Dharani
Serials-Sunday: సీరియల్ లవర్స్‌కి పండగలాంటి వార్త అని చెప్పవచ్చు. ఇకపై ఆదివారం కూడా టెలికాస్ట్ కానున్నాయి. ఆ వివరాలు..
Serials-Sunday: సీరియల్ లవర్స్‌కి పండగలాంటి వార్త అని చెప్పవచ్చు. ఇకపై ఆదివారం కూడా టెలికాస్ట్ కానున్నాయి. ఆ వివరాలు..
Dharani
సీరియల్స్ లేకుండా ఇండియన్ టెలివిజన్ చరిత్ర లేదు. దూరదర్శన్ కాలం నుంచి ధారావాహికలు ప్రసారం అవుతున్నాయి. ఏళ్లకేళ్లు కొనసాగుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రారంభంలో వారానికి ఒక్కసారి వచ్చేవి. రోజులు మారుతున్న కొద్ది.. ప్రేక్షకుల్లో వీటి పట్ల పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని.. వీటి టెలికాస్ట్ సమయాల్లో మార్పులు చేశారు. దాంతో ఒక్కో రోజు పెంచుతూ.. శుక్రవారం వరకు ఐదు రోజుల పాటు సీరియల్స్ ప్రసారం అయ్యేలా చూశారు. ఇక టీవీలు అందరికి అందుబాటులోకి రావడం.. ప్రైవేటు ఛానెల్స్ ఎంట్రీతో సీరియల్స్‌కు మహర్దశ పట్టిందని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు సీరియల్స్ లేని టీవీ ఛానల్ లేదంటే అతిశయోక్తి కాదు.
ఇప్పుడు సినిమాల కన్నా కూడా సీరియల్స్‌కే క్రేజ్ బాగుంది. ప్రేక్షకులు కూడా వాటిని బాగా ఆదరిస్తున్నారు. అందుకే గతంలో కేవలం శుక్రవారం వరకు మాత్రమే సీరియల్స్ టెలికాస్ట్ అయ్యేవి. శని, ఆదివారాల్లో వాటికి బ్రేక్ ఇచ్చి రియాలిటీ షోస్, స్పెషల్స్ పోగ్రామ్స్‌తో పాటు సినిమాలను టెలికాస్ట్ చేసేవారు. ఆ తర్వాత శనివారం కూడా సీరియల్స్ టెలికాస్ట్ చేస్తూ ఆదివారం మాత్రమే సీరియల్స్‌కు బ్రేక్ ఇస్తూ వస్తున్నాయి ఛానెల్స్. కానీ ఇకపై ఆదివారం కూడా సీరియల్స్‌కి నో బ్రేక్.. సండే కూడా సీరియల్స్ టెలికాస్ట్ చేయడానికి రెడీ అయ్యింది ఓ ఛానెల్. ఆ వివరాలు..
ఇకపై ఆదివారం కూడా సీరియల్స్ టెలికాస్ట్ చేయబోతున్నట్లు.. ప్రముఖ టీవీ ఛానెల్ జీ తెలుగు ప్రకటించింది. తమ ఛానెల్‌లో హయ్యెస్ట్ టీఆర్‌పీ రేటింగ్ ఉన్న ఆరు సీరియల్స్‌ను ఇకపై ఆదివారం కూడా టెలికాస్ట్ చేయబోతున్నట్లు చెప్పుకొచ్చింది. ఈ సీరియల్స్ లవర్స్.. ఇకపై గ్యాప్, బ్రేక్ లేకుండా ఆదివారం కూడా సీరియల్స్ చూడొచ్చు అన్నమాట. ఇక ఆదివారం నాడు టెలికాస్ట్ చేయబోయే సీరియల్స్ జాబితాలో చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి, మా అన్నయ్య, నిండు నూరేళ్ల సావాసం, మేఘ సందేశం, పడమటి సంధ్యారాగం, త్రియని సీరియల్స్ ఉన్నాయి. ఇకపై ఇవి ఆదివారం కూడా టెలికాస్ట్ అవుతాయని జీతెలుగు ప్రకటించింది.
ఈవారం నుంచే ఈ సీరియల్స్ అన్నీ వారానికి ఏడు రోజుల పాటు అనగా బ్రేక్ లేకుండా ఆదివారం కూడా టెలికాస్ట్ అవుతాయని జీతెలుగు చెప్పుకొచ్చింది. ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ప్రసారం అయ్యే సీరియల్స్‌ని మాత్రమే ఆదివారం కూడా టెలికాస్ట్ చేయనున్నట్లు జీ తెలుగు తెలిపింది. ఈ వారం నుంచే ఈ మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. మధ్నాహ్నం ప్రసారమయ్యే సీరియల్స్‌కు మాత్రం ఆదివారం బ్రేక్ ఇస్తున్నట్లు చెప్పుకొచ్చింది. ఈ నిర్ణయంపై సీరియల్ లవర్స్ హర్షం వ్యక్తం చేస్తుండగా.. చాలా మంది ప్రేక్షకులు బాబోయ్ ఇక ఆదివారం కూడా వదలరా అని కామెంట్స్ చేస్తున్నారు. జీతెలుగు ప్రయోగం సక్సెస్ అయితే మిగతా ఛానెల్స్ కూడా ఇదే బాటలోనే పయనిస్తాయి అంటున్నారు. మరి ఈ నిర్ణయం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.