iDreamPost
android-app
ios-app

తమ్ముడు మూవీ సెకండ్ హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడేం చేస్తుందంటే..?

Thammudu Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాల్లో ఒకటి తమ్ముడు. ఇందులో సెకండ్ హీరోయిన్ లవ్లీని ఎవరైనా మర్చిపోగలమా..? ఇప్పుడు ఆ బ్యూటీ ఏం చేస్తుందో తెలుసా..?

Thammudu Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాల్లో ఒకటి తమ్ముడు. ఇందులో సెకండ్ హీరోయిన్ లవ్లీని ఎవరైనా మర్చిపోగలమా..? ఇప్పుడు ఆ బ్యూటీ ఏం చేస్తుందో తెలుసా..?

తమ్ముడు మూవీ సెకండ్ హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడేం చేస్తుందంటే..?

తొలి ప్రేమ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం తమ్ముడు. ఇందులో బాధ్యత లేని యువకుడిగా, తండ్రి చేత ఎప్పుడు చీవాట్లు తినే సుబ్బు అనే కుర్రాడి పాత్రలో నటించి మెప్పించాడు. 1999లో స్పోర్ట్ యాక్షన్ ఫిల్మ్‌గా తెరకెక్కిన ఈ చిత్రం కూడా హిట్ ట్రాక్ ఎక్కింది. ఈ సినిమాకు కథ, కథనం ఎంత హైలెట్టో.. సాంగ్స్ కూడా అంతే పాపులర్. మ్యూజిక్ డైరెక్టర్  రమణ గోగుల అప్పట్లో ట్రెండ్ సెట్టార్ గా మారారు. ఈ మూవీని పీఏ అరుణ్ ప్రసాద్ (అనిల్ రావిపూడి బంధువు) తెరకెక్కించాడు. ఇక ఇందులో బాలీవుడ్ బ్యూటీస్ నటించారు. ఒకరు ప్రీతి జింగానియా. మరొకరు అదితి గోవిత్రికర్. హీరోయిన్‌గా ప్రీతి జింగానియా ఆకట్టుకున్నా.. ఎక్కువగా అందరికీ రిజిస్టర్ అయ్యింది మాత్రం లవ్లీ క్యారెక్టర్‌లో నటించిన అదితినే.

చాలా మంది డాక్టర్ అవుతామనుకుని యాక్టర్ అయ్యమాని అంటుంటారు. కానీ డాక్టర్ అయ్యి.. యాక్టర్ కూడా అవ్వొచ్చు అని నిరూపించిన నటీమణుల్లో ఆమె కూడా ఒకరు. మహారాష్ట్రలో పుట్టిన ఈ ముంబయి భామ. గ్రాండ్ మెడికల్ కాలేజీ నుండి ఎంబీబీఎస్ చేసింది. అంతే కాదు సైకాలజీ కూడా చదివింది. ఆ తర్వాత మోడల్‌గా కెరీర్ స్టార్ చేసి.. పలు యాడ్స్ చేసింది. హృతిక్ రోషన్‌తో కలిసి కోలా కోలా యాడ్ చేయడంతో పాపులర్ అయ్యింది. అలా ఆమెకు తమ్ముడు మూవీ ఆఫర్ వచ్చింది. ఇందులో లవ్లీగా నటించింది. ఈమె ప్రేమ కోసం హీరో పడరాని పాట్లు పడుతుంటాడు. ఇందులో ‘హే పిల్ల నీ పేరు లవ్లీ.. జారి పోకే చేపల్లే తుళ్లి’ అంటూ ఆమె వెంటపడుతుంటాడు సుబ్బు.. సుభాష్. చివరకు అతడిది లో క్లాస్ అని తెలిసి ఛీ కొడుతుంది. ఇందులో ఆమె క్యారెక్టరే ఎక్కువగా గుర్తింపు తెచ్చుకుంది.

తమ్ముడు తర్వాత ఆమె మౌనమేలనోయిలో ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించింది. సినిమాలోకి రాకముందే.. తన ప్రియుడు ముఫ్పాజల్  1998లో మనువాడింది. ఆ సినిమాల్లో చేస్తూనే.. మిసెస్ ఇండియా పోటీలకు వెళ్లి టైటిల్ కూడా విన్ అయ్యింది. మిసెస్ వరల్డ్ పోటీల్లో టైటిల్ గెలిచిన తొలి మహిళ ఆమె కావడం విశేషం. మౌనమేలనోయి తర్వాత ఆమె తెలుగులో కనిపించలేదు. బాలీవుడ్ చిత్రాల్లో మెరిశారు. 2009లో ఆమె విడాకులు తీసుకుంది. ప్రస్తుతం సింగిల్ లైఫ్ లీడ్ చేస్తుంది. ఈమె ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వ్యవహరిస్తున్నారు. సైకాలజీలో సెషన్లు ఇస్తూనే.. ఇటు గ్లామర్ రంగంలో కూడా రాణిస్తుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Dr Aditi Govitrikar (@aditigovitrikar)

Jojobet GirişmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet Girişcasibomjojobetjojobetcasibomromabet girişMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GiriştestereCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap