iDreamPost
android-app
ios-app

ఈ ఏడాది ఆస్కార్ బరిలో నిలిచిన సినిమాలు ఇవే!

  • Published Jan 24, 2024 | 11:24 AM Updated Updated Jan 24, 2024 | 11:25 AM

చలన చిత్ర రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డు ఆస్కార్. సినీ రంగంలోని అన్ని భాగాల్లో ప్రతభ కనబరిచిన వారికి ఆస్కార్ పురస్కారం ఇచ్చి గౌరవిస్తారు.

చలన చిత్ర రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డు ఆస్కార్. సినీ రంగంలోని అన్ని భాగాల్లో ప్రతభ కనబరిచిన వారికి ఆస్కార్ పురస్కారం ఇచ్చి గౌరవిస్తారు.

  • Published Jan 24, 2024 | 11:24 AMUpdated Jan 24, 2024 | 11:25 AM
ఈ ఏడాది ఆస్కార్ బరిలో నిలిచిన సినిమాలు ఇవే!

సీనీ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డులో ఆస్కార్ ఒకటి. అకాడమీ అవార్డులు ప్రతి సంవత్సరం చలనచిత్ర రంగంలో అన్ని విభాగాల్లో అత్యుత్తమంగా ప్రతిభ కనబర్చిన దర్శకులు, నటీనటులు, రచయితలు, సంగీత దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణులకు ఇచ్చే బహుమతులు. 1928లో ప్రముఖ నటులు డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్, విలియం డెమిలీ కలిసి ఈ ఆస్కార్ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. లాస్ ఎంజీల్స్ లో ఆస్కార్ ప్రధానోత్సవం అత్యంత వైభోగంగా జరుపుతుంటారు.. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది వీక్షిస్తుంటారు. గత ఏడాది రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ మూవీలో ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది. ఈ ఏడాది ఆస్కార్ బరిలో ఉన్న మూవీస్ ఏంటో చూద్దాం..

ప్రపంచ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆస్కార్ అవార్డుల వేడుకకు అంతా సిద్దమవుతుంది. సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ అయిన ప్రతి ఒక్కరికీ ఆస్కార్ బరిలో నిలవాని.. అవార్డు సొంతం చేసుకోవాలనే తపన ఉంటుంది. అతికొద్ది మందికే ఆ అదృష్టం వరిస్తుంది. ఈ పురస్కారాలకు ఉండే క్రేజీ అలాంటిది. ఆస్కార్ అవార్డుల కోసం ప్రపంచ దేశాల్లోని చిత్ర పరిశ్రలు పోటీ పడుతుంటాయి. ఇప్పటి వరకు భారత్ నుంచి పలు చిత్రాలు, నటీనటులు ఆస్కార్ ఆవార్డ్స్ కోసం నామినెట్ అయ్యారు. గత ఏడాది తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు వచ్చింది.. ఈ అవార్డును మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, రచయిత చంద్రబోస్ లు అందుకున్నారు. ఈ ఏడాది ఆస్కార్ సందడి మొదలైంది.

Movies in the Oscar race

ఈ ఏడాది మార్చి10న.. 96వ ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ ఏంజిల్స్ లోని డాల్ఫీ ధియేటర్లో అంగరంగ వైభవంగా జరగనుంది. ఇప్పటికే నామినేషన్ అయిన చిత్రాలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించింది ఆస్కార్ అకాడమీ. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ విదేశీ చిత్రం, ఉత్తమ దర్శకులు ఇలా 23 విభాగాల్లో 120 కి పైగా చిత్రాలు, డాక్యూమెంటరీలకు సంబంధిచిన నామినేషన్ల జాబితా రిలీజ్ చేసింది. ఈ ఏడాది బరిలో నిలిచిన చిత్రాల్లో ఎనాటమీ ఆఫ్ ఎ ఫాల్, బార్బీ, అమెరికన్ ఫిక్షన్, ది హూల్డోవర్స్, ఓపెన్‌హైమర్‌, మెస్ట్రో, , కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్, పాస్ట్ లైవ్స్, దిజోన్ ఆఫ్ ఇంట్రెస్ట్, పూర్ థింగ్స్ లు ఉత్తమ చిత్రాల నామినేషన్ లో చోటు దక్కించుకుననాయి. వీటీలో ఓపెన్ హైమార్, ది పూర్ థింగ్స్, బార్బీ, కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ చిత్రాలకు అత్యధిక నామినేషన్లు వచ్చాయి. ఈసారి ఏ సినిమాకు ఆస్కార్ అదృష్టం వరించనుందో చూడాలి. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.