iDreamPost
android-app
ios-app

Thaman: తమన్ కు ఏడాదికో ఐఫోన్ గిఫ్ట్ గా ఇస్తున్న అనుష్క! కారణం ఏంటో తెలుసా?

  • Published Sep 16, 2024 | 12:13 PM Updated Updated Sep 16, 2024 | 12:13 PM

Anushka gift iPhone to Thaman: ప్రతి ఏడాది తనకు ఓ ఐఫోన్ ను అనుష్క శెట్టి గిఫ్ట్ గా ఇస్తుందని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Anushka gift iPhone to Thaman: ప్రతి ఏడాది తనకు ఓ ఐఫోన్ ను అనుష్క శెట్టి గిఫ్ట్ గా ఇస్తుందని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

  • Published Sep 16, 2024 | 12:13 PMUpdated Sep 16, 2024 | 12:13 PM
Thaman: తమన్ కు ఏడాదికో ఐఫోన్ గిఫ్ట్ గా ఇస్తున్న అనుష్క! కారణం ఏంటో తెలుసా?

సాధారణంగా సినిమా హిట్ అయితే హీరోలకు నిర్మాతలు కార్లు లేదా విలువైన గిఫ్ట్ లు ఇస్తుంటారు. ఈ సంప్రదాయాన్ని మనం గత కొంత కాలంగా చూస్తూనే ఉన్నాం. అయితే ప్రతి ఏడాది స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ కు ఓ కాస్ట్లీ ఐఫోన్ ను గిఫ్ట్ గా ఇస్తూ వస్తోంది టాలీవుడ్ బ్యూటీ స్వీటీ అనుష్క శెట్టి. ఇలా ఒక్క సంవత్సరం, రెండు సంవత్సరాలు కాదు.. ప్రతి సంవత్సరం ఇస్తూనే వస్తుందట. ఈ విషయాన్ని స్వయంగా తమన్ చెప్పుకొచ్చాడు. దాంతో అనుష్క ఆయనకు ఐఫోన్ గిఫ్ట్ గా ఎందుకు ఇస్తోంది? అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు. అయితే ఆమె బహుమతి ఎందుకు ఇస్తుందో అన్న విషయాన్ని కూడా తమన్ వివరించాడు.

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో ఫుల్ బిజీగా ఉన్నాడు. గేమ్  ఛేంజర్, ది రాజా సాబ్ లాంటి చిత్రాలతో పాటుగా మరికొన్ని క్రేజీ మూవీస్ చేస్తున్నాడు. ఇంత బిజీలో కూడా ‘తెలుగు ఇండియన్ ఐడల్’ సీజన్ 3కి జడ్జీగా వ్యవహరిస్తున్నాడు. ఈ షోలో స్టార్ హీరోయిన్ అనుష్కతో తనకు ఉన్న అనుబంధాన్ని గురించి తొలిసారి వెల్లడించాడు. అదీకాక ఆమె తనకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ లో ఒక ఐఫోన్ ను గిఫ్ట్ గా పంపిస్తుందని ఎవ్వరికీ తెలియని నిజాన్ని తెలిపాడు. ఈ షోలో తమన్ మాట్లాడుతూ..

“అనుష్క ఎంతో గొప్ప వ్యక్తి. ఆమె అందంలోనే కాదు.. గుణంలో కూడా బ్యూటీఫుల్. ఆమె అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏడాది సెప్టెంబర్ లో ఒక ఐఫోన్ గిప్ట్ గా అనుష్క దగ్గర నుంచి వస్తుంది. ‘భాగమతి’ సినిమా టైమ్ లో నాకు ఐఫోన్ అంటే ఇష్టమని చెప్పాను. ఆ మూవీ హిట్ అయితే నాకు ఐఫోన్ ఇవ్వాలని అన్నాను. సినిమా హిట్ అయ్యింది. ఇక నాకు అప్పటి నుంచి ప్రతి ఏడాది ఐఫోన్ బహుమతిగా వస్తుంది. యూవీ ఆఫీస్ నుంచి అనుష్క ద్వారా నాకు ఈ గిఫ్ట్ వస్తుంది. ఇక నేను ఇప్పటి వరకు చూసిన బెస్ట్ హ్యూమన్ బియింగ్ అనుష్క” అంటూ స్వీటీపై ప్రశంసల వర్షం కురిపించాడు తమన్. కాగా.. అనుష్క చివరిగా నవీన్ పొలిశెట్టితో కలిసి ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’ సినిమాలో కనిపించింది. అప్పటి నుంచి మరే చిత్రం కూడా అనౌన్స్ చేయలేదు. కాగా.. త్వరలోనే భాగమతి 2 చేస్తున్నట్లు తమన్ చెప్పాడు. ఇందుకోసం ఫిట్ గా మారేందుకు స్వీట్ రెడీ అవుతోంది. మరి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏడాది ఐఫోన్ గిఫ్ట్ గా ఇస్తున్న అనుష్కపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş