iDreamPost
android-app
ios-app

ఆస్పత్రి బెడ్డుపై టాలీవుడ్ హీరోయిన్.. కోలుకోవడం కష్టంగా ఉందంటూ..!

  • Published May 06, 2024 | 3:14 PM Updated Updated May 06, 2024 | 3:14 PM

Tollywood Heroine Hospitalized: టాలీవుడ్ హీరోయిన్ ఆస్పత్రి పాలైంది. తనకు ఎంతో కష్టంగా ఉంది అంటూ సోషల్ మీడియా వేదికగా తన కష్టాన్ని ఫ్యాన్స్, ఫాలోవర్స్ తో పంచుకుంది.

Tollywood Heroine Hospitalized: టాలీవుడ్ హీరోయిన్ ఆస్పత్రి పాలైంది. తనకు ఎంతో కష్టంగా ఉంది అంటూ సోషల్ మీడియా వేదికగా తన కష్టాన్ని ఫ్యాన్స్, ఫాలోవర్స్ తో పంచుకుంది.

  • Published May 06, 2024 | 3:14 PMUpdated May 06, 2024 | 3:14 PM
ఆస్పత్రి బెడ్డుపై టాలీవుడ్ హీరోయిన్.. కోలుకోవడం కష్టంగా ఉందంటూ..!

సామాన్యులు అయినా.. సెలబ్రిటీలు అయినా ఆరోగ్యం బాగున్నంత వరకే మానసికంగా కూడా బాగా ఉంటారు. కానీ, ఒకసారి మన ఆరోగ్యం దెబ్బతింది అంటే మెంటల్ గా కూడా ఎంతో భారంగా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి ఒక పేజ్ లో టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఉంది. ఆమె తన పరిస్థితిని వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ముక్కు మొఖం తెలియని వ్యక్తుల మధ్య సర్జరీ గదిలో ఉన్నానంటూ ఎమోషనల్ అయ్యింది. తనలాంటి పరిస్థితి మెరవరికీ రాకూడదు అంటూ ఆమె చెప్పడంతో అభిమానులు, నెటిజన్స్ అంతా ఎమోషనల్ అవుతున్నారు. అసలు ఆమెకు ఏమైంది అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఇప్పుడు చెప్పుకుంటున్న టాలీవుడ్ హీరోయిన్ మరెవరో కాదు.. దక్షా నాగర్కర్. దాదాపుగా తొమ్మిదేళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతోంది. అయితే ఇన్నేళ్లలో ఈ అమ్మడు కేవలం 5 చిత్రాలు మాత్రమే చేసింది. హుషారు, రావణాసుర, జాంబీ రెడ్డి చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులే కొట్టేసింది. కాకపోతే బంగ్గార్రాజు సినిమాలో మాత్రం పాటలో తళుక్కుమని మెరుపు తీగలా మాయమైంది. ఇవన్నీ పక్కన పెడితే ఈ భామ ఇప్పుడు ఎంతో ఎమోషనల్ అయ్యింది. తన ఆరోగ్యానికి సంబంధించిన ఒక విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన ఫ్యాన్స్, ఫాలోవర్స్ తో పంచుకుంది. ఆ విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Daksha Nagarkar (@dakshanagarkar)

ఈ అమ్మడు మూవీస్ లో మాత్రమే కాకుండా.. తరచూ ఈవెంట్స్ లో మెరుస్తూ ఉండే ఈ భామ తాజాగా ఆస్పత్రిలో చేరినట్లు నెట్టింట పోస్టు పెట్టింది. గడిచిన కొన్ని రోజులుగా కోలుకోవడం చాలా కష్టంగా ఉందంటూ చెప్పుకొచ్చింది. “గడిచిన కొద్ది రోజులు నాకు ఎంతో క్లిష్టమైనవిగా ఉన్నాయి. అసలు ఎవరో కూడా తెలియని వ్యక్తుల మధ్యలో సర్జరీ గదిలో అలా పడి ఉండటం ఎంతో కష్టంగా అనిపించింది. నాకు ఇప్పటికే వెన్నెముకకు రెండుసార్లు సూదులు(మత్తు ఇంజక్షన్స్) గుచ్చారు. నా ఎమోషన్స్ ని కంట్రోల్ లో పెట్టుకోవడానికి నేను ఎంతగానో ప్రయత్నించాను. నేను అమితంగా ప్రేమించిన వాళ్లంతా నాకు ఇలాంటి సమయంలో అండగా నిలబడ్డారు. ప్రేమ కేరింగ్ కు కనిపించని గాయాలను కూడా నయం చేసే శక్తి ఉంటుంది. ఇలాంటి సమయంలో ఎలా ప్రేమించాలో నాకు వాళ్లు చూపించారు. నాకు వచ్చిన ఇలాంటి పరిస్థితి మరొకరికి రాకూడదు” అంటూ దక్షా నాగర్కర్ ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఆమె చెప్పిన ఈ విషయం నెట్టింట వైరల్ అవుతోంది. ఫ్యాన్స్, నెటిజన్స్ ఆమె పరిస్థితి చూసి ఎమోషనల్ అవుతున్నారు. దక్షా నాగర్కర్ త్వరగా కోలుకోవాలి అని ఆకాంక్షిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Daksha Nagarkar (@dakshanagarkar)

Jojobet GirişjojobetsezarcasinoJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomcasibomjojobetcasibomfixbetcasibomfixbetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş