iDreamPost
android-app
ios-app

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన హీరో విజయ్! జరిమానా విధించిన పోలీసులు!

  • Author ajaykrishna Published - 11:54 AM, Wed - 12 July 23
  • Author ajaykrishna Published - 11:54 AM, Wed - 12 July 23
ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన హీరో విజయ్! జరిమానా విధించిన పోలీసులు!

కొన్నిసార్లు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయడంలో సినీ తారలేం మినహాయింపు కాదు. సమయం సందర్భాలు బట్టి.. అప్పుడప్పుడు బ్రేక్ చేయడం గురించి వింటుంటాం. మాక్సిమమ్ హీరోలంతా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయకూడదనే జాగ్రత్త పడుతుంటారు. ఎందుకంటే.. కోట్లలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నవారు ఇలా నిబంధనలు అతిక్రిమిస్తూ పోతే సొసైటీలో వాళ్లకు ఉన్న రెస్పెక్ట్ దెబ్బతింటుంది. పైగా ఇప్పుడున్న సోషల్ మీడియా ట్రెండ్ లో ట్రోల్స్ ఫేస్ చేయడం చాలా కష్టం. చిన్నవి కూడా చాలా పెద్ద సమస్యలుగా మారుతుంటాయి. తాజాగా స్టార్ హీరో దళపతి విజయ్ చెన్నైలో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశాడు.

దీంతో విజయ్ కి ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. కొద్దిరోజులుగా విజయ్ అడుగులు త్వరలోనే పాలిటిక్స్ వైపు పడుతున్నాయని తమిళనాట పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. విజయ్ ని కొన్నాళ్ళుగా దైవంలా భావిస్తున్న ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అయితే.. మంగళవారం చెన్నైలోని తన కార్యాలయంలో వివిధ ప్రాంతాలకు చెందిన తన అభిమాన సంఘ నాయకులతో విజయ్ సమావేశమయ్యాడు. ఈ మీటింగ్ లో పలు కీలక అంశాలపై చర్చలు జరిగిపినట్లు తెలుస్తోంది. విజయ్ వచ్చాడని తెలిసి.. అక్కడికి అభిమానులు భారీగా చేరుకున్నారు.

అనంతరం విజయ్ మీటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్తుండగా.. విజయ్ కారును ఫ్యాన్స్ ఫాలో అయ్యారు. వారి నుండి తప్పించుకునే క్రమంలో విజయ్ రెండు చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ బ్రేక్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో రూల్స్ అతిక్రమించిన కారణంగా విజయ్ కి ట్రాఫిక్ పోలీసులు.. రూ. 500 జరిమానా విధించారని సమాచారం. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారగా.. జరిమానా విధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక విజయ్ ఆఫీస్ పనాయూర్ లో ఉండగా.. ఇల్లు నీలాంగారైలో ఉందట. ఇదిలా ఉండగా.. విజయ్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ నెలలో రిలీజ్ కాబోతుంది. మరి విజయ్ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయడంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetmoon girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş