iDreamPost
android-app
ios-app

టాలీవుడ్ పరిస్థితి ఇలా అయ్యిందేంటి? ఈ వారం సినిమాలే లేవా..

  • Author ajaykrishna Published - 03:21 PM, Mon - 9 October 23
  • Author ajaykrishna Published - 03:21 PM, Mon - 9 October 23
టాలీవుడ్ పరిస్థితి ఇలా అయ్యిందేంటి? ఈ వారం సినిమాలే లేవా..

అక్టోబర్ నెలలో పెద్ద పండుగ దసరా వస్తుందనే ఊపుతో ప్రేక్షకులలో ఉత్సాహం మొదలైంది. అందుకు కారణం.. దసరా పండుగతో పాటు సెలవులు, కొత్త సినిమాల రిలీజులు ఉన్నాయని. మొదటి శుక్రవారం ఏకంగా పది వరకు మీడియం, చిన్న రేంజ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయ్యాయి. పది సినిమాలలో ఒక సినిమాకు సూపర్ హిట్ టాక్.. ఇంకో సినిమాకు పాజిటివ్ టాక్. కాస్తో కూస్తో బజ్ తో వచ్చిన సినిమాలు కూడా బోల్తా కొట్టడం షాకింగ్ గా అనిపిస్తుంది. గతవారం విడుదలైన పది సినిమాలలో కొత్త వాళ్ళతో సితార బ్యానర్ వారు తీసిన ‘మ్యాడ్’ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత సిద్ధార్థ్ హీరోగా వచ్చిన చిన్నా.. ఎక్కువ థియేటర్స్ దొరక్కపోయినా పాజిటివ్ టాక్ దక్కించుకుంది.

కట్ చేస్తే.. అక్టోబర్ రెండో వారంకు ఇంకా నాలుగు రోజులే ఉంది. శుక్రవారం రోజు రిలీజ్ అవ్వడానికి పెద్ద సినిమాలు కాదు కదా.. కనీసం మీడియం, తెలిసిన చిన్న సినిమాలు కూడా లేకపోవడం గమనార్హం. మొదటి వారంలో పది వరకు రిలీజై.. బాక్సాఫీస్ పై ఒకేసారి దాడి చేశాయి. వాటిలో మంచి సినిమాలకు థియేటర్స్ దొరక్క ఫలితాలు ఆశించిన విధంగా రాకపోయి ఉండొచ్చు. కానీ.. ఆ వారం అన్ని సినిమాలు రిలీజైతే.. ఇప్పుడు వచ్చే శుక్రవారం కనీసం తెలిసిన సినిమాలు ఒక్కటీ లేకపోవడం అనేది నిజంగా షాకిస్తున్న విషయం. టాలీవుడ్ లో దసరాకు ముందు ఉండాల్సిన ఊపు ఇది కాదు. వారానికి ఒక్క హిట్ కూడా కాన్స్టంట్ గా నమోదు అవ్వట్లేదు. అంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్ధమవుతుంది.

వచ్చే శుక్రవారం.. ఏవైనా ఇంటరెస్టింగ్ సినిమాలు ఉన్నాయేమో అని అందరు వెయిట్ చేస్తున్నారు. కానీ.. చెప్పుకోదగ్గ సినిమాలు ఒక్కటి కూడా లేవు. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నా.. జనాలకు సినిమాల పేర్లు రిజిస్టర్ అవ్వక థియేటర్స్ కి వెళ్లే సూచనలు కూడా కనిపించడం లేదని ట్రేడ్ వర్గాల టాక్. ఇప్పుడు అక్టోబర్ 13న రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ చిన్నవే. కనీసం.. ఈ సినిమాలు వస్తున్నాయని జనాలకి కూసింత అవగాహన కూడా లేదంటే నమ్మండి. తంతిరం చాప్టర్ 1, మధురపూడి గ్రామం అనే నేను, రాక్షస కావ్యం, ప్రేమ యుద్ధం, ఒక్కడే 1 వెంకన్న ఆన్ డ్యూటీ.. సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అసలు ఈ సినిమాలు ఉన్నాయని కూడా ప్రేక్షకులకు తెలియదు. ఇవేగాక తమిళ, హిందీ నుండి పలు డబ్బింగ్ సినిమాలు వస్తున్నాయి. అవికూడా తెలిసిన ముఖాలు ఉన్నవి కాదు. సో.. దసరా బిగ్ మూవీస్ తో గ్రాండ్ గా ఉండబోతుంది. కానీ.. దాని ముందు వారం టాలీవుడ్ గల్లాపెట్టె ఖాళీగా ఉండనుందట. మరి వచ్చే రిలీజ్ ల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş