iDreamPost
android-app
ios-app

బాలీవుడ్ బాట పట్టిన క్లాస్ డైరెక్టర్ పరశురామ్! ఈసారి మాస్ టచ్ తో..

  • Published Aug 01, 2024 | 5:58 PM Updated Updated Aug 01, 2024 | 5:58 PM

Tollywood Director Planning To Debut In Bollywood: టాలీవుడ్ లో ఉన్న ఒక యంగ్ అండ్ క్లాసీ డైరెక్టర్ బాలీవుడ్ డెబ్యూ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాడని గట్టిగానే టాక్ వస్తోంది. ప్రయత్నాలు సక్సెస్ అయితే క్లాస్ డైరెక్టర్ కాస్తా.. బాలీవుడ్ లో మాస్ ఎలిమెంట్స్ తో సినిమా చేస్తాడు అంటున్నారు.

Tollywood Director Planning To Debut In Bollywood: టాలీవుడ్ లో ఉన్న ఒక యంగ్ అండ్ క్లాసీ డైరెక్టర్ బాలీవుడ్ డెబ్యూ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాడని గట్టిగానే టాక్ వస్తోంది. ప్రయత్నాలు సక్సెస్ అయితే క్లాస్ డైరెక్టర్ కాస్తా.. బాలీవుడ్ లో మాస్ ఎలిమెంట్స్ తో సినిమా చేస్తాడు అంటున్నారు.

  • Published Aug 01, 2024 | 5:58 PMUpdated Aug 01, 2024 | 5:58 PM
బాలీవుడ్ బాట పట్టిన క్లాస్ డైరెక్టర్ పరశురామ్! ఈసారి మాస్ టచ్ తో..

టాలీవుడ్ లో ఎంతో మంది టాలెంటెండ్ హీరోలు ఉన్నారు. అంతకన్నా గొప్ప గొప్ప టెక్నీషియన్స్ ఉన్నారు. ముఖ్యంగా ఎంతో మంది యంగ్ డైరెక్టర్లు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలతో దుమ్మురేపుతున్నారు. టాలీవుడ్ మూవీ అంటే ఇండియన్ సినిమా అనే స్థాయికి పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు సరిహద్దులు చెరిగిపోయాయి. టాలీవుడ్ డైరెక్టర్లు కూడా బాలీవుడ్ కు వెళ్లి సినిమా చేస్తున్నారు. మంచి మంచి రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. అందుకు సందీప్ రెడ్డి వంగా పేరును ఉదాహరణగా చెప్పచ్చు. ఇప్పుడు ఇంకో డైరెక్టర్ బాలీవుడ్ బాట పట్టనున్నారు అని తెలుస్తోంది. అయితే ఆయన ఎక్కువ క్లాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. అలాగని మాస్ తీయలేడని కాదు.. కానీ, ఆయన బాలీవుడ్ కి వెళ్తున్నాడు అనగానే కొంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ మూవీ మాత్రం ఫుల్ ఆఫ్ మాసీగా ఉంటుందంట.

ఇప్పుడు చెప్పుకుంటున్న ఆ క్లాస్ డైరెక్టర్ ఎవరో కాదు.. పరశురామ్. అయితే ఆయన మాస్ ఎలిమెంట్స్ ని కూడా బాగానే హైలెట్ చేయగలడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇటీవల వచ్చిన ఫ్యామిలీ స్టార్ లో విజయ్ దేవరకొండతో ఇంటి ప్లాన్ గీస్తూనే రౌడీలకు ధమ్కీ ఇప్పిస్తాడు. ఆ కాన్సెప్ట్ తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. సర్కారువారి పాట సినిమాలో మహేశ్ ని క్యూట్ బాయ్ లా చూపిస్తూనే.. మాస్ ఫైటులు చేయించాడు. అలా రెండింటిని సమపాళ్లలో చూపించడంలో సిద్ధ హస్తుడు అని చెప్పచ్చు. అయితే ఇప్పుడు పక్కా మాస్ స్టోరీ ఒకటి రెడీ చేశాడంట. అంతేకాకుండా.. బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలి అనుకుంటున్నాడని చెబుతున్నారు.

పరశురామ్ బాలీవుడ్ ఎంట్రీ గురించి అయితే గట్టిగానే వార్తలు వస్తున్నాయి. తాను చేసిన ఫ్యామిలీ స్టార్ మూవీ హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ ద్వారా ఒక బాలీవుడ్ లో ఒక ప్రొడక్షన్ హౌస్ కాంటాక్ట్ దొరికిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. తన దగ్గర సిద్ధంగా ఉన్న రెంచ్ రాజు అనే సినిమాకి మొదట కార్తీని అనుకున్నాడంట. కానీ, ఇప్పుడు మనసు మార్చుకుని బాలీవుడ్ బాట పడుతున్నాడు అంటున్నారు. అది కూడా ఒక కొత్త కథ, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాతో.. రాబోతున్నాడు అంటున్నారు. అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే.. క్లాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పరశురామ్.. ఊరమాస్ ఎలిమెంట్స్ తో బాలీవుడ్ డెబ్యూ చేస్తాడు అంటున్నారు. మరి.. పరశురామ్ బాలీవుడ్ బాట పడుతున్నాడు అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet