iDreamPost

ఈ వారం థియేటర్లలో వచ్చే సినిమాలివే.. ఆ మూవీపైనే అందరి చూపు

This Week’s Theatrical Releases.. ప్రతి శుక్రవారం ధియేటరల్లో కొత్త సినిమాలు సందడి చేస్తుంటాయి. ఫేవరేట్ హీరోలు, హీరోయిన్లతో సంబంధం లేకుండా సినిమాలు వాచ్ చేస్తుంటారు మూవీ లవర్స్. వారి కోసం అయితే.. ఈ వారం సుమారు పది సినిమాల వరకు రిలీజ్ కాబోతున్నాయి. ఇంతకు అవి ఏంటంటే..?

This Week’s Theatrical Releases.. ప్రతి శుక్రవారం ధియేటరల్లో కొత్త సినిమాలు సందడి చేస్తుంటాయి. ఫేవరేట్ హీరోలు, హీరోయిన్లతో సంబంధం లేకుండా సినిమాలు వాచ్ చేస్తుంటారు మూవీ లవర్స్. వారి కోసం అయితే.. ఈ వారం సుమారు పది సినిమాల వరకు రిలీజ్ కాబోతున్నాయి. ఇంతకు అవి ఏంటంటే..?

ఈ వారం థియేటర్లలో వచ్చే సినిమాలివే.. ఆ మూవీపైనే అందరి చూపు

ప్రతి శుక్రవారం థియేటర్లలో కొత్త మూవీలేమీ రిలీజ్ అవుతున్నాయో ఈగర్లీ వెయిట్ చేస్తుంటారు మూవీ లవర్స్. పెద్ద సినిమాలైతే వారం ముందు నుండే హడావుడి నెలకొంటుంది. థియేటర్ల దగ్గర కటౌట్స్ కట్టడం దగ్గర నుండి డీజేలతో హంగామా చేసేంత వరకు హంగామా చేస్తుంటారు ఫ్యాన్స్. ఇక చిన్న హీరోల సినిమాలతై.. రిలీజ్ ముందు రోజు నుండి బజ్ నడుస్తూ ఉంటుంది. అయితే కొంత మంది ఫ్యానిజంతో పని లేకుండా సినిమాలు చూసేందుకు వస్తుంటారు. తొలి రోజు తొలి టాక్ కోసం చూస్తుంటారు. సినిమా బాగుందని టాక్ నడిస్తే.. శని, ఆదివారాలు కుటుంబ సభ్యులతో సహా థియేటర్లకు వెళ్లి సినిమాను ఎంజాయ్ చేసేవాళ్లు ఉన్నారు. అలాగే ఈ వారం కూడా కొన్ని సినిమాలు పలకరించబోతున్నాయి.

కొన్ని డబ్బింగ్, కొన్ని తెలుగు సినిమాలు, ఓ రీ రిలీజ్ సినిమా ఉంది. ఇంతకు ఆ మూవీస్ ఏంటంటే.. సుధీర్ బాబు హీరోగా వస్తున్న హరోం హర. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. జ్ఞానసాగర్ దర్శకుడు. మాళవిక శర్మ, అక్షర గౌడ హీరోయిన్లు. అదేవిధంగా కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి డబ్బింగ్ మూవీ మహారాజాతో ప్రేక్షకులను పలకరించేందుకు జూన్ 14న వస్తున్నాడు. మహారాజా మూవీ ఆయన 50వ చిత్రం కావడం విశేషం. అజయ్ ఘోష్, ఆమని కీలక పాత్రలో పోషించిన చిత్రం మ్యూజిక్ షాప్ మూర్తి. చాందినీ చౌదరి మెయిన్ హీరోయిన్. ఈ సినిమా కూడా ఈ శుక్రవారం రాబోతుంది. ట్రైలర్ సినిమాపై అంచనాలు పెరిగేలా చేసింది. శివ పాలడుగు దర్శకుడు. అలాగే చాందినీ చౌదరి నటించిన మరో మూవీ కూడా ఈ వారమే విడుదల కాబోతుంది. అదే యేవమ్.

ప్రకాశ్ దంతలూరి దర్శకుడు. ఈ సినిమాకు నిర్మాణ భాగస్వామిగా హీరో నవదీప్ ఉండటం గమనార్హం. ఇదే కాకుండా ఇంద్రాణీ అనే సినిమా జూన్ 14న విడుదల కాబోతుంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఉండనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. యానీయా, అంకిత, అజయ్ ప్రధాన పాత్ర‌ల‌లో నటించారు. స్టీఫెన్ పల్లం స్వీయ దర్శక నిర్మాణంలో తెరకెక్కించాడు. నీదారే నీకథ అనే మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. ఇక కేజీఎఫ్ సినిమాతో అలరించిన కన్నడ టాప్ హీరోల్లో ఒకరు యష్..డబ్బింగ్ మూవీ రాజధాని రౌడీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అలాగే కన్నడ చిత్రం లవ్ మాక్ టైల్‌కు కొనసాగింపుగా తెరకెక్కిన లవ్ మాక్ టైట్ 2 కూడా తెలుగులో విడుదల కానుంది. ఇక రీ రిలీజ్ మూవీ కూడా రాబోతుంది. అదే పవర్ స్టార్ వపన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమా. జూన్ 15న మరోసారి ప్రేక్షకులను పలరించేందుకు రాబోతుంది. అయితే  అందరి చూపు హరోం హర మూవీపైనే  ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి