iDreamPost
android-app
ios-app

విక్రమ్‌ను మించేలా ‘‘లియో’’.. ట్రైలర్‌ అదిరిపోయింది!

  • Published Oct 05, 2023 | 6:46 PM Updated Updated Oct 05, 2023 | 6:46 PM
  • Published Oct 05, 2023 | 6:46 PMUpdated Oct 05, 2023 | 6:46 PM
విక్రమ్‌ను మించేలా ‘‘లియో’’.. ట్రైలర్‌ అదిరిపోయింది!

తమిళ స్టార్‌ హీరో దళపతి విజయ్‌.. హిట్టు సినిమాల దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ కాంబోలో ‘లియో’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సినిమా నుంచి వచ్చిన ప్రతీ అప్‌డేట్‌కు పిచ్చ రెస్పాన్స్‌ వచ్చింది. పోస్టర్లు, టీజర్లు, పాటలకు విజయ్‌ ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ ప్రేక్షకుడు బ్రహ్మరథం పట్టాడు. ఇక, ఈ సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో.. లియో టీం గురువారం ట్రైలర్‌ రిలీజ్‌ చేసింది.

ట్రైలర్‌ ఎలా ఉందంటే..

అంచనాలకు తగ్గట్టుగానే ట్రైలర్‌ అదిరిపోయింది. కొన్ని సీన్లను బట్టి చూస్తే.. లియోకు ఖైదీ, విక్రమ్‌ సినిమాలతో సంబంధం ఉన్నట్లుగా అనిపిస్తోంది. విజయ్‌ పాత్ర చాలా కొత్తగా ఉంది. విజయ్‌ ఈ సినిమా డ్యూయల్‌ రోల్‌ చేసినట్లుగా కనిపిస్తోంది. విజయ్‌ చెప్పే ఓ డైలాగ్‌ను బట్టి.. అందులో ఒకడు పోలీసైతే.. మరొకడు దొంగ అయ్యే అవకాశం ఉంది. లోకేష్‌ కనగరాజ్‌ సినిమాల్లో ఉండే సెంటిమెంట్‌ ఈ సినిమాలో కూడా ఉంది. ఈ సారి భార్య, కూతుర్ని రక్షించుకునే పాత్రలో విజయ్‌ కనిపిస్తున్నాడు.

విలన్‌లుగా సంజయ్‌ దత్‌, అర్జున్‌ పీక్స్‌చూపించారు. ఇక, ఈ ట్రైలర్‌లో కేవలం కొన్ని పాత్రలను మాత్రమే చూపించారు. సినిమా విడుదల లోగా సెకండ్‌ ట్రైలర్‌ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందులో.. మిగిలిన పాత్రల గురించి.. ఖైదీ, విక్రమ్‌ సినిమాలతో ఈ సినిమాకు ఉన్న సంబంధం గురించి చెప్పే అవకాశం ఉంది. కాగా, ఈ సినిమా భారీ తారాగణంతో తెరకెక్కింది. విజయ్‌ సరసన త్రిష నటించారు. సంజయ్‌ దత్‌ విలన్‌ పాత్ర చేశారు. అర్జున్‌ సార్జా, నివిన్‌ పాలీ, ఫాహద్‌ ఫాజిల్‌, మిస్కిన్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌, సత్యరాజ్‌లు కీలక పాత్రల్లో నటించారు. మరి, ఈ ట్రైలర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomcasibom