iDreamPost
android-app
ios-app

జాన్వీ కపూర్ పేరుతో అశ్లీల చిత్రాలు..క్లారిటీ ఇచ్చిన టీమ్!

  • Published Jun 17, 2024 | 7:06 PM Updated Updated Jun 17, 2024 | 7:06 PM

janhvi kapoor: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ పేరుతో ఇటీవలే ఎక్స్ ఖాతాలో అశ్లీలా చిత్రాలు పోస్ట్ చేసిన విషయం తెలసిందే. అయితే వీటిపై తాజాగా జాన్వీ కపూర్ టీమ్ స్పందించి క్లారిటీ ఇచ్చింది.

janhvi kapoor: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ పేరుతో ఇటీవలే ఎక్స్ ఖాతాలో అశ్లీలా చిత్రాలు పోస్ట్ చేసిన విషయం తెలసిందే. అయితే వీటిపై తాజాగా జాన్వీ కపూర్ టీమ్ స్పందించి క్లారిటీ ఇచ్చింది.

  • Published Jun 17, 2024 | 7:06 PMUpdated Jun 17, 2024 | 7:06 PM
జాన్వీ కపూర్ పేరుతో అశ్లీల చిత్రాలు..క్లారిటీ ఇచ్చిన టీమ్!

స్టార్ హీరోయిన్ ‘జాన్వీ కపూర్’..  ఈ పేరు ప్రేక్షకులు  అందరికి సుపరిచితమే. అంతేకాకుండా.. బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. అయితే ప్రస్తుతం ఈ అమ్మడు పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో మారు మోగుతున్న విషయ తెలిసిందే. కాగా, ఇటీవలే ఈ అందాల భామ ‘మిస్టర్ అండ్ మిసెస్‌’ మహి చిత్రంతో ప్రేక్షకులను ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రానికి శరణ్ శర్మ దర్శకత్వం వహించారు. ఇందులో  రాజ్‌కుమార్ రావు సరసన జాన్వీ నటించింది. ఇక ఈ మూవీ గత నెల మే 31న థియేటర్లలో విడుదలైన బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో ఇప్పటి వరకు విమర్శలు అందుకున్న వారితోనే ప్రశంసలు అందుకుంది జాన్వీ. కాగా, ప్రస్తుతం ఈ అమ్మడు డైరెక్టర్ కోరటాల శివ దర్శకత్వంలో  జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ‘దేవర’ చిత్రంలో నటిస్తోంది. అలాగే త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే విషయం తెలిసిందే .

ఇకపోతే వరుస సినిమాలతో దూసుకుపోతున్నా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే ఎప్పటికప్పుడు తన అభిమానులతో టచ్‌లో ఉంటూ.. తనకు సంబంధించిన రకరకాల ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. అయితే ఇటీవలే ఈ బ్యూటీకి ఊహించని షాక్ తగిలింది. కాగా, ఈ జాన్వీ కపూర్ పేరుతో తన ఎక్స్ ఖాతాలో కొన్ని అశ్లీల చిత్రాలు పోస్ట్‌ చేసినట్లు కనిపించింది. ఇక వాటిని చూసిన ఆమె ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఇక ఈ విషయాన్ని గమనించిన జాన్వీకపూర్‌ టీమ్‌ తాజాగా ఆ పోస్టులపై క్లారిటీ ఇచ్చింది. అలాగే అసలు ఆ ఎక్స్ ఖాతా జాన్వీది కాదని తేల్చి చెప్పేసింది.

అయితే మొదట ఎక్స్ ఖాతాలో  జాన్వీ పేరుతో ఉండే ఉండటం అందులో అలాంటి వీడియోలు రావడంతో అభిమానులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. కానీ, ఆ తర్వాత ఫ్యాన్ అకౌంట్‌ అని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అలాగే  సోషల్  మీడిచాలో  మీడియాలో ఉండే నకిలీ ఖాతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జాన్వీకపూర్‌ ప్రతినిధి సూచించారు. ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ఎవరి పేరుతోనైనా ఖాతాను సృష్టించడం చాలా సులభమని.. జాన్వీ కపూర్‌కు ఎక్స్‌లో ఎలాంటి అధికారిక ఖాతా లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. జాన్వీ త్వరలోనే బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ సరసన ఆర్సీ 16లో నటిస్తున్నది. మరి, జాన్వీ కపూర్ పేరుతో ఎక్స్ ఖాతాలో నకిలి అశ్లీలా చిత్రాలు పోస్ట్  చేసిన ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibommeritbet girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetcasibom