Aditya N
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ది గోట్ లైఫ్ (ఆడు జీవితం) మార్చి 28న అద్భుతమైన స్పందనతో ప్రారంభమైంది.పృథ్వీరాజ్ నటనతో పాటు కళ్ళు చెదిరే విజువల్స్, ఏ ఆర్ రహమాన్ అందించిన ఏమోషనల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి.
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ది గోట్ లైఫ్ (ఆడు జీవితం) మార్చి 28న అద్భుతమైన స్పందనతో ప్రారంభమైంది.పృథ్వీరాజ్ నటనతో పాటు కళ్ళు చెదిరే విజువల్స్, ఏ ఆర్ రహమాన్ అందించిన ఏమోషనల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి.
Aditya N
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ది గోట్ లైఫ్ (ఆడు జీవితం) మార్చి 28న అద్భుతమైన స్పందనతో ప్రారంభమైంది. బ్లెస్సీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సర్వైవల్ థ్రిల్లర్ విడుదలకు ముందే మంచి క్రేజ్ తెచ్చుకుంది. పృథ్వీరాజ్ ఈ చిత్రం కోసం ఎంతో దూకుడుగా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. దాని వల్ల సినిమాకి మంచి హైప్ క్రియేట్ అయింది. అందుకే ది గోట్ లైఫ్ బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ సాధించింది. రెండవ రోజు కూడా అద్భుతమైన వసూళ్లు సాధించి ఆల్ టైమ్ రికార్డ్ దిశగా దూసుకుపోతోంది.
తొలి రోజు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మాలీవుడ్‌లో ఆల్ టైం బెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమాల్లో ది గోట్ లైఫ్ 4వ స్థానంలో నిలిచింది. కాగా రెండవ రోజు కలెక్షన్లు మొదటి రోజుతో సమానంగా రావడం విశేషం. ఆ రకంగా రెండు రోజుల్లో గ్రాస్ కలెక్షన్లు దాదాపు 30 కోట్ల మార్క్‌కు చేరుకున్నాయి. ప్రస్తుతం ట్రెండ్ ను బట్టి మొదటి వీకెండ్ పూర్తయ్యే లోపు ది గోట్ లైఫ్ 60 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టవచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ రికార్డ్ మోహన్ లాల్ సినిమా లూసిఫర్ పేరిట ఉంది. ఆ సినిమా మొదటి వారాంతంలో దాదాపు 55 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ది గోట్ లైఫ్ ఆ వసూళ్లను అధిగమించి అత్యధిక వసూళ్లు రాబట్టేందుకు సిద్ధంగా ఉంది.
పృథ్వీరాజ్ నటనతో పాటు కళ్ళు చెదిరే విజువల్స్, ఏ ఆర్ రహమాన్ అందించిన ఏమోషనల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. బాక్సాఫీస్ వద్ద ది గోట్ లైఫ్ లాంగ్ రన్ ఇలానే సాగితే సమ్మర్ సీజన్ అడ్వాంటేజ్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల గ్రాస్ మార్క్‌ను కూడా తాకే అన్ని అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాతో మలయాళ చిత్ర పరిశ్రమ 2024 సంవత్సరంలో మరో అద్భుతమైన చిత్రాన్ని అందించింది.