టిల్లు-2 లిరికల్ సాంగ్.. స్టోరీ మొత్తం పాటలోనే చెప్పేశారుగా!

టిల్లు-2 లిరికల్ సాంగ్.. స్టోరీ మొత్తం పాటలోనే చెప్పేశారుగా!

డీజే టిల్లు.. మళ్లీ ప్రేక్షకులను పలకరించేందుకు తెగ ఉవ్విళ్లూరుతున్నాడు. టిల్లు స్క్వేర్ గా మరోసారి తెలుగు ప్రేక్షకులను కితకితలు పెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు టైటిల్, పోస్టర్లు, కాస్ట్ గురించి మాత్రమే అప్ డేట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఒక లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. టికెట్టు కొనకుండా అంటూ స్టార్ బాయ్ సిద్ధు, అనుపమ సాంగ్ ని ఇరగదీశారు. ఈ సాంగ్ లోనే దాదాపుగా కథ కూడా చెప్పేసినట్లు అనిపిస్తోంది. అంటే ఈ పార్ట్ 2 కూడా దాదాపుగా డీజే టిల్లు తరహాలోనే ఉండబోతున్నట్లుగా ఉంది.

డీజే టిల్లు ప్రాజెక్ట్ లోకి అనుపమ వచ్చినప్పటి నుంచే ఒక డౌటనుమానం అందిరిలో ఉంది. ఆమె కాస్త బోల్డ్ గా కనిపిస్తుందా లేదా? లిమిటేషన్స్ లోనే ఉంటుందా? అనుకున్నారు. కానీ, అలాంటిది ఈ సినిమాలో ఉండబోవని అర్థమైంది. అనుమప కూడా కాస్త బోల్డ్ గానే కనిపిస్తోంది. ఇప్పటికే సాంగ్ ప్రోమోలో ఆమె క్యారెక్టర్ ని పరిచయం చేశారు. ఇప్పుడు ఈ సాంగ్ లో ఇంకాస్త ఆమె పాత్రను ఎలాబరేట్ చేశారు. ఇంక టిల్లు విషయానికి వస్తే.. మొదటి పార్ట్ లో ఎలా అయితే ఉన్నాడో.. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ఈ పాటలో కూడా అదే విషయాన్ని చెప్పారు. గతంలో అంత జరిగినా టిల్లు అన్నలో ఇంకా మార్పు రాలేదు అని.

ఈ పాటను రామ్ మిరియాల పాడాడు. లిరిక్స్ మాత్రమే కాకుండా.. మ్యూజిక్, సాంగ్ కూడా ఎంతో బాగుంది. డీజే టిల్లు పేరు సాంగ్ కి పోటీ పడే సాంగ్ లాగానే ఉంది. ఈ పాటలో టిల్లు స్క్వేర్ కథ చెబుతూ వచ్చారు. అయితే ఈ పార్ట్ మొదటి కథకు కొనసాగింపుగా ఉంటుందా? లేక ఫ్రెష్ స్టోరీగా తీస్తారా అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. ఈ సాంగ్ కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ చాలా కొత్తగా ఉన్నాయి. ఈ పాటకు రామ్ మిరియాల పాడటం మాత్రమే కాదు.. మ్యూజిక్ కూడా అందించాడు. రిలీజై అరగంట కూడా కాకుండానే ఈ సాంగ్ యూట్యూబ్ లో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ పాటతో టిల్లు స్క్వేర్ పై కూడా అంచనాలను అమాంతం పెంచేశారు.

Show comments