iDreamPost
android-app
ios-app

The Fame Game : ది ఫేమ్ గేమ్ రిపోర్ట్  

పెళ్లయ్యాక తెరకు దూరమైనా రియాలిటీ షోలలో జడ్జ్ తో రెగ్యులర్ గా దర్శనమిచ్చే ఈ డ్రీమ్ క్వీన్ చేసిన మొదటి వెబ్ సిరీస్ ది ఫేమ్ గేమ్. తారల జీవితాల్లోని బయట ప్రపంచానికి తెలియని కోణాలను ఆవిష్కరించే ప్రయత్నం ఇందులో జరిగింది.

పెళ్లయ్యాక తెరకు దూరమైనా రియాలిటీ షోలలో జడ్జ్ తో రెగ్యులర్ గా దర్శనమిచ్చే ఈ డ్రీమ్ క్వీన్ చేసిన మొదటి వెబ్ సిరీస్ ది ఫేమ్ గేమ్. తారల జీవితాల్లోని బయట ప్రపంచానికి తెలియని కోణాలను ఆవిష్కరించే ప్రయత్నం ఇందులో జరిగింది.

The Fame Game : ది ఫేమ్ గేమ్ రిపోర్ట్  

ఒకప్పుడు 80 నుంచి 90 దశకం మధ్యలో ఎన్నో అద్భుతమైన బ్లాక్ బస్టర్లతో యువత హృదయాల్లో నిద్రపోయిన మాధురి దీక్షిత్ ని మర్చిపోగలమా. పెళ్లయ్యాక తెరకు దూరమైనా రియాలిటీ షోలలో జడ్జ్ తో రెగ్యులర్ గా దర్శనమిచ్చే ఈ డ్రీమ్ క్వీన్ చేసిన మొదటి వెబ్ సిరీస్ ది ఫేమ్ గేమ్. తారల జీవితాల్లోని బయట ప్రపంచానికి తెలియని కోణాలను ఆవిష్కరించే ప్రయత్నం ఇందులో జరిగింది. నెట్ ఫ్లిక్స్ భారీ బడ్జెట్ తో దీన్ని రూపొందించడం ముందు నుంచి ఆసక్తిని పెంచుతూ వచ్చింది. కరిష్మా కోహ్లీ – బెజోయ్ నంబియార్ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ మీద అభిమానులకు ప్రత్యేక అంచనాలున్నాయి. రిపోర్ట్ చూద్దాం.

అవార్డు ఫంక్షన్ కు వెళ్లిన ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అనామిక ఆనంద్(మాధురి దీక్షిత్)తిరిగి వచ్చే క్రమంలో అర్ధాంతరంగా మాయమవుతుంది. కిడ్నాప్ కు గురయ్యిందా లేక ఏదైనా అఘాయిత్యం జరిగిందా అనేది అంతు చిక్కదు. సినిమా తారల పట్ల అంతగా సదభిప్రాయం లేని పోలీస్ ఆఫీసర్ శోభా(రాజశ్రీ దేశ్ పాండే)ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కు పూనుకుంటుంది. ఈ క్రమంలో అనామిక జీవితానికి సంబంధించిన చాలా ఆసక్తికరమైన సంగతులు తెలుస్తాయి. తన వైవాహిక జీవితం, పిల్లలతో చెడిపోయిన సంబంధాలు, ఇంట్లో సమస్యలు ఇలా ఎన్నెన్నో. అసలు అనామిక ఏమయ్యింది, ఎవరు కారణం లాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సిరీస్.

ఒక్కొక్కటి సగటు 45 నిమిషాల పాటు మొత్తం ఎనిమిది ఎపిసోడ్లు ఉంది ది ఫేమ్ గేమ్. ఇది పూర్తిగా మాధురి దీక్షిత్ షో. ఇంత వయసులోనూ చెక్కుచెదరని ఆకర్షణతో, కట్టిపడేసే పెర్ఫార్మన్స్ తో సోలోగా నిలబెట్టేసింది. లక్షవిర్ శరన్, ముస్కాన్ జాఫరి నటన ఆవిడకు దన్నుగా నిలబడ్డాయి. డ్రామా కొంత స్లోగా నడిచినప్పటికీ స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా మలచడంలో శ్రద్ధ వహించడంతో డీసెంట్ వాచ్ అనిపించుకుంటుంది. సంజయ్ కపూర్ పాత్ర సహజంగా ఉంది. బాలీవుడ్ స్టార్ల పర్సనల్ లైఫ్ ని అతి దగ్గరగా చూడాలనుకుంటే మాత్రం ది ఫేమ్ గేమ్ ని మీ లిస్ట్ లో పెట్టుకోవచ్చు. మాధురి ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా చూడాల్సిందే

Also Read : PAN India Movies : పాన్ ఇండియా సినిమాలకు అక్కడి లింక్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి