Swetha
తెలుగు సినిమా విషయానికొస్తే అంతా బాహుబలికి ముందు.. బాహుబలికి తర్వాత అని చెప్పుకోవడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఒక సినిమాను రెండు భాగాలుగా చూపించడం అక్కడే మొదలైంది. మొదట్లో రాజమౌళి దీని గురించి అనౌన్స్ చేసినప్పుడు అదేంటి అసలు ఇదెలా సాధ్యపడుతుంది ? అని చాలానే కామెంట్స్ వినిపించాయి. కట్ చేస్తే రాజమౌళి పార్ట్ 2 తో హిట్ కొట్టి ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇచ్చాడు.

తెలుగు సినిమా విషయానికొస్తే అంతా బాహుబలికి ముందు.. బాహుబలికి తర్వాత అని చెప్పుకోవడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఒక సినిమాను రెండు భాగాలుగా చూపించడం అక్కడే మొదలైంది. మొదట్లో రాజమౌళి దీని గురించి అనౌన్స్ చేసినప్పుడు అదేంటి అసలు ఇదెలా సాధ్యపడుతుంది ? అని చాలానే కామెంట్స్ వినిపించాయి. కట్ చేస్తే రాజమౌళి పార్ట్ 2 తో హిట్ కొట్టి ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇచ్చాడు. ఇక అంతే అది మొదలు ఆ తర్వాత చాలా సినిమాలు ఇలా ప్రిక్వెల్స్ సిక్వెల్స్ ను అనౌన్స్ చేయడం మొదలుపెట్టాయి.
మొదట్లో ఒకటి రెండు సినిమాల వరకు ఇది బాగానే ఉంది. కానీ తర్వాత తర్వాత ఈ పార్ట్ 2 అనౌన్స్మెంట్స్ ఏమి అంత ఆసక్తి కలిగించడం లేదు. పైగా ఇప్పటివరకు వచ్చిన సిక్వెల్స్ బాహుబలి పార్ట్ 2 రేంజ్ లో పేలిందే లేదు. కమర్షియల్ గా కొన్ని వర్క్ అవుట్ అయినా కథ పరంగా కొన్ని వర్క్ అవుట్ అయినట్టు లేదు. ఓ రకంగా చూస్తే ఫ్యూచర్ అంతా కూడా ఫ్రాంచైజీల హావనే నడుస్తున్నట్లు కనిపిస్తుంది. అఖండ 2 డిసెంబర్ లో రిలీజ్ కానుంది. అది కాకుండా ఒక్క తేజ సజ్జా నుంచే మిరాయ్ 2, హనుమాన్ 2, జాంబిరెడ్డి 2 లాంటి సినిమాలు రానున్నాయి.
అలాగే ఇప్పుడు థియేటర్స్ లో కాంతారా 2 సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఆ తర్వాత ఈ ఫ్రాంచైజ్ నుంచి ఇంకో సినిమాను కూడా అనౌన్స్ చేశాడు. అలాగే దృశ్యం, దృశ్యం 2, దృశ్యం 3 ఇవి కూడా ఇలానే కంటిన్యూ అయ్యేలా ఉన్నాయి. ఇక సుజీత్ కూడా ఓజి2 తో తన ఫ్రాంఛైజ్ ని అనౌన్స్ చేశాడు. రాజసాబ్ ఇంకా రిలీజ్ కాలేదు కానీ పార్ట్ 2 ఉండే అవకాశం ఉంది. ఇవి కాకుండా కార్తికేయ 3, బింబిసార 2, పుష్ప 3, ఆర్.ఆర్.ఆర్ 2, ఆర్య 3 టాక్స్ లో ఉన్నాయి. ఇక ముందు ముందు ఏమి జరుగుతుందో చూడాలి. మరీ ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.