iDreamPost
android-app
ios-app

టిల్లు స్క్వేర్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటైల్స్

  • Published Mar 23, 2024 | 10:33 AM Updated Updated Mar 23, 2024 | 10:33 AM

2022లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సర్ప్రైజ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన డీజే టిల్లు సినిమాకి సీక్వెల్ గా మంచి క్రేజ్ తో స్టార్ట్ అయిన ఈ చిత్రం షూటింగ్ దశలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఆలస్యం అయినప్పటికీ క్రేజ్ మాత్రం తగ్గలేదు.

2022లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సర్ప్రైజ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన డీజే టిల్లు సినిమాకి సీక్వెల్ గా మంచి క్రేజ్ తో స్టార్ట్ అయిన ఈ చిత్రం షూటింగ్ దశలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఆలస్యం అయినప్పటికీ క్రేజ్ మాత్రం తగ్గలేదు.

  • Published Mar 23, 2024 | 10:33 AMUpdated Mar 23, 2024 | 10:33 AM
టిల్లు స్క్వేర్ ప్రీ రిలీజ్ బిజినెస్ డీటైల్స్

సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ నటించిన లేటెస్ట్ మ్యాడ్ ఎంటర్టైనర్ టిల్లు స్క్వేర్ మార్చి 29న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. విడుదలకు సిద్ధంగా ఉంది. 2022లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సర్ప్రైజ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన డీజే టిల్లు సినిమాకి సీక్వెల్ గా మంచి క్రేజ్ తో స్టార్ట్ అయిన ఈ చిత్రం షూటింగ్ దశలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఆలస్యం అయినప్పటికీ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఈ సినిమాలో నటించే అర్టిస్ట్స్ తో పాటు కథలో కూడా కొన్ని మార్పులను ఎదుర్కొంది. అలాగే రిలీజ్ డేట్ విషయంలో కూడా ఇప్పటికే రెండు మూడు సార్లు పోస్ట్ పోన్ అయింది. అయితే దీని వల్ల ఈ సినిమా బిజినెస్ కి మాత్రం ఎలాంటి సమస్యా రాలేదు. టిల్లు స్క్వేర్ 32 కోట్ల వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది.

వచ్చే వారాంతంలో ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది. సంక్రాంతి సీజన్ తర్వాత టాలీవుడ్‌లో పెద్ద క్రేజ్ ఉన్న సినిమాలేవీ విడుదల కాలేదు. చాలా కాలం తర్వాత ఇప్పుడు ఆడియెన్స్ తో పాటు ఇండస్ట్రీలో కూడా మోస్ట్ ఎవెయిటింగ్ ఫిల్మ్ గా టిల్లు స్క్వేర్ నిలిచింది. ఈ సినిమా ఇటీవలే సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. బిజినెస్ విషయానికి వస్తే, టిల్లు స్క్వేర్ ఆంధ్ర ఏరియాలో 12 కోట్లు, సీడెడ్ లో 3 కోట్లకు పైగా బిజినెస్ జరుపుకుంది. మొత్తం మీద, ప్రపంచవ్యాప్తంగా 32 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ 30 కోట్లకు పైగా కొనుగోలు చేసింది.

ఓటీటీలో విడుదలై మంచి స్పందన తెచ్చుకున్న అద్భుతం సినిమా ఫేం మల్లిక్ రామ్ టిల్లు స్క్వేర్ సినిమాకి దర్శకత్వం వహించగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల పై ఈ ప్రాజెక్ట్‌ ను నిర్మించారు. టిల్లు స్క్వేర్ మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సాధారణంగానే సీక్వెల్ సినిమాలంటే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంటుంది. దానికి అదనంగా ఈ సినిమాలోని రాధికా పాట ఇప్పటికే సూపర్ హిట్ అయింది. గ్లామర్ అవతార్ లో అనుపమ పరమేశ్వరన్ కూడా ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. మరి అందరూ అనుకున్నట్టు 2024లో తెలుగు సినీ పరిశ్రమకు మరో భారీ హిట్ గా టిల్లు స్క్వేర్ నిలుస్తుందని ఆశిద్దాం.

Jojobet GirişjojobetcasibomjojobetcasibomjojobetmariobetMadridbetbetcio güncelmatbet girişjojobetgrandpashabetgrandpashabet belge numarasıgrandpashabet belge numarasıJojobet GirişGrandpashabet destekgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişcasibomjojobet güncel girişjojobet giriş