iDreamPost
android-app
ios-app

2023 లో టాప్‌ 15 డిజాస్టర్ సినిమాలు ఇవే!

  • Published Dec 14, 2023 | 4:42 PM Updated Updated Dec 14, 2023 | 4:42 PM

ప్రతి సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వందల సినిమాలు ప్రొడ్యూస్ అవుతున్నాయి. అయితే అందులో సక్సెస్‌ అయ్యేవి కొన్ని, బ్లాక్ బస్టర్‌ హిట్స్ అయ్యేవి ఇంకా కొన్ని. ఇక ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తాయని భావించిన 15 సినిమాలు నిరాశ పరిచాయి.

ప్రతి సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వందల సినిమాలు ప్రొడ్యూస్ అవుతున్నాయి. అయితే అందులో సక్సెస్‌ అయ్యేవి కొన్ని, బ్లాక్ బస్టర్‌ హిట్స్ అయ్యేవి ఇంకా కొన్ని. ఇక ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తాయని భావించిన 15 సినిమాలు నిరాశ పరిచాయి.

2023 లో టాప్‌ 15 డిజాస్టర్ సినిమాలు ఇవే!

2023 సంవత్సరం పూర్తి రాబోతుంది. మరో రెండు వారాల్లో 2024 సంవత్సరం రాబోతుంది. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా వందల కొద్ది తెలుగు సినిమాలు విడుదల అయ్యాయి. అందులో ఎప్పటిలాగే హిట్స్ కంటే ఫ్లాప్స్ ఎక్కువ ఉన్నాయి. గత ఏడాదితో పోల్చితే హిట్‌ పర్సంటేజ్ ఏమైనా పెరుగుతుందేమో అని భావించినప్పటికి పెద్దగా మార్పు అయితే కనిపించడం లేదు. చిన్నా చితకా సినిమాలతో పాటు భారీ విజయాలు సొంతం చేసుకుంటాయి అంటూ భారీ అంచనాల నడుమ విడుదల అయిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. చిన్న సినిమాలు, క్రేజ్ లేని సినిమాలు ఫ్లాప్‌ అయితే పర్వాలేదు కానీ, భారీ అంచనాల నడుమ విడుదల అయిన సినిమాలు ఫ్లాప్‌ అయితే మాత్రం కచ్చితంగా ఆ ప్రభావం చాలా ఉంటుంది.

ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డ 15 సినిమాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. 2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలతో చిరంజీవి, బాలయ్య లు వచ్చిన విషయం తెల్సిందే. ఆ రెండు సినిమాలు కూడా వంద కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేశాయి. ఆ తర్వాతే అసలు కథ మొదలు అయింది. ఈ ఏడాది సమ్మర్‌ సీజన్‌ అఖిల్‌ ఏజెంట్‌ తో మొదలు అయింది. ఆ సినిమా దాదాపుగా రూ.80 కోట్ల బడ్జెట్‌ తో రూపొందింది. సినిమా కనీసం 10 కోట్ల వసూళ్లు కూడా రాబట్టలేక పోయింది అనేది బాక్సాఫీస్ వర్గాల టాక్‌. అక్కడ నుంచి మొదలుకుని  చాలా డిజాస్టర్స్ ను టాలీవుడ్‌ చవిచూడాల్సి వచ్చింది.

ఈ ఏడాది రవితేజ నటించిన టైగర్‌ నాగేశ్వరరావు మరియు రావణాసుర సినిమాలు వచ్చాయి. ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం లో పూర్తిగా విఫలం అయ్యాయి. ఇక చిరంజీవి భోళా శంకర్ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటలేక చేతులు ఎత్తేసిన విషయం తెల్సిందే. పవన్‌ కళ్యాణ్‌, సాయి దరమ్‌ తేజ్ ల కాంబోలో వచ్చిన బ్రో సినిమా పర్వాలేదు అనిపించుకున్నా కూడా ఆశించిన స్థాయిలో వసూళ్లు మాత్రం రాబట్టలేక పోయింది. రామ్‌ స్కంద, వరుణ్‌ తేజ్ గాండీవదారి అర్జున సినిమాలు కూడా విడుదలకు ముందు బజ్ ను క్రియేట్‌ చేసి విడుదల తర్వాత ఇంతేనా అన్నట్లుగా టాక్‌ ను దక్కించుకుని బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డ విషయం తెల్సిందే. నందమూరి కళ్యాణ్ రామ్‌ అమిగోస్ మరియు నిఖిల్‌ స్పై సినిమాలు మేకింగ్‌ సమయంలో క్రియేట్‌ చేసిన బజ్‌ ను విడుదల సమయంలో కొనసాగించలేక బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.

ఇంకా చంద్రముఖి 2, మిస్టర్ ప్రెగ్నెంట్‌, రూల్స్ రంజన్‌, మీటర్‌, శాకుంతలం, కస్టడీ, దసరా, రంగబలి, రామబాణం, పెద్ద కాపు 1 ఇలా చాలా సినిమాలు కూడా మంచి అంచనాలతో విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. 2023 సంవత్సరం ఈ సినిమాల హీరోలకు మరియు దర్శకులకు కలిసి రాలేదు. మరి వచ్చే ఏడాది అయినా ఈ సినిమాల హీరోలు హిట్‌ కొడతారు అని మీరు భావిస్తున్నారా?