iDreamPost

దళపతి బర్త్ డే ట్రీట్.. 50 సెకన్లలోనే రచ్చ రచ్చ చేసిన విజయ్! ఫ్యాన్స్ కు పూనకాలే..

దళపతి విజయ్ పుట్టినరోజు సందర్భంగా 'ది గోట్' మూవీ నుంచి 50 సెకన్ల వీడియోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

దళపతి విజయ్ పుట్టినరోజు సందర్భంగా 'ది గోట్' మూవీ నుంచి 50 సెకన్ల వీడియోను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

దళపతి బర్త్ డే ట్రీట్.. 50 సెకన్లలోనే రచ్చ రచ్చ చేసిన విజయ్! ఫ్యాన్స్ కు పూనకాలే..

సాధారణంగా హీరో, హీరోయిన్ ల బర్త్ డే సందర్భంగా వారు నటించిన లేటెస్ట్ చిత్రాలకు సంబంధించి పోస్టర్లను, గ్లింప్స్ ను, ట్రైలర్లను రిలీజ్ చేస్తుంటారు మేకర్స్. దాంతో ఫ్యాన్స్ కు బర్త్ డే తో పాటుగా ఇదొక స్పెషల్ గిఫ్ట్ అవుతుంది. తాజాగా దళపతి విజయ్(జూన్ 22) తన 49వ పుట్టినరోజు జరుపుకొంటున్నాడు. ఇప్పటికే ఫ్యాన్స్ తమ అభిమాన హీరో పుట్టినరోజు సెలబ్రేషన్స్ ను ఘనంగా జరుపుకోవడానికి సిద్ధమైయ్యారు. ఇక వారి సంతోషాన్ని మరింత డబుల్ చేసింది ‘ది గోట్’ మూవీ టీమ్. విజయ్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి 50 సెకన్ల వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో యూట్యూబ్ ను షేక్ చేస్తోంది.

‘ది గోట్’.. వెంకట్ ప్రభు డైరెక్షన్ లో కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం.. దాదాపు పూర్తికావొచ్చింది. కాగా.. నేడు(జూన్ 22) దళపతి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ గోట్ మూవీ నుంచి 50 సెకన్ల వీడియోను విడుదల చేశారు. ఇందులో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇద్దరు విజయ్ లు బైక్ పై వెళ్తుంటే.. విలన్స్ ఛేజింగ్ చేసే విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. హాలీవుడ్ రేంజ్ టేకింగ్ తో డైరెక్టర్ మెస్మరైజ్ చేశాడు. యువన్ శంకర్ రాజా బ్యాగ్రౌండ్ స్కోర్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చింది.

కాగా.. కేవలం 50 సెకన్ల వీడియోనే అయినప్పటికీ.. ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించాడు విజయ్. దాంతో మూవీలో ఇంకెన్ని యాక్షన్స్ సీన్స్ ఉంటాయోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ప్రభుదేవా కీలకపాత్రలో మెరవనున్నాడు. విజయ్ సరసన మీనాక్షి చౌదరి నటిస్తుండగా.. సెప్టెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిన్న క్లిప్.. యూట్యూబ్ లో రచ్చరచ్చ చేస్తోంది. విడుదల అయిన కొన్ని గంటల్లోనే మిలియన్ వ్యూస్ సంపాదించుకుని దూసుకెళ్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి