iDreamPost
android-app
ios-app

టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి

  • Published Mar 29, 2024 | 6:09 PM Updated Updated Mar 29, 2024 | 6:11 PM

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. తెలుగునాట ఎన్నో టీవీ సీరియల్స్‌లో.. అలాగే సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు తాజాగా తుదిశ్వాస విడిచారు.

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. తెలుగునాట ఎన్నో టీవీ సీరియల్స్‌లో.. అలాగే సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు తాజాగా తుదిశ్వాస విడిచారు.

  • Published Mar 29, 2024 | 6:09 PMUpdated Mar 29, 2024 | 6:11 PM
టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి

సినీ ఇండస్ట్రీలో ఈమధ్య కాలంలో వరుస విషాదాలు అనేవి జరుగుతున్నాయి. అయితే వీరిలో ఎక్కువగా యంగ్ టాలెంటెడ్ నటులు, దర్శక నిర్మాతలు, ఇతర రంగానికి చెందినవారు మరణించడంతో.. అటు సిని ప్రముఖుల నుంచి వారి అభిమానులను సైతం శోకసంద్రంలో ముంచుతున్నాయి. అయితే చాలామంది సెలబ్రిటీస్ అనారోగ్యం, రోడ్డు ప్రమాదాలు, గుండె పోటు ఇలా రకరకాల కారణాలతో కన్నుమస్తున్నారు. కాగా, గత కొన్నిరోజుల క్రితం ప్రముఖ దర్శకుడు సూర్య కిరణ్ గుండెపోటుతో కన్నుమూసిన ఘటన మరువక ముందే.. ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ఎన్నో టీవీ సీరియల్స్ లో, సినిమాల్లో అలరించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఓ నటుడు తాజాగా తుదిశ్వాస విడిచారు. ఈయన మరణం ఇండస్ట్రీలో విషాదఛాయలు అలముకున్నాయి.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ఎన్నో టీవీ సీరియల్స్‌లో.. అలాగే కొన్ని సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు ‘వీరభద్రరావు’ ఈరోజు అనగా (శుక్రవారం మార్చి 29న) హైదరాబాద్‌లో కన్నుమూసారు. అయితే వీరభద్రం గత రెండు నెలల క్రితం తన ఇంట్లో ప్రమాదవశాత్తూ కింద పడిపోయారు. అప్పుడు తీవ్ర గాయాలైన అతనిని కుటంబ సభ్యలు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. ఇలా రెండు నెలలుగా కోమాలోనే ఉన్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు.దీంతో ఇటు బుల్లితెర నుంచి వెండితెర వరకు ఆయనతో కలిసి నటించిన చాలామంది నటులు షాక్ గురయ్యారు. అలాగే ఆయన మరణంతో ఇండస్ట్రీలో తీరని విషాదాన్ని నింపింది.

ఇక టీవీ ప్రేక్షకులు బాగా సుపరిచితుడైన వీరభద్రరావు.. దాదాపు అనేక ఛానల్స్ లోని ప్రసారమైన సీరియల్స్ లో నటించారు. ఈ క్రమంలోనే వెండితెర పై ఎంట్రీ ఇచ్చిన ఆయన అనేక చిత్రాల్లో సైతం నటించారు. అయితే ఎన్నో సినిమాల్లో నటించిన వీరభద్రరావుకి చిత్ర పరిశ్రమలో చెప్పుకోదగ్గ గుర్తింపు రాలేదు. కానీ, చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ మంచి పాత్రల్లో కనిపించారు. పైగా ఎక్కువ శాతం వీరభద్రరావు తండ్రి పాత్రల్లో ప్రేక్షకులను అలరించారు. ఇక ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు, టీవీ రంగానికి చెందిన వారు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలియజేశారు.