iDreamPost
android-app
ios-app

Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం..తొలి ఇండియన్ హీరోగా

  • Published Jul 19, 2024 | 2:13 PM Updated Updated Jul 19, 2024 | 2:13 PM

Ram Charan.. ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా వారసుడు రామ్ చరణ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అలాగే ఆయన ఎన్నో అవార్డులు,పురస్కారాలు పొందుతున్నాడు. ఇటీవల డాక్టరేట్ పొందిన చెర్రీకి ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది.

Ram Charan.. ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా వారసుడు రామ్ చరణ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అలాగే ఆయన ఎన్నో అవార్డులు,పురస్కారాలు పొందుతున్నాడు. ఇటీవల డాక్టరేట్ పొందిన చెర్రీకి ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది.

  • Published Jul 19, 2024 | 2:13 PMUpdated Jul 19, 2024 | 2:13 PM
Ram Charan: రామ్ చరణ్‌కు అరుదైన గౌరవం..తొలి ఇండియన్ హీరోగా

ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ అయ్యాడు రామ్ చరణ్. ఆ తర్వాత వచ్చిన ఆచార్య అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం కోలీవుడ్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్టు ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇందులో కియారా అద్వానీ, అంజలి, ఎస్ జే సూర్య, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, సునీల్, సముద్ర ఖనీ, నవీన్ చంద్ర, నాజర్, శుభలేక సుధాకర్, మురళీ శర్మ, రాజీవ్ కనకాల స్టార్ట్ నటించబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్.. ఈ ఏడాది చివరిలో కానీ.. వచ్చే సంవత్సరం విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే..ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ మెగా పవర్ స్టార్ రేంజ్ మారిపోయింది. ఎన్నో గౌరవాలు, పురస్కారాలు అందుకుంటున్నాడు. ఇటీవల డాక్టరేట్ పొందిన రామ్ చరణ్‌కు మరో హానర్ లభించింది.. లండన్‌లోని ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు బొమ్మను ఏర్పాటు చేయనుంది. ఇప్పుడు మరో ఘనతను దక్కించుకున్నాడు చెర్రీ. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ (IFFM)లో అతిధిగా పాల్గొనేందుకు ఆహ్వానం అందుకున్నాడు. 15వ ఎడిషన్‌లో ఇండియన్ ఆర్ట్ & కల్చర్ అంబాసిడర్ అవార్డును అందుకోనున్నారు. నటనా రంగంలో విశేషమైన కృషి కనబర్చిన చరణ్‌కు ఈ అవార్డును అందివ్వబోతుంది.

ఈ అవార్డును అందుకోబోతున్న తొలి సెలబ్రిటీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కావడం విశేషం. విక్టోరియన్ ప్రభుత్వం ప్రతి యేటా ఈ ఫెస్టివల్ ఈవెంట్ నిర్వహిస్తుంది. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి 25 వరకు ఈ ఈవెంట్ జరగనుంది. ఇదిలా ఉంటే.. ఈ అవార్డు దక్కడంపై చెర్రీ స్పందించాడు. మెల్‌బోర్న్‌లో భారత జాతీయ జెండాను ఎగురవేయడానికి ఎదురు చూస్తున్నానని పేర్కొన్నాడు. గౌరవ అతిథిగా రామ్ చరణ్ హాజరు కావడం తమకు ప్రతిష్టను ఇనుమడింపజేస్తుందని IFFM ప్రెసిడెంట్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే.. గేమ్ ఛేంజర్ తర్వాత బుచ్చిబాబు మూవీలో జాయిన్ కానున్నాడు. ఇందులో జాన్వీ కపూర్, శివ రాజ్ కుమార్ నటించబోతున్నారు.

Jojobet Girişjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgoo girişgrandpashabetEscortes Belgique