iDreamPost
android-app
ios-app

టాలీవుడ్ దసరా సినీ ఫెస్టివల్..

  • Published Oct 03, 2025 | 11:06 AM Updated Updated Oct 03, 2025 | 11:06 AM

దసరా పండగ ముగిసింది. ఈసారి దసరా పండగ రోజున టాలీవుడ్ అంతా కొత్త సినిమాల అప్డేట్స్ తో కళకళలాడింది. రిలీజ్ డేట్స్ , కొత్త పోస్టర్స్ , కొత్త సినిమాల పూజ కార్యక్రమాలు. ఇలా చాలా అప్డేట్స్ మూవీ లవర్స్ కు కిక్ ఇచ్చాయి. ముందుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా బాలయ్య అఖండ 2 రిలీజ్ డేట్ వచ్చేసింది.

దసరా పండగ ముగిసింది. ఈసారి దసరా పండగ రోజున టాలీవుడ్ అంతా కొత్త సినిమాల అప్డేట్స్ తో కళకళలాడింది. రిలీజ్ డేట్స్ , కొత్త పోస్టర్స్ , కొత్త సినిమాల పూజ కార్యక్రమాలు. ఇలా చాలా అప్డేట్స్ మూవీ లవర్స్ కు కిక్ ఇచ్చాయి. ముందుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా బాలయ్య అఖండ 2 రిలీజ్ డేట్ వచ్చేసింది.

  • Published Oct 03, 2025 | 11:06 AMUpdated Oct 03, 2025 | 11:06 AM
టాలీవుడ్ దసరా సినీ ఫెస్టివల్..

దసరా పండగ ముగిసింది. ఈసారి దసరా పండగ రోజున టాలీవుడ్ అంతా కొత్త సినిమాల అప్డేట్స్ తో కళకళలాడింది. రిలీజ్ డేట్స్ , కొత్త పోస్టర్స్ , కొత్త సినిమాల పూజ కార్యక్రమాలు. ఇలా చాలా అప్డేట్స్ మూవీ లవర్స్ కు కిక్ ఇచ్చాయి. ముందుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా బాలయ్య అఖండ 2 రిలీజ్ డేట్ వచ్చేసింది. అంతా అనుకున్నట్టుగానే ఈ సినిమాను డిసెంబర్5 న రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. ఆ సమయంలో ఎలాంటి బిగ్ రిలీజెస్ లేవు. పైగా సోలో ఎంట్రీ.. సో ఇంకా బాక్స్ ఆఫీస్ బాలయ్యదే.

ఇక నాని సుజీత్ కాంబినేషన్ లో సినిమాను పూజ కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. రెగ్యులర్ షూటింగ్ కు కాస్త సమయం పడుతుందని ఇన్సైడ్ టాక్. వెంకట్ బోయినపల్లి ఈ సినిమాని నిర్మిస్తున్నారు . శ్రీవిష్ణు ఈ మధ్య కాలంలో తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో ప్రేక్షకులను తెగ మెప్పిస్తున్నాడు. ఇప్పుడు సామజవరగమన దర్శకుడు రాజ్ అబ్బరాజుతో కలిసి మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. అది కూడా దసరా రోజునే పూజ కార్యక్రమాలతో ప్రారంభించారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇది కాకుండా శ్రీవిష్ణు కోన వెంకట్ సమర్పణలో నటిస్తున్న సినిమాకు ‘కామ్రేడ్ కళ్యాణ్’ అనే టైటిల్ ను అనౌన్స్ చేశారు.

ఇది కాకుండా నయనతార మెయిన్ లీడ్ గా సుందర్‌.సి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ ‘మూకుతి అమ్మన్2 తెలుగులో ‘మహాశక్తి’. ఈ సినిమాకు సంబంధించి పోస్టర్ ను రిలీజ్ చేశారు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఓంకార్ తో ‘రాజు గారి గది 4:శ్రీచక్రం’ ను అనౌన్స్ చేశారు. దీనిని 2026 దసరాకు రిలీజ్ చేయనున్నట్లు చెప్పుకొచ్చారు. వీటి సన్నీతో పాటు ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న ‘రాజాసాబ్’, ‘జటాధర’, ‘మోగ్లీ’, ‘మారెమ్మ’, ‘సంబరాల ఏటి గట్టు’ నుంచి కొత్త పోస్టర్స్ ను ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫస్ట్ సింగిల్ ప్రోమోను రిలీజ్ చేశారు. మొత్తానికి ఈ అప్డేట్స్ తో ఆడియన్స్ అంతా హ్యాపీ. ముందు ముందు ఈ సినిమాల నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.