iDreamPost
android-app
ios-app

ఓటీటీలోకి ‘లియో’.. ఇంత త్వరగానా! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

  • Author Soma Sekhar Updated - 11:37 PM, Thu - 2 November 23

లియో మూవీపై ఫస్ట్ నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో అంచనాలకు తగ్గట్లుగానే మంచి ఓపెనింగ్స్ రాబట్టింది లియో. ఇక ఓటీటీ ప్రేమికులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందా? అని ఎదురుచూస్తున్నారు.

లియో మూవీపై ఫస్ట్ నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో అంచనాలకు తగ్గట్లుగానే మంచి ఓపెనింగ్స్ రాబట్టింది లియో. ఇక ఓటీటీ ప్రేమికులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందా? అని ఎదురుచూస్తున్నారు.

  • Author Soma Sekhar Updated - 11:37 PM, Thu - 2 November 23
ఓటీటీలోకి ‘లియో’.. ఇంత త్వరగానా! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

దళపతి విజయ్ హీరోగా, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన చిత్రం ‘లియో’ దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ.. టాక్ తో సంబంధం లేకుండా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తొలి రోజే వరల్డ్ వైడ్ గా దాదాపుగా రూ. 146 కోట్లు వసూల్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టాడు విజయ్. లోకేష్ సినిమా యూనివర్స్ లో భాగంగా ఖైదీ, విక్రమ్ సినిమాలకు లింక్ చేస్తూ లియోను తెరకెక్కించాడు. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకు తగ్గట్లుగానే మంచి ఓపెనింగ్స్ రాబట్టింది లియో. ఇక ఓటీటీ ప్రేమికులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందా? అని ఎదురుచూస్తున్నారు. తాజాగా లియో ఓటీటీకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి లియో ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

‘లియో’.. టాక్ తో సంబంధం లేకుండా వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా దాదాపు రూ. 500 కోట్లను కొల్లగొట్టినట్లు సమాచారం. విజయ్ నటన, లోకేష్ టేకింగ్, అనిరుధ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాను ఓ రేంజ్ కి తీసుకెళ్లాయి. ఇదిలా ఉండగా.. లియో ఓటీటీ రిలీజ్ కు సంబంధించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది. లియో ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసిందని టాక్.

ఇక ఈ మూవీ నవంబర్ 21న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తెలుగు, తమిళ్, హిందీ లో అందుబాటులో ఉంటుదని తెలుస్తోంది. కాగా.. అక్టోబర్ 19న రిలీజ్ అయిన లియో ఇంత త్వరగా ఓటీటీలోకి వస్తుందా? అన్న చిన్న అనుమానం కూడా ప్రేక్షకుల్లో ఉంది. అయితే తొలుత దీపావళి కానుకగా ఓటీటీలో స్ట్రీమింగ్ చేద్దామనుకున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ మూవీలో విజయ్ కు జంటగా త్రిష నటించింది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş