iDreamPost
android-app
ios-app

Rohin Hood: టైటిల్ కూడా అనౌన్స్ చేశారు.. మరి హీరోయిన్ సంగతేంటి?

  • Published Jan 27, 2024 | 4:43 PM Updated Updated Jan 27, 2024 | 4:43 PM

హీరో నితిన్ కొత్త ప్రాజెక్టుకు సంబంధించి టైటిల్ కూడా వచ్చేసింది. రాబిన్ హుడ్ అంటూ సరికొత్త టైటిల్ తో వస్తున్నాడు. అయితే హీరోయిన్ విషయంలోనే ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.

హీరో నితిన్ కొత్త ప్రాజెక్టుకు సంబంధించి టైటిల్ కూడా వచ్చేసింది. రాబిన్ హుడ్ అంటూ సరికొత్త టైటిల్ తో వస్తున్నాడు. అయితే హీరోయిన్ విషయంలోనే ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.

  • Published Jan 27, 2024 | 4:43 PMUpdated Jan 27, 2024 | 4:43 PM
Rohin Hood: టైటిల్ కూడా అనౌన్స్ చేశారు.. మరి హీరోయిన్ సంగతేంటి?

హీరో నితిన్ సినిమా అనగానే కుర్రాళ్లలో ఒక కొత్త ఉత్సాహం వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న యంగ్ హీరోల్లో నితిన్ కు ఫ్యాన్ బేస్ ఎక్కువ. యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో అనగానే చాలామందికి నితినే గుర్తొస్తాడు. అలాంటి నితిన్ ఇప్పుడు సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు. అయితే తర్వాతి ప్రాజెక్టులకు సంబంధించి ప్రయోగాలు కాకుండా.. హిట్టు ఇచ్చిన డైరెక్టర్ నే నమ్ముకున్నాడు. ఆ ప్రాజెక్టుకు సంబంధించి టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. అయితే ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే.. ఆ సినిమాకి ఇంకా హీరోయిన్ ఫైనల్ కాలేదట. ప్రస్తుతం టాలీవుడ్ లో ఇదే చర్చ జరుగుతోంది.

నితిన్ అంటే మినిమం గ్యారెంటీ హీరో. యాక్షన్, ఎమోషన్, కామెడీ, డాన్.. ఇలా ఏదైనా తన హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేస్తుంటాడు. కథలో కాస్త స్కోప్ ఉన్నా దానికి హిట్టు టాక్ తెప్పిచ్చేస్తాడు. కానీ, నితిన్ కి సరైన హిట్టు పడి కాస్త ఎక్కువ రోజులే అవుతోంది. అందుకే తన తర్వాత ప్రాజెక్టును తనకు హిట్టు ఇచ్చిన డైరెక్టర్ చేతిలో పెట్టాడు. భీష్మాతో నితిన్, వెంకీ కుడుముల ఇద్దరూ మంచి సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు ఈ కాంబో ‘రాబిన్ హుడ్’ సినిమాతో రిపీట్ కాబోతోంది. ఈ మూవీకి సంబంధించి టైటిల్ గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ఎంతో ఆకట్టుకునే విధంగా అయితే టైటిల్ గ్లింప్స్ ఉంది. కానీ, ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఒక ప్రశ్న అయితే టాలీవుడ్ లో బాగా వైరల్ అవుతోంది.

ఈ చిత్రానికి ఇంకా హీరోయిన్ ఫైనల్ కాలేదంట. మొదట ఈ ప్రాజెక్ట్ కోసం రష్మికా మందన్నాను అనుకున్నారట. అయితే ఆమె ఈ మూవీ నుంచి తప్పుకుంది. ఆ తర్వాత పూజా హెగ్దే పేరు పరిశీలనలోకి వచ్చింది అన్నారు. కానీ, ఆమె కూడా ఈ ప్రాజెక్టుకు ఫైనల్ కాలేదని చెప్పారు. డైరెక్టర్- హీరో కాంబో సెట్ అయ్యింది. టైటిల్ కూడా అనౌన్స్ చేసేశారు. కానీ, ఇంకా హీరోయిన్ ఫైనల్ కాలేదు అని వస్తున్న వార్తలతో నితిన్ ఫ్యాన్స్ కన్ఫూజన్ లో పడ్డారు. త్వరగా హీరోయిన్ ని కూడా ఫైనల్ చేయాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. అయితే మరోవైపు ఈ మూవీ కోసం కొత్తగా శ్రీలీల పేరు వినిపిస్తోంది. ఈ అమ్మడు మరోసారి నితిన్ తో జత కట్టబోతోంది అంటూ టాక్ స్టార్ట్ అయ్యింది. అయితే ఈమె పేరుకి సంబంధించి కూడా ఇంకా క్లారిటీ రాలేదు. అధికారికంగా అయితే ఎలాంటి సమాచారం లేదు.

ఈ రాబిన్ హుడ్ కథ విషయానికి వస్తే.. నితిన్ ఒక దొంగగా కనిపించబోతున్నాడు. దేశవ్యాప్తంగా ఉన్న డబ్బున్న వాళ్ల దగ్గర దొంగతనాలు చేస్తూ ఉంటాడు. డబ్బు గురించి ఒక ఫిలాసీ చెబుతూ.. స్టోరీకి సంబంధించి హింట్ ఇచ్చేశారు. “రూపాయి రూపాయి నువ్వు ఏం చేస్తావు అంటే అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య చిచ్చు పెడతాను అందంట” అంటూ నితిన్న చెప్పిన డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. దేశంలో ఉన్న ఆస్తిపరులు అందరూ తన అన్నదమ్ములు అని.. ఆభరాణాలు ధరించిన వాళ్లంతా తన అక్కచెల్లెళ్లు అంటూ చెప్పుకొచ్చాడు. కథ ప్లాట్ అందరికీ నచ్చే విధంగా ఉంది. వెంకీ కుడుముల మీద తెలుగు ఫ్యాన్స్ ఒక నమ్మకం ఉంది. నితిన్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీతో నితిన్ కి హిట్టు పక్కా అంటూ ఫ్యాన్స్ అప్పుడే సంబరాలు కూడా చేసుకుంటున్నారు. మరి.. రాబిన్ హుడ్ లో హీరోయిన్ ఫైనల్  కాలేదని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş