iDreamPost
android-app
ios-app

పూరీ- ఛార్మి మళ్ళీ తిరిగొచ్చారు! ఇస్మార్ట్-2తో మళ్ళీ సంపాదించారు!

Puri Jagannadh And Charmi Kaur- Double Ismart: సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఒక్కోసారి నిలదొక్కుకున్నా కూడా ముందుకు సాగడం ఒక సవాలుగా మారుతుంది. అలాంటి సమయంలో మీరు పూరీ- చార్మీల సినిమా జర్నీ చూస్తే ఒక మంచి స్ఫూర్తి దొరుకుతుంది.

Puri Jagannadh And Charmi Kaur- Double Ismart: సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఒక్కోసారి నిలదొక్కుకున్నా కూడా ముందుకు సాగడం ఒక సవాలుగా మారుతుంది. అలాంటి సమయంలో మీరు పూరీ- చార్మీల సినిమా జర్నీ చూస్తే ఒక మంచి స్ఫూర్తి దొరుకుతుంది.

పూరీ- ఛార్మి మళ్ళీ తిరిగొచ్చారు! ఇస్మార్ట్-2తో మళ్ళీ సంపాదించారు!

పూరీ జగన్నాథ్.. ఈ డైరెక్టర్ గురించి కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు.. పాన్ ఇండియాలో ఉండే సినిమా అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇప్పటికే తనలో ఉన్న స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు. ఆయన రాసే డైలాగ్.. చెప్పే మాట.. చూపించే సన్నివేశం నేరుగా హృదయాన్ని తాకుతుంది. చాలా బలంగా తాకుతుంది. అందుకే యువతలో పూరీకి అంతటి మాస్ క్రేజ్ ఉంది. అయితే పూరి జగన్నాథ్- చార్మీ సినిమా జర్నీ అనేది బిగ్ ఇన్ స్పిరేషనల్ స్టోరీ అని చెప్పాల్సిందే. ఎందుకు అంటే వాళ్లు కెరీర్ లో చూడని ఎత్తులు లేవు.. చూడని ఒడిదుడుకులు లేవు. కానీ, పోరాడి నిలబడ్డారు. సినిమా కోసం సినిమా వాళ్లలాగానే వారి జర్నీని కొనసాగిస్తున్నారు.

పూరి జగన్నాథ్ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశాడు. కేవలం డైరెక్టర్ గానే కాకుండా.. నిర్మాతగా కూడా మారాడు. అయితే ఒకానొక సమయంలో పూరి జగన్నాథ్ పని అయిపోయింది అన్నారు. పూరీ ఛాప్టర్ క్లోజ్ అంటూ గట్టిగానే వార్తలు వచ్చాయి. కానీ పూరీ జగన్నాథ్- చార్మీ కౌర్ కలిసి ఇస్మార్ట్ శంకర్ సినిమాతో దిమ్మతిరిగిపోయే హిట్టు కొట్టారు. పడిపోయాడు అన్న వాళ్లే.. దెబ్బకు తిరిగి ట్రాక్ లోకి వచ్చిన పూరీ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. అయితే ఆ తర్వతా లైగర్ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో తీసుకొచ్చారు. కానీ, లైగర్ సినిమాకి ఆశించినంత రిజల్ట్ రాలేదు. ఆ మూవీ ఫెయిల్ కాగానే మళ్లీ పూరి గురించి వార్తలు వచ్చేశాయి.

కానీ, ఎక్కడా అలాంటి వార్తలు చూసి పూరి జగన్నాథ్ గానీ.. చార్మీ కౌర్ గానీ వెనుకడుగు వేయలేదు. మళ్లీ తిరిగి నిలబడ్డారు. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆగస్టు 15 రేసులోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే డబుల్ ఇస్మార్ట్ కి థియేట్రికల్ బిజినెస్ కూడా అయిపోయింది. పాన్ ఇండియా లెవల్లో హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి కొనుగోలు చేశారు. ఈ డీల్ తోనే డబుల్ ఇస్మార్ట్ లాభాల బాట పట్టేసింది. అలాగే ఓటీటీ డీల్ కూడా ఫిక్స్ అయ్యింది అంటున్నారు.

రూ.33 కోట్లకు డబుల్ ఇస్మార్ట్ ఓటీటీ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసిందని చెప్తున్నారు. అంటే ఇప్పటికే ఈ మూవీ పూరీ- చార్మీలకు లాభాలు తెచ్చిపెట్టాయి. ఇంక తెలుగు శాటిలైట్ రైట్స్, హిందీ శాటిలైట్ రైట్స్ ఇలా చాలానే రావాల్సిన లెక్కలు మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో రిలీజ్ కి ముందే పూరీ జగన్నాథ్- చార్మీ మంచి లాభాలను సొంతం చేసుకున్నారు. వీళ్ల జర్నీని బట్టి ఒక విషయం అర్థం చేసుకోవచ్చు. పడటం తప్పు కాదు.. పడి లేవకపోవడం తప్పు. ఎవరు మన గురించి ఎన్ని మాట్లాడుకున్నా మన పని మనం చేసుకుంటూ పోవడమే. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలోనే ఉండాలి అనుకునే వాళ్లకు పూరీ- చార్మీల జర్నీ ఒక మంచి ఉదాహరణ అవుతుంది.