iDreamPost
android-app
ios-app

ప్రైవేట్ జెట్ లో షిరిడీ వెళ్లిన విజయ్.. ఎందుకో తెలుసా?

  • Published Aug 31, 2024 | 8:51 PM Updated Updated Aug 31, 2024 | 8:51 PM

Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ ఇప్పటి వరకు హీరోగా కనిపించాడు.. తర్వలో ఆయన రాజకీయ నేతగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఆయన సొంత పార్టీ పెట్టి జండా కూడా ఆవిష్కరించిన విషయం తెలిసిందే.

Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ ఇప్పటి వరకు హీరోగా కనిపించాడు.. తర్వలో ఆయన రాజకీయ నేతగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఆయన సొంత పార్టీ పెట్టి జండా కూడా ఆవిష్కరించిన విషయం తెలిసిందే.

  • Published Aug 31, 2024 | 8:51 PMUpdated Aug 31, 2024 | 8:51 PM
ప్రైవేట్ జెట్ లో షిరిడీ వెళ్లిన విజయ్.. ఎందుకో తెలుసా?

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు, దర్శక, నిర్మాతల తనయులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అలాంటి వారిలో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ఒకరు. బాలనటుడిగా కెరీర్ మొదలు పెట్టిన విజయ్ తర్వాత హీరోగా మారారు. మొదటి నుంచి సమాజ సేవ పట్ల ఆసక్తి చూపిస్తూ వస్తున్న విజయ్ ఇటీవల ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ స్థాపించారు. పార్టీకి సంబంధించిన లోగో కూడా ఆవిష్కరించారు. మరికొన్ని రోజుల్లో తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా విజయ్ కి సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. వివరాల్లోకి వెళితే..

సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు సొంతగా పార్టీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వారి బాటలోనే దళపతి విజయ్ నడుస్తున్నారు. తాజాగా ఆయన తన తల్లి కోరిక మేరకు ఓ ప్రైవేట్ జట్ లో షిరిడీ వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్ లో స్టార్ హీరోగా వెలిగిపోతున్న విజయ్ ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ సిద్దమైన విషయం తెలిసిందే. ఇప్పటికీ పార్టీ, లోగో అన్నీ సిద్దం చేశారు. రాజకీయాల కోసం భవిష్యత్ లో సినిమాలకు స్వస్తి చెప్పేందుకు సిద్దమైనట్లు వార్తలు వస్తున్నాయి.

విజయ్ షిరిడీసాయినాథుడిని దర్శించుకోవడానికి చెన్నై నుంచి మహరాష్ట్రకు ఓ ప్రైవేట్ జెట్ లో చేరుకున్నారు. త్వరలో ఆయన ప్రజల మధ్యకు వెళ్లబోతున్నారు.. ఈ క్రమంలోనే ముందుగా షిరిడీ సాయినాథుడిని దర్శించుకుంటే బాగుంటుందని తల్లి శోభ సూచించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విజయ్ తల్లి శోభ సాయిబాబ భక్తురాలు. గతంలో కూడా తల్లి కోరిక మేరకు విజయ్ చెన్పైలోని సాయిబాబ గుడి నిర్మించిన విషయం తెలిసిందే.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss