iDreamPost
android-app
ios-app

నేను బతికే ఉన్నాను.. చంపకండి : నటి ఆవేదన

  • Published Sep 27, 2023 | 7:11 PM Updated Updated Sep 27, 2023 | 7:11 PM
  • Published Sep 27, 2023 | 7:11 PMUpdated Sep 27, 2023 | 7:11 PM
నేను బతికే ఉన్నాను.. చంపకండి : నటి ఆవేదన

ఇటీవల సోషల్ మీడియాలో సినీ ప్రముఖుల గురించి వస్తున్న వార్తలు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయిన వాపోతున్నారు. ఇండస్ట్రీలో సక్సెస్ లేక జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నారని.. ఆరోగ్య సమస్యలు తలెత్తడం వల్ల చనిపోయారని వార్తలు రావడంతో అటు కుటుంబ సభ్యులు.. ఇటు అభిమానులు షాక్ కి గురవుతున్నారు. అయితే తాము బతికే ఉన్నాం బాబోయ్ అని సదరు నటీనటులు మీడియా వేధికగా క్లారిటీ ఇస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటిపై ఇలాంటి పుకార్లు రావడంతో తాను బతికే ఉన్నాను.. అప్పుడే చంపేకకండి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్‌లో పాపులర్ షో తప్కీ ప్యార్ తో ఎంట్రీ ఇచ్చింది నటి జిగ్యాసా సింగ్. ఈ షో బాగా సక్సెస్ కావడంతో తప్కీ ప్యార్ కి 2 లో కూడా కంటిన్యూ అయ్యింది. ఈ షోలో వాణి అనే పాత్రతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకంది జిగ్యాసా సింగ్. ఇటీవల జిగ్యాసా సింగ్ చనిపోయినట్లు సోషల్ మీడియాలో కొన్ని మెసేజ్ లు వచ్చాయి.. అవి కాస్త వైరల్ గా మారడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళన చెందారు. తాజాగా వైరల్ న్యూస్ పై స్పందిస్తూ.. యూట్యూబ్ వీడియో స్క్రీన్ షాన్ ని షేర్ చేసింది జిగ్యాసా.

జిగ్యాస షేర్ చేసిన యూట్యూబ్ స్క్రీన్ షార్ట్ లో తప్కీ ప్యార్ ఫేమ్ జిగ్యాస చనిపోయింది.. అంటూ కొన్ని శీర్షికలతో వీడియోలు కనిపిస్తున్నాయి. ఆమె కారు ప్రమాదంలో చనిపోయిందని సోషల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు రెస్ట్ ఇన్ పీస్, రిప్ జిగ్యాస, ఓం శాంతి అంటూ కొన్ని వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. కాగా, దీనిపై స్పందించిన జిగ్యాసా సింగ్.. ఈ వీడియోలో చూపించింది మొత్తం పుకార్లు.. ఫేక్ న్యూస్. ఇలాంటి పుకార్లు ఎలా పుట్టుకు వస్తాయో అస్సలు అర్థం కాదు.. అంటూ స్మైలింగ్ ఎమోజీ పెడుతూ.. అబ్బాయిలూ, నేను బతికే ఉన్నాను! మీరు అద్భుతం.. నకిలీ ఛానెళ్లు ఇకనైనా ఈ వార్తలు ఆపండి ’అంటూ క్యాప్షన్ తో పోస్ట్ చేసింది. దీంతో ఈ పుకార్లకు ఎండ్ కార్డు పడ్డటే అంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Jigyasa Singh (@jigyasa_07)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom