iDreamPost
android-app
ios-app

ఈ ఫోటోలో బుడ్డోడు.. లేటెస్ట్ గా హీరో అయ్యాడు! ఎవరో గుర్తుపట్టారా?

  • Author ajaykrishna Updated - 09:46 AM, Sat - 7 October 23
  • Author ajaykrishna Updated - 09:46 AM, Sat - 7 October 23
ఈ ఫోటోలో బుడ్డోడు.. లేటెస్ట్ గా హీరో అయ్యాడు! ఎవరో గుర్తుపట్టారా?

ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా కెరీర్ ఆరంభించిన ఎంతోమంది.. పెద్దయ్యాక హీరోలుగా, హీరోయిన్స్ గా ప్రయత్నాలు చేస్తుంటారు. అదృష్టం బాగుంటే హీరోహీరోయిన్స్ గాను సక్సెస్ అవుతారు. లేదంటే.. ప్రయత్నాలు చేసి చేసి.. లాస్ట్ కి తమ దారి తాము చూసుకుంటారు. ఎందుకంటే.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన అందరూ పెద్దయ్యాక హీరోలు, హీరోయిన్స్ కావాలంటే కాలేరు కదా! కొందరు లీడ్ రోల్స్ చేస్తే.. ఇంకొందరు సైడ్ క్యారెక్టర్స్.. మరికొందరు కామెడీ వైపు వెళ్ళిపోతుంటారు. ఏదొక విధంగా ఇండస్ట్రీలోనే ఉండాలి అనుకునే వారు ఇలా ఆలోచిస్తుంటారు. కానీ.. కొందరు మాత్రం ఏదో అయిపోదామని వచ్చి.. అదృష్టం బాగుండి ఏదో అయిపోతుంటారు.

ఆ లెక్కన ఏదో అంటే.. నెగటివ్ వేలో కాదు. చాలా పాజిటివ్ వేలో అర్ధం ఉంది. జస్ట్ చిన్న చిన్న క్యారెక్టర్స్ వస్తే చాలు అనుకునే వారు.. ఊహించని విధంగా నేమ్, ఫేమ్ సంపాదించుకొని, హీరోహీరోయిన్స్ అవుతుంటారు. ఇదేంటీ లక్ కొద్దీ వచ్చేది. ఎందుకంటే.. వాళ్లు లీడ్ రోల్స్ చేయాలని అనుకోలేదు. జస్ట్ ఏదొక చిన్న పాత్రలలో అవకాశాలు వస్తే చాలని వాళ్ల భావన. కట్ చేస్తే.. వీళ్ళ టాలెంట్ తెరపై అద్భుతంగా ప్రెజెంట్ అయి.. సైడ్ క్యారెక్టర్స్ నుండి ఏకంగా మెయిన్ రోల్స్ లో అవకాశాలు క్యూ కట్టేస్తాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ యాక్టర్ పేరు అలాగే వినిపిస్తుంది. కొత్తగా థియేటర్స్ లో మ్యాడ్ అనే సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో దామోదర్ అనే క్యారెక్టర్ లో నటించిన కుర్రాడు సంగీత్ శోభన్. ఏంటి.. శోభన్ అనగానే టక్ మని ఒక ఆలోచన వచ్చిందా..? అవును.. ఒకప్పటి డైరెక్టర్ శోభన్.. వర్షం సినిమాతో హిట్ కొట్టారు. ఆయన ప్రస్తుతం లేరు. కానీ.. ఆయన కొడుకులు ఇద్దరు సంతోష్ శోభన్ ఆల్రెడీ హీరోగా తెలుసు. ఇప్పుడు చిన్న కొడుకు సంగీత్ శోభన్. 2011లో గోల్కొండ హైస్కూల్ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు. ఆ సినిమాతో మంచి పేరు వచ్చింది. కట్ చేస్తే.. ఓటిటిలో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అనే వెబ్ సిరీస్ తో హీరో అయ్యాడు. ఇప్పుడు మ్యాడ్ సినిమాతో బిగ్ స్క్రీన్ పై అడుగుపెట్టాడు. ఫస్ట్ మూవీతోనే అందరిని కడుపుబ్బా నవ్వించి ఆకట్టుకున్నాడు సంగీత్. ప్రస్తుతం సంగీత్ పేరు మార్మోగిపోతుంది. ఈ లెక్కన ఇండస్ట్రీకి మరో టాలెంటెడ్ హీరో దొరికినట్టే అని సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. మరి సంగీత్ నటన గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Sangeeth Shobhan (@sangeeth_shobhan)

Jojobet GirişmeritbetmarsbahisHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibomromabet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişBetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet giriş