iDreamPost
android-app
ios-app

మూవీస్‌కు గుడై బై చెప్పనున్న స్టార్ డైరెక్టర్ కూతురు..!

  • Published Nov 18, 2023 | 3:54 PM Updated Updated Nov 18, 2023 | 3:54 PM

ఇప్పుడు నటీమణులు ముందు చూపు చాలా ఎక్కువ. చదువుకు ప్రాధాన్యతనిస్తూనే.. కెరీర్ పై ఫోకస్ పెడుతున్నారు. మూవీస్ బెడిసికొట్టినా.. ఎడ్యుకేషన్ కారణంగా మంచి జాబ్స్ చేసుకుని సెటిల్ అవ్వొచ్చునని ఆలోచిస్తున్నారు. తాజాాగా ఓ యాక్టరస్..

ఇప్పుడు నటీమణులు ముందు చూపు చాలా ఎక్కువ. చదువుకు ప్రాధాన్యతనిస్తూనే.. కెరీర్ పై ఫోకస్ పెడుతున్నారు. మూవీస్ బెడిసికొట్టినా.. ఎడ్యుకేషన్ కారణంగా మంచి జాబ్స్ చేసుకుని సెటిల్ అవ్వొచ్చునని ఆలోచిస్తున్నారు. తాజాాగా ఓ యాక్టరస్..

  • Published Nov 18, 2023 | 3:54 PMUpdated Nov 18, 2023 | 3:54 PM
మూవీస్‌కు గుడై బై చెప్పనున్న స్టార్ డైరెక్టర్ కూతురు..!

ఒకప్పుడు నటీమణులు హీరోయిన్ కాకుంటే ఏం అయ్యేవారు అనే ప్రశ్న ఎదురైనప్పుడల్లా డాక్టర్స్ అని చెప్పేవారు. డాక్టర్ అవుదామని అనుకుంటే యాక్టర్ అయ్యానని అంటుంటారు. కానీ నేటి హీరోయిన్స్ వృత్తి, ప్రవృత్తిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అందుకు ఉదాహరణ సాయి పల్లవి, శ్రీలీల, కృతి శెట్టి వంటి వారే. మూవీస్‌లో నటిస్తూనే చదువును కంటిన్యూ చేస్తున్నారు. ఎడ్యుకేషన్, కెరీర్ అంటూ రెండు పడవలపై కాళ్లు వేస్తూ సినిమాల్లోనే కాదూ రియల్ లైఫ్‌లోనూ స్టంట్స్ చేస్తున్నారు. సక్సెస్ ఫుల్ యాక్టర్స్‌గా దూసుకెళుతున్నారు. అలాగే ఫ్యూచర్ హీరోయిన్లకు ఆదర్శంగానూ నిలుస్తున్నారు. తాజాగా మరో నటి డాక్టర్ అయ్యానని చెబుతుంది.

ప్రముఖ దర్శకుడు శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశ దిగ్గజ దర్శకుల్లో ఆయన ఒకరు. ఆయనతో సినిమా చేసేందుకు వెయిట్ చేస్తుంటారు నటీనటులు. తండ్రి నుండి ఇన్ స్పైర్ అయిన ఆయన కూతురు అదితి శంకర్ పరిశ్రమలోకి ఎంటరై.. మంచి ఆఫర్లతో దూసుకెళుతోంది. కార్తీ హీరోగా నటించిన విరుమాన్ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. శివ కార్తికేయన్ సరసన మావీరన్‌తో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. వరుస అవకాశాలు సినిమాలు చేస్తూ.. ఉన్నత చదువులు పూర్తి చేసింది. ఆమె వైద్య వృత్తిని కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది. తన ఇన్ స్టా వేదికగా సర్జరీ గెటప్‌లో కనిపిస్తూ..డా A అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీన్ని చూసిన చాలా మంది డాక్టర్ అయ్యిందని భావిస్తున్నారు.

డాక్టర్ డ్రెస్‌లో కనిపించిన అమ్మడిని చూసి.. షాక్ అయ్యారు నెటిజన్లు. ఏంటీ మేడం న్యూ మూవీ క్యారెక్టరా అంటూ ప్రశ్నిస్తున్నారు. యాక్టింగ్ ఆపేసి ప్రొఫెషనల్ లైఫ్‌కు వెళ్లిపోతున్నారా అని కామెంట్లు పెడుతున్నారు. దీనిని బట్టి చూస్తే ఆమె సినిమాలు మానేస్తారా అని అనుమానమూ కలుగుతుంది. అదే సమయంలో కొత్త మూవీ క్యారెక్టర్ పేరా అన్న సందేహం వస్తుంది. అయితే ప్రస్తుతం ఆమె రెండు సినిమాలతో బిజీగా గడుపుతున్నట్లు తెలుస్తోంది. ఆమెలో నటనే కాదూ ప్లే బ్యాక్ సింగర్ కూడా దాగి ఉన్న సంగతి విదితమే. పలు సినిమాలకు పాటలు కూడా పాడారు.  వరుణ్ తేజ్ గనిలో ఓ పాటకు గాత్ర దానం చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Aditi Shankar (@aditishankarofficial)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio