iDreamPost
android-app
ios-app

ప్రపంచ కప్‌ దెబ్బ.. భారీగా నష్టపోయిన ఆ సినిమాలు!

నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్లో భారత్‌ ఓటమి పాలైంది. దీంతో కొన్ని కోట్ల మంది భారతీయులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. స్టాటస్‌ల రూపంలో తమ బాధను వెల్లగక్కారు.

నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్లో భారత్‌ ఓటమి పాలైంది. దీంతో కొన్ని కోట్ల మంది భారతీయులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. స్టాటస్‌ల రూపంలో తమ బాధను వెల్లగక్కారు.

ప్రపంచ కప్‌ దెబ్బ.. భారీగా నష్టపోయిన ఆ సినిమాలు!

భారత దేశం మొత్తం నిన్న ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో విజయం కోసం ఎంతగానో పరితపించింది. ఊహించని విధంగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌ ఓటమి పాలైంది. దీంతో భారత్‌ ప్రపంచ కప్‌ గెలుస్తుందని ఆశలు పెట్టుకున్న కొన్ని కోట్ల మంది జనం నిరాశకు గురయ్యారు. తట్టుకోలేని దుఃఖంలో కన్నీళ్లు సైతం పెట్టుకున్న వారు లేకపోలేదు. ఓ వైపు ప్రపంచ కప్‌ ఓటమి దేశ ప్రజలను శోక సంద్రంలో ముంచేస్తే.. మరో వైపు నిన్న ప్రపంచ కప్‌ మ్యాచ్‌ కారణంగా కొత్త సినిమాలు భారీగా నష్టపోయాయి.

అందరూ మ్యాచ్‌ చూడ్డానికి టీవీలకు, సెల్‌ఫోన్లను అతుక్కుపోయారు. సినిమాలకు వెళ్లే ఆలోచన కూడా చేయలేదు. దీంతో నిన్న పొద్దుట్నుంటే థియేటర్లు వెలవెలబోయాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం, సప్త సాగరాలు దాటి, స్పార్క్‌ సినిమాలతో మరికొన్ని సినిమాలు ఆడుతున్నాయి. శుక్ర,శనివారం మంచి వసూళ్లతో దూసుకెళ్లాయి. కానీ, ఆదివారం ప్రపంచ కప్‌ మ్యాచ్‌ ఉండటంతో థియేటర్లకు జనం రాలేదు. రెండు రోజులతో పోల్చుకుంటే భారీగానే వసూళ్లను కోల్పోయాయి.

మంగళవారం సినిమా నిన్న ఉత్తరాంధ్రలో కేవలం 6 .5 లక్షల షేరు మాత్రమే వచ్చిందంటే.. జనం ఏ మాత్రం థియేటర్లకు వెళ్లారో అర్థం అయిపోతుంది. మొదటి రోజు మంగళవారం సినిమా రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఏకంగా 2 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. దేశ వ్యాప్తంగా 5 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. మొదటి రోజు కంటే రెండో రోజు కలెక్షన్లు పెరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా దాదాపు మూడు కోట్ల రూపాయలు.. ప్రపంచ వ్యాప్తంగా 6 కోట్ల రూపాయలు వచ్చినట్లు సమాచారం.

కానీ, ఆదివారం మాత్రం కోటి రూపాయల లోపే కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. మిగిలిన సినిమాల విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కేవలం తెలుగు సినిమాలే కాదు. దేశ వ్యాప్తంగా థియేటర్లలో ఆడుతున్న చాలా సినిమాలకు కలెక్షన్ల విషయంలో భారీగా గండిపడింది. కాగా, మంగళవారం సినిమా నవంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచనాలకు తగ్గట్టుగానే చిత్రానికి థియేటర్లలో మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ప్రేక్షకుల నుంచే కాక, విమర్శకులనుంచి కూడా మంచి రివ్యూలను రాబట్టింది.

సప్త సాగరాలు దాటి కూడా అంచనాలను మించి విజయం సాధించింది. రెండో భాగంలో రక్షిత్‌ నటనకు మంచి మార్కులు పడ్డాయి. విమర్శకులు సైతం ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రశంసించారు. కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా థియేటర్లలో దూసుకుపోతోంది(నిన్న ఒక్కరోజు తప్ప) మరి, ప్రపంచ కప్‌ కారణంగా పలు సినిమాలు కలెక్షన్లను కోల్పోటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.