినిమా టాలీవుడ్ నుంచి ఒక్కటి కూడా రాలేదు. ఓజి ఈ లెక్కలన్నీ సరిచేస్తుందని గట్టి నమ్మకమే పెట్టుకున్నారు. కానీ ఈలోపు మిరాయ్ మ్యాజిక్ చేస్తే మాత్రం ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం ఖాయం. అటు పీపుల్స్ మీడియా వారికి కూడా ఈ సక్సెస్ చాలా ఇంపార్టెంట్. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.