iDreamPost
android-app
ios-app

‘ఈగల్‌’ కొత్త రిలీజ్‌ డేట్‌తో ఫ్యాన్స్‌లో టెన్షన్‌ టెన్షన్‌!

ఈ సంక్రాంతికి ‘ఈగల్‌’ సినిమా విడుదల కావాల్సింది. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. ఈగల్‌ మూవీ టీం కొత్త రిలీజ్‌ డేట్‌ను ఫిక్స్‌ చేసింది.

ఈ సంక్రాంతికి ‘ఈగల్‌’ సినిమా విడుదల కావాల్సింది. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. ఈగల్‌ మూవీ టీం కొత్త రిలీజ్‌ డేట్‌ను ఫిక్స్‌ చేసింది.

‘ఈగల్‌’ కొత్త రిలీజ్‌ డేట్‌తో ఫ్యాన్స్‌లో టెన్షన్‌ టెన్షన్‌!

రవితేజ నటించిన తాజా చిత్రం ‘ఈగల్‌’ విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. జనవరి 13వ తేదీనుంచి థియేటర్లలో సందడి చేయాల్సింది. అయితే, సంక్రాంతికి మరికొంత మంది స్టార్‌ల సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి. మహేష్‌ బాబు నటించిన గుంటూరు కారం, వెంకటేష్‌ నటించిన సైంధవ్‌, నాగార్జున నా సామిరంగ చిత్రాలు విడుదల కానున్నాయి. వీటితో పాటు ప్యాన్‌ ఇండియా మూవీ హనుమాన్‌ కూడా బరిలో ఉంది.

ఈ నాలుగు సినిమాలు ఒకటి రెండు రోజుల తేడాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. దీంతో ఈగల్‌కు పోటీ పెరిగిపోయింది. అందరితో పాటు పోటీలోకి దిగితే నష్టం తప్పదని ‘ఈగల్‌’ చిత్ర నిర్మాతలు భావించారు. జనవరి 13వ తేదీన విడుదల కావాల్సిన సినిమాను పోస్ట్‌పోన్‌ చేశారు. ఫిబ్రవరి 9వ తేదీన ఈగల్‌ను విడుదల చేయనున్నట్లు కొత్త డేట్‌ను ప్రకటించారు. అయితే, సంక్రాంతి బరిలోనుంచి ఈగల్‌ బయటకు రావటంతో రవితేజ ఫ్యాన్స్‌ మొదట సంతోషించారు.

కొత్త డేట్‌ ఎప్పుడు వస్తుందా? అని ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. మొదట సినిమాను జనవరి 26న విడుదల చేద్దామని భావించారు. కానీ, ఆ రోజు విడుదల అయిన ఏ రవితేజ మూవీ కూడా హిట్‌ కాలేదు. దీంతో ఫిబ్రవరికి వాయిదా వేశారు. అయితే, ఫ్యాన్స్‌ ఎదురు చూపులకు తొందరగానే ఫలితం దక్కినా.. లాభం మాత్రం లేకుండా పోయింది. కొత్త రిలీజ్‌ డేట్‌తో రవితేజ ఫ్యాన్స్‌లో భయం పట్టుకుంది. ఫిబ్రవరి నెలలో విడుదల అయిన చాలా వరకు రవితేజ సినిమాలు ఫెయిల్‌ అవుతూ వచ్చాయి.

ఫిబ్రవరి 9వ తేదీన షాక్‌.. ఫిబ్రవరి 2వ తేదీన నిప్పు.. అదే ఫిబ్రవరి 2న టచ్‌ చేసి చూడు.. ఫిబ్రవరి 11వ తేదీన కిలాడీ సినిమాలు రిలీజ్‌ అయ్యాయి. వీటిలో అన్నీ కూడా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో ఫ్యాన్స్‌ ‘ ఈగల్‌’ విషయంలో టెన్షన్‌ పడుతున్నారు. నెగిటివ్‌ సెంటిమెంట్‌ ఉన్న ఫిబ్రవరి నెలలో సినిమా విడుదల వద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే, సినిమా బాగుంటే ఎలాంటి సెంటిమెంట్లు పని చేయవు. ఈగల్‌ హిట్‌ అయి కొత్త రికార్డు క్రియేట్‌ చేస్తుంది. మరి, ఈగల్‌ కొత్త రిలీజ్‌ డేట్‌పై రవితేజ ఫ్యాన్స్‌ ఆందోళన చెందటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet