iDreamPost
android-app
ios-app

వీడియో: తరుణ్‌ భాస్కర్‌ను తిట్టిన తల్లి.. కారణం ఏంటంటే..

  • Published Nov 01, 2023 | 4:19 PM Updated Updated Nov 01, 2023 | 4:19 PM

ఆయన నటించి, దర్శకత్వం వహించిన తాజా చిత్ర ‘కీడా కోలా’ విడుదలకు సిద్ధంగా ఉంది. నవంబర్‌ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆయన నటించి, దర్శకత్వం వహించిన తాజా చిత్ర ‘కీడా కోలా’ విడుదలకు సిద్ధంగా ఉంది. నవంబర్‌ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Published Nov 01, 2023 | 4:19 PMUpdated Nov 01, 2023 | 4:19 PM
వీడియో: తరుణ్‌ భాస్కర్‌ను తిట్టిన తల్లి.. కారణం ఏంటంటే..

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న యంగ్‌ అండ్‌ ట్యాలెంటెడ్‌ దర్శకుల్లో తరుణ్‌ భాస్కర్‌ ఒకరు. ఆయన తన మొదటి సినిమా ‘పెళ్లి చూపులు’తో జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. సినిమాల్లోకి రాకముందు ఆయన చాలా షార్ట్‌ ఫిల్మ్‌ చేశారు. సోషల్‌ మీడియాలో మంచి పాపురాలిటీ సంపాదించుకున్నారు. తర్వాత బిగ్‌స్క్రీన్‌ మీదకు అడుగుపెట్టారు. ఇక్కడ కూడా తన సత్తా చాటుతున్నారు. మంచి మంచి సినిమాలు తెరకెక్కిస్తున్నారు. నటుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆయన నటించి, దర్శకత్వం వహించిన తాజా చిత్ర ‘కీడా కోలా’ విడుదలకు సిద్ధంగా ఉంది. నవంబర్‌ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా టీం ప్రమోషన్లలో బిజీ అయిపోయింది. తరుణ్‌ భాస్కర్‌ ఎక్కువ సమయం ప్రమోషన్లలోనే గడుపుతున్నారు. దీంతో ఇంటికి కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే తల్లి పుట్టిన రోజు శుభాకాంక్షల్ని ఆలస్యంగా చెప్పాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేశారు.

ఆ వీడియోలో.. తరుణ్‌.. తల్లి మధ్య సంభాషణ ఈ విధంగా జరిగింది.

తరుణ్‌ : హ్యాపీ బర్త్‌డే..
తల్లి : ఓకే..
తరుణ్‌ : ఇన్‌స్టాలో లైవ్‌ పెట్టాను. అందరూ మాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పండి. ఆమెకు కొంచెం ఫాలోయింగ్‌ ఇద్దాం.
తల్లి : ఓకే..
తరుణ్‌ : అట్లనే ఆమె నెంబర్‌ ఇవ్వబోతున్నాను అందరికీ..
తల్లి : ఓకే..
తరుణ్‌ : 9
తల్లి : ఏయ్‌ పాగల్‌..
తరుణ్‌ : 8
తల్లి : ఇంత సేపు నువ్వు ఇప్పుడే వస్తావ్‌.. నెంబర్‌ రివీల్‌ చేసేదానికి.. దొంగ రాస్కెల్‌.. గాడిది.. నన్ను విష్‌ చేయడానికి లేటు చేస్తున్నావు. బ్లడీ ఇడియట్‌. నువ్వు నీ కీడా కోలా గాడిది

అంటూ ఆమె చిరు కోపం ప్రదర్శించారు.  ప్రస్తుతం ఆ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. తల్లీ కొడుకుల ప్రేమకు ఫిదా అవుతున్నారు. మరి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Tharun Bhascker Dhaassyam (@tharunbhascker)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibom