iDreamPost
android-app
ios-app

OTT Movies: ఓటీటీలో ఇంకా విడుదల కాని ఆ నాలుగు సినిమాలు

  • Published Mar 27, 2024 | 10:43 AM Updated Updated Mar 27, 2024 | 10:43 AM

ఈరోజుల్లో ప్రేక్షకులు ఒక సినిమా థియేటర్లలో విడుదలయ్యే తేదీతో పాటు ఓటీటీలో కూడా ఎప్పుడు వస్తుందని తెలుసుకుంటున్నారు.అయితే థియేటర్లలో విడుదలై అరు నెలలు, సంవత్సరం పైనే అవుతున్న ఇంకా ఓటీటీలోకి రాని నాలుగు సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు

ఈరోజుల్లో ప్రేక్షకులు ఒక సినిమా థియేటర్లలో విడుదలయ్యే తేదీతో పాటు ఓటీటీలో కూడా ఎప్పుడు వస్తుందని తెలుసుకుంటున్నారు.అయితే థియేటర్లలో విడుదలై అరు నెలలు, సంవత్సరం పైనే అవుతున్న ఇంకా ఓటీటీలోకి రాని నాలుగు సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు

  • Published Mar 27, 2024 | 10:43 AMUpdated Mar 27, 2024 | 10:43 AM
OTT Movies: ఓటీటీలో ఇంకా విడుదల కాని ఆ నాలుగు సినిమాలు

ఈరోజుల్లో ప్రేక్షకులు ఒక సినిమా థియేటర్లలో విడుదలయ్యే తేదీతో పాటు ఓటీటీలో కూడా ఎప్పుడు వస్తుందని తెలుసుకుంటున్నారు. నిజానికి వారు రెండు వర్గాలుగా విడిపోయారు అని చెప్పవచ్చు. ఒక వర్గం సినిమాలని థియేటర్లలో చూడటానికే ఇష్ట పడితే, మరో వర్గం ఓటీటీలో చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణంగా తెలుగు, తమిళ, కన్నడతో పాటు మలయాళ సినిమాలు థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకు ఓటీటీలో విడుదల అవుతుంటాయి. హిందీ సినిమాలు మాత్రం థియేట్రికల్ రిలీజ్ కి ఓటీటీ రిలీజ్ కి ఎనిమిది వారాల గ్యాప్ ను పాటిస్తాయి. అయితే థియేటర్లలో విడుదలై అరు నెలలు, సంవత్సరం పైనే అవుతున్న ఇంకా ఓటీటీలోకి రాని నాలుగు సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఆ నాలుగు సినిమాల్లో తెలుగు నుంచి ఏజెంట్, హిందీ నుంచి గణపత్, జరా హాట్కే జరా బచ్కే సినిమాలు ఉండగా మళయాళం నుంచి రామచంద్ర బాస్ అండ్ కో కూడా ఉంది.

అఖిల్ అక్కినేని కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్‌ గా నిలిచిన సినిమా ఏజెంట్. నిర్మాతలు భారీ బడ్జెట్ ఖర్చు చేసినప్పటికీ, భీభత్సమైన హైప్ తో విడుదలయిన ఈ చిత్రం అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యింది. ఈ చిత్రం ఏప్రిల్ 2023లో థియేటర్లలో విడుదలైంది. కానీ తెలియని కారణాల వల్ల ఇది ఇంకా ఏ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లోనూ విడుదల కాలేదు. అప్పట్లో సోనీ లైవ్ ప్లాట్‌ఫారమ్‌లో ఏజెంట్ సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వస్తుందని వార్తలు వచ్చినా అవి నిజం కాలేదు. ఇక మరో చిత్రం సారా అలీ ఖాన్, విక్కీ కౌశల్ జంటగా నటించిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జరా హాట్కే జరా బచ్కే. చక్కని హాస్యంతో కాస్త ఎమోషన్ ను కూడా జోడించిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించి బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచింది. అయితే, ఈ సినిమా ఇప్పటికీ ఏ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో వస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటిగా మిగిలిపోయింది. జరా హాట్కే జరా బచ్కే గతేడాది జూన్‌లో థియేటర్లలో విడుదలైంది.

టైగర్ ష్రాఫ్, కృతి సనన్ జంటగా నటించిన బాలీవుడ్ చిత్రం గణపత్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మారింది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కూడా ఒక ముఖ్య పాత్రను పోషించారు. ఈ సినిమా కూడా ఇంకా ఓటీటీ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రాలేదు. గణపత్ – ఎ హీరో ఈజ్ బోర్న్ సినిమా అక్టోబర్ 2023లో థియేటర్లలో విడుదలైంది. ఇక ఈ లిస్ట్‌లో చివరి సినిమా నివిన్ పౌలీ హీరోగా నటించిన రామచంద్ర బాస్ అండ్ కో. ఈ సినిమా దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కోతా సినిమాతో పాటు విడుదలైంది. కానీ చిత్రంగా ఈ సినిమా కూడా ఇప్పటికీ ఓటీటీ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రాలేదు. ఈ సినిమా ఆగస్ట్, 2023లో థియేటర్లలో విడుదలైంది. హెయిస్ట్ కామెడీ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా బలహీనమైన స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే వల్ల ఫ్లాప్ అయ్యింది.

Jojobet GirişMadridbetMariobetmeritbetcasibom girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetcasibom girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet giriş