iDreamPost
android-app
ios-app

దళపతి విజయ్ కొత్తకారు లగ్జరీలో 5స్టార్ హోటల్.. ధర ఎన్ని కోట్లంటే?

Thalapathy Vijay- Lexus LM 350h Price And Specifications: దళపతి విజయ్ పేరు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అందుకు కారణం.. సినిమానో- రాజకీయమో కాదు. ఆయన ఒక లగ్జరీ కారు కొనుగోలు చేశారు. దానికి సంబంధించే ఇప్పుడు విజయ్ పేరు వైరల్ గా మారింది.

Thalapathy Vijay- Lexus LM 350h Price And Specifications: దళపతి విజయ్ పేరు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అందుకు కారణం.. సినిమానో- రాజకీయమో కాదు. ఆయన ఒక లగ్జరీ కారు కొనుగోలు చేశారు. దానికి సంబంధించే ఇప్పుడు విజయ్ పేరు వైరల్ గా మారింది.

దళపతి విజయ్ కొత్తకారు లగ్జరీలో 5స్టార్ హోటల్.. ధర ఎన్ని కోట్లంటే?

దళపతి విజయ్.. సౌత్ ఇండియాలో ఈయనకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. రీజనల్ సినిమాతోనే అలవోకగా రూ.200 కోట్లు కలెక్ట్ చేస్తూ ఉంటాడు. మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా హిట్లు, బ్లాక్ బస్టర్స్ అందుకుంటూనే రాజకీయ రంగ ప్రవేశం కూడా చేస్తున్నాడు. ఇప్పుడు విజయ్ పేరు రాజకీయం, సినిమాలు కాకుండా.. ఒక వ్యక్తిగత విషయం వల్ల వార్తల్లో నిలుస్తోంది. అదేటంటే.. విజయ్ పడవలాంటి ఒక లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. ఆయన ఇంటి నుంచి బయటకు వస్తున్న ఆ కారు వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అసలు ఆ కారు ధర ఎంత ఉంటుంది అని ఫ్యాన్స్ వెతుకులాట మొదలు పెట్టారు. మరి.. ఆ కారు ధర ఎంత? దాని ఫీచర్స్ ఏంటి? అది అసలు ఎందుకు అంత స్పెషలో చూద్దాం.

దళపతి విజయ్ కొన్నాడు అని చెబుతున్న కారు పేరు లెక్సస్ ఎల్ఎం 350h. ఇది ఒక హైబ్రీడ్ కారు. అంటే ఫ్యూయల్+ ఈవీగా మారుతుంది. ఈ కారు ఇప్పుడు సెలబ్రిటీల ఫేవరెట్ కారుగా మారిపోయింది. కంఫర్ట్, లగ్జరీ కోసం ఇన్నాళ్లు వెల్ ఫైర్ లిమోసిన్ ఎంయూవీని కొనుగోలు చేస్తున్న సెలబ్రిటీలు ఇప్పుడు ఈ కారువైపునకు మళ్లుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో రణబీర్ కపూర్ కూడా ఇదే MUVని వాడుతున్నాడు. ఇప్పుడు విజయ్ కూడా ఇదే కారు కొనగానే ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ఈ కారు చూడటానికి పడవలా ఉంటుంది. ఇందులో 4 సీటర్, 7 సీటర్ ఆప్షన్స్ ఉంటాయి. 4 సీటర్ ఆప్షన్ తీసుకుంటే కారులో వెనుక వైపు మొత్తం ఫుల్ స్పేస్ ఉంటుంది. దీనిని ఒక మినీ క్యారీవ్యాన్ అని కూడా అనచ్చు. ఇంక ఈ కారు ధర ఎంతుంటుంది అంటే.. ఎక్స్ షోరూమ్ ధర దాదాపుగా రూ.2.5 కోట్ల వరకు ఉంటుంది.

Vijay New Car

లెక్కస్ ఎల్ఎం ప్రత్యేకతలు:

ఈ కారును ఒక మినీ వైఫ్ స్టార్ హోటల్ అంటారు. ఎందుకంటే ఇందులో ఉండే లగ్జరీ అలాగే ఉంటుంది మరి. ఇందులో 48 ఇంచెస్ అల్ట్రావైడ్ స్క్రీన్ ఉంటుంది. ఇందులో సీట్స్ కూడా ఎంతో కంఫర్ట్ గా ఉంటాయి. ఇవి 480 ఎంఎం స్లైడ్ రేంజ్ తో వస్తాయి. ఇంక ఇందులో ఉండే షాక్ అబ్జార్బర్ ఇచ్చే ఫీల్ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. క్యాబిన్ లోపల ఉన్నప్పుడు ఏమైనా కుదుపులు వచ్చినా.. రోడ్లు సరిగ్గా లేకపోయినా కంఫర్ట్ మాత్రం అస్సలు మిస్ అవ్వదు. ఇందులో ఆర్మ్ రెస్ట్, హీటర్స్ కూడా ఉంటాయి. మీకు ఈ కారులో ఫ్రంట్ సెపరేట్, బ్యాక్ సైడ్ సెపరేట్ ఆడియో సిస్టమ్స్ ఉంటాయి. ఇందులో మీకు రోల్ కంట్రోల్ అనే ఆప్షన్ ఉంటుంది. కారును టర్న్ చేసే సమయంలో వెనుక ఉన్న వారికి ఎలాంటి అసౌక్రయం కలగదు. ఇంక ఈ కారులో ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే.. ఇది 2.5 లీటర్ ఇన్లైన్-4 హైబ్రిడ్ ఇంజిన్ తో వస్తోంది. ఇది 246.7 బీహెచ్పీ శక్తిని విడుదల చేస్తుంది. ఈ ఇంజిన్ ని హై అవుట్ పుట్ బ్యాటరీకి అటాచ్ చేస్తారు. ఆల్ వీల్ డ్రైవ్, ఇ-ఫోర్ డ్రైవింగ్ టెక్నాలజీ లభిస్తుంది. మీకు ఇందులో ఫ్రంట్ 179.7 బీహెచ్పీ, బ్యాక్ సైడ్ 53.6 బీహెచ్పీ సామర్థ్యం కలిగిన మోటార్లను అమర్చారు.

సేఫ్టీ:

ఈ కారును సెలబ్రిటీలు ఇష్టపడటానికి కంఫర్ట్ మాత్రమే కాదు.. సేఫ్టీ కూడా ఒక కారణంగా చెప్పచ్చు. ఈ కారులో ఉండే ప్రయాణికులు అత్యంత భద్రంగా ఉంటారు అని చెప్పచ్చు. ఇందులో లెక్సస్ సొంత భద్రతా వ్యవస్థ ఉంటుంది. ఈ ఎంయూవీ లెక్సస్ సేఫ్టీ సిస్టమ్+ తో వస్తుంది. మీకు ఇందులో వెహికల్ డిటెక్షన్, డైనమిక్ రాడార్ క్రూయిజ్ కంట్రోల్, ప్రీ-కొలీషన్ సిస్టమ్, స్టిరింగ్ అసిస్ట్ విత్ లేన్ డిపార్చర్, లేన్ ట్రేసింగ్ అసిస్ట్, సేఫ్ ఎగ్జిట్ అసిస్ట్, డోర్ ఓపెనింగ్ వంటి ఫీచర్స్ ను కలిగి ఉంది. ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టే సెలబ్రిటీలు ఇప్పుడు ఈ కారు అంటే మోజు పడిపోతున్నారు. మరి.. దళపతి విజయ్ కొనుగోలు చేశాడు అని చెబుతున్న ఈ లెక్సస్ కారు మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.