టిల్లు స్క్వేర్ ఆరు రోజుల కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే!

సిద్ధు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ హావ ఇంకా కొనసాగుతూనే ఉంది, సినిమా విడుదలయ్యి ఆరు రోజులు అయినా కూడా థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో మారుమోగిపోతున్నాయి. మరి ఈ సినిమా ఆరు రోజులలో ఎంత కలెక్షన్స్ ఎంత సాధించాయో చూసేద్దాం.

సిద్ధు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ హావ ఇంకా కొనసాగుతూనే ఉంది, సినిమా విడుదలయ్యి ఆరు రోజులు అయినా కూడా థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో మారుమోగిపోతున్నాయి. మరి ఈ సినిమా ఆరు రోజులలో ఎంత కలెక్షన్స్ ఎంత సాధించాయో చూసేద్దాం.

ఇప్పటివరకు ఇండస్ట్రీలో విడుదలైన సిక్వెల్స్ అన్ని ఒక ఎత్తు.. సిద్ధు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు సిక్వెల్ టిల్లు స్క్వేర్ ఒక ఎత్తు అనేలా.. టిల్లు స్క్వేర్ సినిమా థియేటర్స్ లో దూసుకుపోతుంది. సినిమాలోని ప్రతి సీన్ ప్రేక్షకులను ఎంతో ఎంటర్టైన్ చేస్తూ ఉండడంతో.. సినిమా రిలీజ్ అయ్యి ఆరు రోజులు అయినా కూడా ఇంకా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో .. బాక్స్ ఆఫీస్ దగ్గర భీభత్సం సృష్టిస్తోంది. ఈ సినిమా సిక్వెల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి.. టీజర్ నుంచి థియేట్రికల్ రిలీజ్ వరకు.. ప్రతిదీ కూడా ప్రేక్షకులకు భారీ ఎక్స్పెక్టషన్స్ క్రియేట్ చేసింది. ఇక భారీ ఎక్స్పెక్టషన్స్ మధ్యన మార్చి 29న రిలీజ్ అయినా “టిల్లు స్క్వేర్” సినిమా.. అందరి అంచనాలను నిలబెట్టుకుంది. మొదటి రోజు ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా 23.7 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ సాధించింది. మరి ఈ సినిమా ఆరు రోజులలో ఎంత కలెక్షన్స్ ను రాబట్టిందో చూసేద్దాం.

టిల్లు స్క్వేర్ సినిమాను వరల్డ్ వైడ్ గా 800 థియేటర్స్‌లో విడుదల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 550 థియేటర్లలో టిల్లు స్వ్కేర్‌ రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 22 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా.. వరల్డ్ వైడ్‌గా రూ. 27 కోట్ల వరకు ప్రీ మార్కెట్ జరిగింది. దీనితో టిల్లు స్క్వేర్ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 28 కోట్లకు ఫిక్స్ అయింది. ఇక మొదటి రోజు 23.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించగా.. రెండ రోజూ కూడా టిల్లు స్క్వేర్ రూ.20 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టింది. ఇక నాలుగవ రోజు వరకు టిల్లు స్క్వేర్ సినిమా రూ. 78 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసి రూ.100 కోట్ల క్లబ్ లో పరుగులు తీసే దిశగా ఉందని అందరు భావించేలోపు.. ఈ సినిమా ఆరవ రోజు.. రూ.91 కోట్లను సాధించి.. అట్లుంటది టిల్లు గానితోని అని ప్రూవ్ చేసుకుంది. ఇంకా వచ్చేవి వేసవి సెలవలు కాబట్టి.. పైగా మధ్యలో ఇంకా ఏ సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా లేవు కాబట్టి.. టిల్లు స్క్వేర్ హావ ఇంకొన్ని రోజులు కొనసాగుతుండడం ఖాయం.

కాగా, డీజే టిల్లు సినిమాకు , టిల్లు స్క్వేర్ సినిమాకు డైరెక్టర్ మారినా కూడా.. టిల్లు పేరుకున్న బ్రాండ్ ను ఎక్కడా తగ్గకుండా.. రెట్టింపు ఎనర్జీతో సినిమాను రూపొందించడం అనేది మెచ్చుకోదగ్గ విషయం. ఇక ఈ సినిమాలో కుర్రాళ్ల ఆల్ టైమ్ క్రష్ .. అనుపమ సిద్ధుకు జోడిగా నటించడంతో.. టిల్లు స్క్వేర్ కు ఇంకాస్త క్రేజ్ పెరిగింది. వీరితో పాటు నేహా శెట్టి, ప్రిన్స్, మురళిధర్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇక సినిమా విడుదల తర్వాత జరిగిన సక్సెస్ మీట్ లో .. ఈ సినిమా మూడవ పార్ట్ కూడా ఉంటుందని అనౌన్స్ చేయడంతో. ఇప్పటినుంచే ఆ సినిమాపై అందరికి క్యూరియాసిటీ పెరిగిపోయింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే ఇస్తామని చెప్పుకొచ్చారు మేకర్స్. మరి, ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments