iDreamPost

దయచేసి.. నా బర్త్ డేను సెలబ్రేట్ చేయకండి! ఫ్యాన్స్ కు స్టార్ హీరో రిక్వెస్ట్..

ఓ స్టార్ హీరో దయచేసి తన బర్త్ డేను సెలబ్రేట్ చేయకండి అంటూ ఫ్యాన్స్ ను రిక్వెస్ట్ చేశాడు. మరి ఆ హీరో ఎవరు? దానికి కారణం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.

ఓ స్టార్ హీరో దయచేసి తన బర్త్ డేను సెలబ్రేట్ చేయకండి అంటూ ఫ్యాన్స్ ను రిక్వెస్ట్ చేశాడు. మరి ఆ హీరో ఎవరు? దానికి కారణం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.

దయచేసి.. నా బర్త్ డేను సెలబ్రేట్ చేయకండి! ఫ్యాన్స్ కు స్టార్ హీరో రిక్వెస్ట్..

తమ అభిమాన హీరో బర్త్ డే వస్తుందంటే చాలు.. వారం రోజుల ముందు నుంచే ఏం చేయాలో ప్లానింగ్స్ వేస్తుంటారు ఫ్యాన్స్. పక్కా ప్రణాళికలతో రాష్ట్ర వ్యాప్తంగా దుమ్మురేపాలని తెగ ఆరాటపడుతూ ఉంటారు. కొందరు భారీ కటౌట్లు ఏర్పాటు చేసి పాలభిషేకాలు చేస్తే.. మరికొందరు రక్తదానం చేసి తమ అభిమానాన్ని చూపుతారు. ఇంకొందరు అనాథాశ్రమాల్లో భోజనం పంపిణీ చేస్తూ.. గొప్ప మనసును చాటుకుంటూ ఉంటారు. అలా ఫ్యాన్స్ తమ స్టార్ హీరో పుట్టినరోజును ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఓ స్టార్ హీరో దయచేసి తన బర్త్ డేను సెలబ్రేట్ చేయకండి అంటూ ఫ్యాన్స్ ను రిక్వెస్ట్ చేశాడు. మరి ఆ హీరో ఎవరు? దానికి కారణం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.

రేపు (జూన్ 22)న ఓ స్టార్ హీరో పుట్టినరోజు.. దాంతో ఫ్యాన్స్ ఘనంగా ఆ వేడుకలను జరపడానికి సిద్ధమవుతున్నారు. కానీ ఆ హీరో మాత్రం తన బర్త్ డే వేడుకలను సెలబ్రేట్ చేసుకోవద్దు అంటూ ఫ్యాన్స్ ను రిక్వెస్ట్ చేశాడు. ఆ హీరో ఎవరో కాదు.. కోలీవుడ్ స్టార్  దళపతి విజయ్. రేపు(జూన్ 22)న తన పుట్టినరోజు వేడుకలను అభిమానులు నిర్వహించకండి అంటూ ఓ ప్రకటన జారీ చేశాడు. విజయ్ పార్టీ స్థాపించిన తర్వాత తొలి బర్త్ డే కావడంతో.. ఫ్యాన్స్, కార్యకర్తలు ఓ రేంజ్ లో నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ కు నిరాశ కలిగించే స్టేట్మెంట్ ఇచ్చాడు విజయ్. పుట్టినరోజును సెలబ్రేట్ చేయకండి అని చెప్పడానికి ఓ కారణం ఉంది. అదేంటంటే?

దళపతి విజయ్ జూన్ 22న 49వ పడిలోకి అడుగుపెట్టబోతున్నాడు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా సెలబ్రేషన్స్ కు రెడీ అయ్యారు ఫ్యాన్స్. కానీ విజయ్ తన అభిమానులను ఈ వేడుకలను సెలబ్రేట్ చేసుకోవద్దని రిక్వెస్ట్ చేశాడు. దానికి కారణం ఏంటంటే? తమిళనాడు రాష్ట్రంలోని కళ్లకురిచి జిల్లాలో కల్తీసారా తాగి దాదాపు 47 మంది మరణించారు. మరో 109 మంది వివిధ ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన విజయ్ ను తీవ్రంగా కలచి వేసింది. ఆ బాధితులను ఇటీవలే పరామర్శించాడు విజయ్. దాంతో తన బర్త్ డేను సెలబ్రేట్ చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు.

ఈ మేరకు వేడుకలకు ఖర్చు పెట్టే ప్రతీ రూపాయి కూడా బాధిత కుటుంబాల ఇంటికి స్వయంగా వెళ్లి ఇచ్చి రావాల్సిందిగా కోరాడు. ఈ మేరకు తమిళనాడు వెట్రి కజగం ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ ఓ ప్రకటన చేశాడు. విజయ్ తీసుకున్న ఈ నిర్ణయంతో.. పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫ్యాన్స్ సైతం తమ హీరో తీసుకున్న గొప్ప డెసిషన్ కు ఫిదా అవుతున్నారు. మరి విజయ్ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి