iDreamPost
android-app
ios-app

స్టేజిపై నవ్వులు పూయించిన టీజీ వెంకటేష్‌!

  • Published Jul 26, 2023 | 11:38 AM Updated Updated Jul 26, 2023 | 11:38 AM
  • Published Jul 26, 2023 | 11:38 AMUpdated Jul 26, 2023 | 11:38 AM
స్టేజిపై నవ్వులు పూయించిన టీజీ వెంకటేష్‌!

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌లు లీడ్‌ రోల్స్‌లో నటించిన బ్రో సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో సీనియర్‌ రాజకీయ నాయకుడు టీజీ వెంకటేష్‌ నవ్వులు పూయించారు. స్టేజిపై స్పీచు సందర్బంగా ఆయన మాట్లాడిన కొన్ని తప్పులు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. బ్రో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు హాజరైన ఆయన స్టేజిపై మాట్లాడుతూ.. ‘‘ ఈ కార్యక్రమానికి విచ్చేసిన సహ హీరో ధర్మ తేజ గారికి.. మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్నా గారికి.. హీరోయిన్‌ కీర్తి శర్మ గారికి..’’ అని అన్నారు.

దీంతో స్టేజి మీద ఒక్కసారిగా నవ్వులు పూశాయి. యాంకర్‌ సుమ నవ్వు ఆపుకోలేకపోయింది. ఆయన దగ్గరే నవ్వితే బాగోదన్న ఉద్దేశ్యంతో అక్కడినుంచి పక్కకు వెళ్లిపోయింది. టీజీ వెంకటేష్‌ స్టేజి మీద అన్ని తప్పులు మాట్లాడతాడని ఎవ్వరూ ఊహించలేదు. ఆయన బ్రో మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ పేరును ‘‘ తమన్నా’’ అని అన్నారు.. హీరోయిన్‌ కేతిక శర్మ పేరును.. కీర్తి శర్మగా అని అన్నారు. ఇలా రెండు పేర్లు తప్పు చెప్పటం.. అది కూడా సెల్‌ఫోన్‌లో వారి పేర్లు చూసి కూడా తప్పులు చెప్పటంపై నెటిజన్లు కౌంటర్‌ ఇస్తున్నారు.

కొంతమంది నెటిజన్లు టీజీ వెంకటేష్‌కు సపోర్ట్‌ చేస్తుంటే.. మరికొంతమంది విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా, బ్రో సినిమాకు ‘సమద్రఖని’ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆయన తమిళంలో తెరెకెక్కించిన ‘వినోదయ సితం’కు రీమేక్‌గా తెరకెక్కింది. బ్రో సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి, బ్రో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌, హీరోయిన్‌ కేతిక శర్మ పేర్లు తప్పుగా చదివిన టీజీ వెంకటేష్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş