iDreamPost
android-app
ios-app

పెళ్లి చేసుకున్న టాలీవుడ్‌ హీరో.. అమ్మాయి ఎవరంటే..

  • Published Apr 22, 2024 | 7:54 AM Updated Updated Apr 22, 2024 | 7:54 AM

Thiruveer: టాలీవుడ్ యంగ్ హీరో ఒకరు పెళ్లి పీటలు ఎక్కారు. వెడ్డింగ్‌ ఫొటోలు షేర్‌ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ఆ వివరాలు..

Thiruveer: టాలీవుడ్ యంగ్ హీరో ఒకరు పెళ్లి పీటలు ఎక్కారు. వెడ్డింగ్‌ ఫొటోలు షేర్‌ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. ఆ వివరాలు..

  • Published Apr 22, 2024 | 7:54 AMUpdated Apr 22, 2024 | 7:54 AM
పెళ్లి చేసుకున్న టాలీవుడ్‌ హీరో.. అమ్మాయి ఎవరంటే..

పెళ్లిళ్ల సీజన్‌ ముగియడానికి సమయం దగ్గర పడుతుంది. కొన్ని రోజుల తర్వాత వివాహాలు చేసుకోవడానికి ముహుర్తాలు లేవు. మూడు నెలల వరకు మళ్లీ పెళ్లి బాజాలు మోగవు. మరి కొన్ని రోజుల్లో మూఢాలు ప్రారంభం కానుండంతో.. మూడు నెలల పాటు ఎలాంటి శుభకార్యాలు జరపడానికి వీల్లేదు. దాంతో.. పెళ్లి చేసుకోవాలనుకువారే.. త్వరపడుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్‌ యంగ్‌ హీరో ఒకరు పెళ్లి పీటలు ఎక్కాడు. ప్రేమించిన అమ్మాయితో ఏడడుగులు వేశాడు. కొత్త ఆరంభం అంటూ పెళ్లి చేసుకున్న ఫొటోలు షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఇవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆ వివరాలు..

విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా చేస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని.. ఆ తర్వాత హీరోగా మారాడు తిరువీర్‌. టక్‌ జగదీష్‌ చిత్రంలో సైకో విలన్‌గా జీవించాడు. మసూద సినిమా ఇతడి కెరీర్‌ను మలుపు తిప్పింది. ప్రస్తుతం హీరోగా వరుస సినిమాలు చేస్తూ.. కెరీర్‌లో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. అలానే వ్యక్తిగత జీవితంలో కూడా సెటిల్‌ అయ్యాడు తిరువీర్‌. పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాడయ్యాడు. బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పాడు. ఎలాంటి హడావిడి, హంగామా లేకుండా సింపుల్‌గా ప్రేమించిన యువతి మెడలో మూడు ముళ్లు వేశాడు. తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాడు.

ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో తిరువీర్ పెళ్లి వేడుక ఎంతో వైభవంగా జరిగింది. ఈ యంగ్‌ హీరో వివాహం ఎక్కడ జరిగిందో తెలియదు. కానీ కొత్త జీవితం ఆరంభం అంటూ.. తిరువీర్ స్వయంగా తన పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. హల్దీ వేడుకతో పాటు పెళ్లికి సంబంధించిన ఫొటోలను కూడా పంచుకున్నాడు. ఇక తిరువీర్‌ పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు కల్పన రావు. వీరిద్దరు కొన్నాళ్ల నుంచి ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. ఇక తాజాగా ప్రియురాలితో కలిసి ఏడడుగులు నడిచాడు. ఇతడి పెళ్లి విషయం తెలిసి అభిమానులు కంగ్రాట్స్‌ తెలుపుతున్నారు.

ఇక రంగారెడ్డి జిల్లాలోని మామిడిపల్లికి చెందిన తిరువీర్ ‘మసూద’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్‌ ప్రారంభంలో రేడియో జాకీగా పని చేశాడు. బొమ్మలరామారం సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత పరేషాన్, జార్జ్ రెడ్డి, పలాస 1978 సినిమాల్లోనూ అతని అభినయానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. మసూద సినిమా అతడి కెరీర్‌ను మలుపు తిప్పింది. చేతినిండా చిత్రాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం తిరువీర్ పెళ్లి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. పలువురు ప్రముఖులు, నెటిజన్లు, అభిమానులు కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Thiruveer (@thiruveer)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss