iDreamPost
android-app
ios-app

దళపతి విజయ్ బర్త్ డే.. బంగారు ఉంగరాలు పంచిన అభిమానులు..

  • Author Soma Sekhar Published - 06:16 PM, Fri - 23 June 23
  • Author Soma Sekhar Published - 06:16 PM, Fri - 23 June 23
దళపతి విజయ్ బర్త్ డే.. బంగారు ఉంగరాలు పంచిన అభిమానులు..

ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు కోట్లలో అభిమానులు ఉంటారన్న సంగతి తెలిసిందే. ఇక తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుంది అన్నా.. అతడి పుట్టిన రోజు వస్తుంది అన్నా.. ఫ్యాన్స్ చేసే రచ్చ అంతా ఇంత కాదు. ఇక హీరో పుట్టినరోజు నాడు అభిమానులు రక్త దానాలు, అనాథాశ్రమాల్లో అన్నదానాలు చేస్తుంటారు ఫ్యాన్స్. తాజాగా దళపతి విజయ్ పుట్టిన రోజు (జూన్ 22)న జరుపుకున్న విషయం తెలిసిందే. ఇక దళపతి పుట్టినరోజు నాడు ఫ్యాన్స్ ఏకంగా గోల్డ్ రింగ్స్ నే పంచారు. మరిన్ని వివరాల్లోకి వెళితే..

దళపతి విజయ్.. తమిళ్ లోనే కాక ఇతర భాషల్లో కొట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. స్టైలిష్ యాక్టింగ్ తో, తనదైన వ్యక్తిత్వంతో అభిమానుల మనసులు కొల్లగొడుతుంటాడు విజయ్. తాజాగా తన పుట్టిన రోజు(జూన్ 22)న అభిమానులు పెద్ద ఎత్తున సామాజిక సేవ చేశారు. ఇక ఆయన జన్మదిన వేడుకలను వేలూరు అభిమానులు ఘనంగా జరిపారు. విజయ్ అభిమానుల సంఘం జిల్లా అధ్యక్షడు వేల్ మురుగన్ ఆధ్వర్యంలో.. వేలూరు శిశు భవన్ లోని అనాథ పిల్లల మధ్య కేక్ కట్ చేసి బర్త్ డే వేడుకలు నిర్వహించారు.

దళపతి పుట్టిన రోజు సందర్బంగా.. ఆశ్రమంలో అన్నదానం చేశారు. ఇక వేలూరు పెట్ లాండ్ ప్రభుత్వ ఆసుపత్రిలో విజయ్ పుట్టిన రోజు జన్మించిన చిన్నారులకు బంగారు ఉంగరాలు బహూకరించారు. ఈ సందర్భంగా.. తమ హీరో త్వరలోనే రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజయ్ అభిమాన సంఘం సభ్యులందరు పాల్గొన్నారు.

Jojobet GirişMadridbetMariobetmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet giriş