iDreamPost
android-app
ios-app

‘బావ బావమరిది‘ మూవీలో నటించిన ఈ పిల్లాడు.. ఇప్పుడు స్టార్ హీరో

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ సలార్ థియేటర్లలో సందడి చేస్తోంది. ప్రభాస్.. గ్లోబల్ స్టార్ కావడానికి అడుగులు వేయించిన వ్యక్తి పెద్దనాన్న, దివంగత నటుడు రెబల్ స్టార్ కృష్ణం రాజు. కృష్ణం రాజు హీరోగా, విలన్ గా, సపోర్టింగ్ క్యారెక్టర్లతో నటించారు. ఆయన నటించిన చిత్రాల్లో ఒకటైన..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ సలార్ థియేటర్లలో సందడి చేస్తోంది. ప్రభాస్.. గ్లోబల్ స్టార్ కావడానికి అడుగులు వేయించిన వ్యక్తి పెద్దనాన్న, దివంగత నటుడు రెబల్ స్టార్ కృష్ణం రాజు. కృష్ణం రాజు హీరోగా, విలన్ గా, సపోర్టింగ్ క్యారెక్టర్లతో నటించారు. ఆయన నటించిన చిత్రాల్లో ఒకటైన..

‘బావ బావమరిది‘ మూవీలో నటించిన ఈ పిల్లాడు.. ఇప్పుడు స్టార్ హీరో

సినీ పరిశ్రమలో ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్టులు వర్క్ చేశారు.. చేస్తూనే ఉన్నారు. కమల్, ఆలీ, తరుణ్, శ్రీదేవి, షామిలి, షాలిని, మీనా వంటి వారికి చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంత మంచి పేరు ఉందో అందరికీ తెలుసు. చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి.. చదువులు పూర్తయ్యాక సినిమా రంగంలోకి వచ్చి హీరో, హీరోయిన్లుగా రాణిస్తున్నారు. ఈ పంథా ఇప్పుడు కొత్తేమీ కాదూ. కమల్ హాసన్ మొదలుకుని తేజ సజ్జా వరకు ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. అయితే కొంత మంది చైల్డ్ ఆర్టిస్టులు గుర్తింపు పొందితే.. కొందరు ఒకటి రెండు సినిమాలతో సరిపెట్టుకుంటూ ఉంటారు. ఇదిగో ఈ కోవలోకి వస్తాడు ఈ ఫోటోలోని పిల్లాడు. కృష్ణంరాజు, జయసుధలతో కనిపిస్తున్న ఈ పిల్లవాడిని గుర్తుపట్టారా..? ఇతడు ఇప్పుడొక సూపర్ స్టార్.

తెలుగు పరిశ్రమలో ది బెస్ట్ రీల్ కపుల్స్‌లో ఒకరు కృష్ణంరాజు-జయసుధ. వీరిద్దరూ అనేక సినిమాల్లో నటించారు. హిట్ పెయిర్‌గా నిలిచారు. ఆ మూవీల్లో ఒకటి 90ల్లో వచ్చిన బావా బావా మరిది. ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఈ మూవీలో సుమన్, మాలాశ్రీ మరో పెయిర్. ఈ సినిమాలో జయసుధ తమ్ముడి పాత్రలో కనిపిస్తున్నాడు హీరో సుమన్. మీరు చూస్తున్న ఈ పిక్ ఆ మూవీలోనిదే. మరీ ఈ పిల్లాడు ఎవరో తెలుసా.. గుర్తుపట్టలేకపోతున్నారా.. మరెవ్వరో కాదూ కోలీవుడ్ హ్యాండ్సమ్ హీరో జయం రవి. అవును మనకు తెలిసి జయం మూవీతోనే రవి ఎంట్రీ ఇచ్చారు అనుకుంటారు కానీ.. అంతకు ముందు మన తెలుగులోనే బాల నటుడిగా మెరిశాడు రవి.

బావ బావమరిది మూవీ ఓ తమిళ సినిమాకు రీమేక్. ఈ మూవీని 1993లో తెలుగులో రీమేక్ చేశారు ఎడిటర్ మోహన్. దీనికి శరత్ దర్శకుడు. రాజ్ కోటి సంగీతం ఈ సినిమాకు హైలెట్. బావగా కృష్ణం రాజు, బావమరిదిగా సుమన్ నటించారు. సుమన్ చిన్నప్పటి పాత్రలో జయం రవి కొన్ని సీన్లలో కనిపిస్తాడు. తెలుగులో కూడా మంచి హిట్ అందుకుంది ఈ చిత్రం. ఈ మూవీ పేరు చెబితే ముందుగా గుర్తుకు వచ్చేది సిల్క్ స్మిత ‘బావలు సయ్యా సయ్’ సాంగే. గజ్జె గళ్లుమన్నదో గుండె ఝళ్లుమన్నదో సాంగ్ కూడా ఈ సినిమాకు హైలెట్. ఇందులో ప్రతి పాట హిట్ గానే నిలిచింది. ఈ సినిమాను ఎంఎం బ్యానర్ పై ఎడిటర్ మోహన్ నిర్మించారు.

ఎడిటర్ మోహన్ చిన్నకుమారుడు జయం రవి అన్న సంగతి తెలిసిందే. ఇక ఆయన పెద్ద కుమారుడు మోహన్ రాజా కూడా ప్రముఖ దర్శకుడు. తెలుగులో హనుమాన్ జంక్షన్, గాడ్ ఫాదర్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం జయం రవి సుమారు నాలుగు చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు వారికి జయం రవి సుపరిచితమే. జయం రవి చిత్రాల్లో మీకు ఏ మూవీ ఇష్టమో కామెంట్ల రూపంలో తెలియజేయండి.