iDreamPost
android-app
ios-app

7 ఆస్కార్స్ గెలిచిన ఓపెన్ హైమర్ సినిమా కథ ఏంటంటే?

Oppenheimer Movie Story: ప్రస్తుతం ఎంటర్ టైన్మెంట్ ప్రపంచంలో ఓపెన్ హైమర్ పేరు మారు మోగుతోంది. 96వ అకాడెమీ అవార్డుల్లో ఏకంగా 7 ఆస్కార్స్ దక్కించుకుంది. మరి.. ఆ మూవీ కథ ఏంటో చూద్దాం.

Oppenheimer Movie Story: ప్రస్తుతం ఎంటర్ టైన్మెంట్ ప్రపంచంలో ఓపెన్ హైమర్ పేరు మారు మోగుతోంది. 96వ అకాడెమీ అవార్డుల్లో ఏకంగా 7 ఆస్కార్స్ దక్కించుకుంది. మరి.. ఆ మూవీ కథ ఏంటో చూద్దాం.

7 ఆస్కార్స్ గెలిచిన ఓపెన్ హైమర్ సినిమా కథ ఏంటంటే?

ఓపెన్ హైమర్ గతేడాది నుంచి వరల్డ్ వైడ్ గా ఈ సినిమా సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. 96వ అకాడెమీ అవార్డులకు 13 నామినేషన్స్ అందుకుని ఈ మూవీ సత్తా చాటింది. సోమవారం ప్రకటించిన 96వ అకాడెమీ అవార్డుల్లో ఏకంగా 7 విభాగాల్లో ఆస్కార్ అందుకుని ఓపెన్ హైమర్ చిత్రం రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు వరల్డ్ వైడ్ గా ఈ మూవీ గురించే చర్చలు జరుగుతున్నాయి. అన్ని ఆస్కార్స్ అందుకున్న ఈ చిత్రం అసలు కథ ఏంటి అంటూ సినిమా చూడని వాళ్లు వెతుకులాట మొదలు పెట్టారు. మరి.. అసలు ఆ ఓపెన్ హైమర్ కథ ఏంటో చూద్దాం.

ఓపెన్ హైమర్ చిత్రం ప్రస్తుతం మరోసారి వార్తల్లో నిలిచింది. 13 నామినేషన్స్ అందుకున్న ఈ చిత్రం ఏకంగా 7 విభాగాల్లో ఆస్కార్ అందుకుంది. బెస్ట్ పిక్చర్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సపోర్టింగ్ రోల్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో ఓపెన్ హైమర్ అవార్డులు దక్కించుకుంది. ఈ మూవీపై గతేడాది నుంచే మంచి హైప్ ఉంది. తాజాగా ఈ ఆస్కార్స్ నేపథ్యంలో ఆ హైప్ మరింత పెరిగింది. అయితే ఈ మూవీ ఓటీటీ వివరాల కోసం కూడా చాలా మంది వెతుకుతున్నారు.

Openheimer

ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో రెంట్ బేసిస్ లో అందుబాటులో ఉంది. మీరు ఈ ఓపెన్ హైమర్ మూవీ చూడాలి అంటే అమెజాన్ లో రూ.149కి రెంట్ కి తీసుకుని చూడాలి. అలాగే బుక్ మై షో ఓటీటీలో కూడా ఈ మూవీ రెంట్ బేసిస్ లో అందుబాటులో ఉంది. కాకపోతే అక్కడ మాత్రం రూ.199 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఓపెన్ హైమర్ లవర్స్ కి జియో సినిమా శుభవార్త చెప్పబోతోంది. అదేంటంటే.. మార్చి 21 నుంచి జియో సినిమాలో ఓపెన్ హైమర్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్రీగా స్ట్రీమ్ చేసేందుకు జియో సినిమా చూస్తోంది అంటున్నారు. అది ఎంత వరకు నిజం అంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు నమ్మే పరిస్థితి లేదు.

ఓపెన్ హైమర్ కథేంటి?:

ఈ కథ అణుబాంబు సృష్టికర్త రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఓపెన్ హైమర్ సినిమా కథ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకుంటున్న ఓపెన్ హైమర్(సిలియాన్ మర్ఫీ) పరిచయంతో ప్రారంభం అవుతుంది. అతను న్యూక్లియర్ ఫిజిక్స్ లో గొప్ప పరిజ్ఞానం కలిగిన సైంటిస్టుగా ఎదుగుతూ ఉంటాడు. అతని న్యూక్లియర్ ఫిజిక్స్ పరిజ్ఞాన్నాన్ని అమెరికా ఉపయోగించుకుంటుంది. అణుబాంబు తయారు చేయాలి అని సన్నద్ధమవుతున్న అగ్రరాజ్యానికి ఓపెన్ హైమర్ మంచి అవకాశంగా కనిపిస్తాడు. ఓపెన్ హైమర్ నేతృత్వంలో ‘మాన్ హాటన్ ప్రాజెక్టు’ను ప్రారంభిస్తారు. హైమర్ కు లూయిస్ స్ట్రాస్(రాబర్డ్ డౌనీ జూనియర్)ను సహాయకుడిగా పెడతారు. 1945 రెండో ప్రపంచ యుద్ధానికి సన్నద్ధమవుతున్న సమయంలో వాళ్లు ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు.

ఈ కథలో డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ ఎన్నో ప్రశ్నలకు సమాధానంగా కథను నడుపుతూ ఉంటాడు. అసలు అమెరికా ఎందుకు అణుబాంబు తయారు చేసింది? హీరోషిమా- నాగసాకిపై ఎందుకు అణుబాంబుతో దాడి చేశారు? భగవద్గీతలోని సృష్టించింది నేనే- నాశనం చేసింది నేనే అనే సూక్తి స్ఫూర్తితోనే తాను అణబాంబు తయారు చేశాను అని ఎందుకు అన్నాడు? అసలు అణబాంబు తయారు చేసిన తర్వాత ఓపెన్ హైమర్ మానసిక పరిస్థితి ఏంటి? అతని సృష్టి తర్వాత అసలు ఏం తెలుసుకున్నాడు? ఓపెన్ హైమర్ పై వచ్చిన విమర్శలను అతని భార్య ఎలా ఎదుర్కొంది? అనే నేపథ్యంలోనే కథ మొత్తం సాగుతుంది. క్రిస్టోఫర్ నోలన్ టేకింగ్ సినిమా లవర్స్ అందరూ మంత్ర ముగ్దులు అవ్వాల్సిందే. వరల్డ్ వైడ్ గా ఉన్న సినిమా లవర్స్ అంతా ఈ సినిమా చూసి నోరెళ్లబెట్టేశారు. ఈ సినిమాపై ప్రశంసల వర్ష కురిపించారు. ఈ మూవీని 100 మిలియన్ డాలర్స్ తో తెరకెక్కిస్తే.. బాక్సాఫీస్ వద్ద ఏకంగా 900 మిలియన్ డాలర్స్ వసూళ్లు రాబట్టింది. మరి.. ఓపెన్ హైమర్ కు 7 ఆస్కార్స్ రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.