iDreamPost
android-app
ios-app

ప్రభాస్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన హను కోట్ల హీరోగా ”ది డీల్” మూవీ పోస్టర్‌ ఆవిష్కరణ

  • Published Aug 09, 2024 | 5:14 PM Updated Updated Aug 09, 2024 | 5:14 PM

The Deal 2024 Movie Poster Launch: ప్రభాస్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన హను కోట్ల హీరోగా, దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్టర్ ను ఇవాళ విడుదల చేశారు.

The Deal 2024 Movie Poster Launch: ప్రభాస్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన హను కోట్ల హీరోగా, దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్టర్ ను ఇవాళ విడుదల చేశారు.

ప్రభాస్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన హను కోట్ల హీరోగా ”ది డీల్” మూవీ పోస్టర్‌ ఆవిష్కరణ

డిజిక్వెస్ట్, సిటిడెల్ క్రియేషన్స్ బ్యానర్స్ పై డాక్టర్ అనితా రావు సమర్పణలో వస్తున్న చిత్రం ‘ది డీల్’. హను కోట్ల దర్శకత్వంలో.. పద్మా రమాకాంతరావు, కొల్వి రామకృష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ ను హైదరాబాద్ లోని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్లో ఆవిష్కరించారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రముఖ సినీ రచయిత ఆకెళ్ళ శివప్రసాద్, రామకృష్ణ కొల్వితో పాటు ‘ది డీల్’ చిత్ర యూనిట్ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ కేవీ రమణాచారి హాజరై సినిమా పోస్టర్ ను ఆవిష్కరించారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యాక్టింగ్, డైరెక్ష పై అవగాహన ఉన్న హను కోట్ల ‘ది డీల్’ మూవీతో మన ముందుకు రావడం సంతోషంగా ఉందని అన్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా అని అన్నారు. టాలీవుడ్ లో అడుగుపెడుతున్న సందర్భంగా డైరెక్టర్ హను కోట్లకు అభినందనలు తెలియజేశారు. ఇక ది డీల్ మూవీ హీరో, దర్శకుడు హను కోట్ల మాట్లాడుతూ.. రంగస్థలం నుంచి సినిమా వైపు అడుగులు వేస్తున్న తనను ప్రేక్షకులు ఆశీర్వదించాలని కోరారు. వైవిధ్యమైన కథాంశంతో వస్తున్నా అని హను కోట్ల అన్నారు. తాను ‘ది డీల్’ సినిమా చూశానని, చాలా బాగుందని డిజిక్వెస్ట్ ఇండియా లిమిటెడ్ ఎండీ కె.బసిరెడ్డి అన్నారు. పెద్ద స్టార్ క్యాస్ట్ లేని చిన్న సినిమాలని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని బసిరెడ్డి అన్నారు.

The Deal Movie poster

కంటెంటే అసలైన కింగ్ అని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు కె.ఎల్. దామోదర్ ప్రసాద్ అన్నారు. క్రియేటివిటీతో వచ్చిన సినిమాలు నిలబడతాయని ప్రముఖ డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా అన్నారు. ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందాలని కోరుకుంటున్నా అని సాయి మాధవ్ అన్నారు. ప్రభాస్ నటించిన ఈశ్వర్ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హను కోట్ల.. ఆ తర్వాత ఆర్జేగా, నటుడిగా, నాటక రచయితగా, ఆధునిక నాటక దర్శకుడిగా ఎన్నో ప్రయోగాలు చేశారు. తాజాగా ‘ది డీల్’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీతో దర్శకుడిగా, హీరోగా సత్తా చాటడానికి మన ముందుకు వస్తున్నారు. కాగా ఈ సినిమాకి సురేంద్ర రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఆర్. ఆర్. ధృవన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet giriş