iDreamPost
android-app
ios-app

హీరోలు ఇలాంటి ఫ్రేమ్స్ ఒప్పుకోవడం చాలా గ్రేట్

  • Published Nov 29, 2024 | 4:52 PM Updated Updated Nov 29, 2024 | 4:52 PM

మార్కెట్ లో సినిమా బిజినెస్ లెక్కలన్నీ కూడా హీరో మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. ఆ సినిమాలో హీరోయిన్ ఎంత కీ రోల్ ప్లే చేసినా కానీ.. హీరో ఇమేజ్ తోనే ఆ సినిమా పబ్లిసిటీ అవుతుంది. హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ చాలానే వచ్చాయి. కానీ, విజయశాంతి, అనుష్క , సమంత లాంటి కొంతమందికి మాత్రమే ఆ రేంజ్ మార్కెట్ దక్కింది. ఈ క్రమంలో స్టార్లు ఓ మెట్టు దిగి వస్తున్నారనే చెప్పాలి.

మార్కెట్ లో సినిమా బిజినెస్ లెక్కలన్నీ కూడా హీరో మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. ఆ సినిమాలో హీరోయిన్ ఎంత కీ రోల్ ప్లే చేసినా కానీ.. హీరో ఇమేజ్ తోనే ఆ సినిమా పబ్లిసిటీ అవుతుంది. హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ చాలానే వచ్చాయి. కానీ, విజయశాంతి, అనుష్క , సమంత లాంటి కొంతమందికి మాత్రమే ఆ రేంజ్ మార్కెట్ దక్కింది. ఈ క్రమంలో స్టార్లు ఓ మెట్టు దిగి వస్తున్నారనే చెప్పాలి.

  • Published Nov 29, 2024 | 4:52 PMUpdated Nov 29, 2024 | 4:52 PM
హీరోలు ఇలాంటి ఫ్రేమ్స్ ఒప్పుకోవడం చాలా గ్రేట్

ఇది పురుషాధిక్య సమాజమా అంటే ఇప్పుడున్న పరిస్థితులు అలా లేవనే చెప్పాలి. కానీ సినిమాలలో మాత్రం దాదాపు అదే కనిపిస్తూ ఉంటుంది. మార్కెట్ లో సినిమా బిజినెస్ లెక్కలన్నీ కూడా హీరో మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. ఆ సినిమాలో హీరోయిన్ ఎంత కీ రోల్ ప్లే చేసినా కానీ.. హీరో ఇమేజ్ తోనే ఆ సినిమా పబ్లిసిటీ అవుతుంది. హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ చాలానే వచ్చాయి. కానీ, విజయశాంతి, అనుష్క , సమంత లాంటి కొంతమందికి మాత్రమే ఆ రేంజ్ మార్కెట్ దక్కింది. ఈ క్రమంలో స్టార్లు ఓ మెట్టు దిగి వస్తున్నారనే చెప్పాలి. తమ ఆలోచనా ధోరణి మార్చుకుని.. డైరెక్టర్స్ కి తగినట్టు, ఆ సీన్ లేదా ఆ సాంగ్ కి తగినట్టు రాజిపడుతున్నారు. రీసెంట్ గా పుష్ప 2 , గేమ్ ఛేంజర్ మూవీ అప్డేట్స్ లో ఇవి కనిపించాయి. సోషల్ మీడియాలో ఈ రెండు సినిమాల గురించి తెగ పబ్లిసిటీ జరుగుతుంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. పుష్ప 2 ట్రైలర్ లో రష్మిక పాదాలను తన చెంపల మీద రాసుకుంటున్న షాట్ ను .. పుష్ప రాజ్ మ్యానరిజం తగ్గేదెలే అనే దానికి సంకేతంగా చూపిస్తారు. తన భార్యను ఎంత ప్రేమిస్తున్నాడో సింబాలిక్ గా చూపించే ప్రయత్నం చేశాడు సుకుమార్.

ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యాక.. బాగా ఫేమస్ అయిన షాట్స్ లో ఇదొకటి. ప్రపంచాన్ని వణికించే మగాడు తన భార్య కోసం ఎంతకైనా దిగివస్తాడు అనే దానికి నిదర్శనంగా ఈ ఫ్రేమ్ డిజైన్ చేశాడు.ఇక ఆ తర్వాత తాజాగా గేమ్ ఛేంజర్ నుంచి నానా హైరానా అంటూ ఓ మెలోడీ సోషల్ మీడియాలో హైరానా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సాంగ్ లో కూడా కియారా అద్వానీ పాదాన్ని రామ్ చరణ్ తన బుగ్గవైపు తీసుకునే ఓ షాట్ ఉంటుంది. ఇప్పుడు పుష్ప 2 , గేమ్ ఛేంజర్ లో సిమిలర్ గా ఉన్న ఈ షాట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ కాళ్ళ ఫాంటసి ఏంటయ్యా అంటూ.. ఇలాంటి ఫ్రేమ్స్ ఒప్పుకోవాలంటే నిజమే గ్రేట్ అంటూ.. బంగారం సార్ మన తెలుగు హీరోలు అంటూ తెగ పొగిడేస్తున్నారు అభిమానులు. నిజమే ఇలాంటివి మన హీరోలకు మాత్రమే సాధ్యం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే వాళ్లంతా గ్లోబల్ ఇమేజ్ ను దక్కించుకున్న స్టార్స్ .. ఆ షాట్స్ వద్దు అని చెప్పే రైట్ వారికుంది. పైగా కొరియోగ్రఫి ప్రకారమే అనుకున్నప్పటికీ కూడా.. వారు వద్దు అనుకుంటే ఆ సీన్స్ మార్చే అవకాశం ఉంది. కానీ వారు ఎక్కడ అలా చేయలేదు. దర్శకులు , కొరియోగ్రాఫర్ లు ఎలా చెప్తే అలానే చేస్తున్నారు. ఏ ఇగో, రేంజ్ లేకుండా సినిమాకి విలువ ఇస్తున్నారు. 

గతంలో కూడా ఇలాంటి సీన్స్ వచ్చాయి. కానీ పెద్ద హీరోల మీద చూపించినవి మాత్రం చాలా తక్కువ. అప్పుడెప్పుడో ఘరానా మొగుడు సినిమా టైం లో .. నగ్మా చిరంజీవిని కొట్టే సీన్ ఉందని ఫ్యాన్స్ నానా భీభత్సం చేశారు. ఆ తర్వాత నరసింహ సినిమాలో రమ్యకృష్ణ సౌందర్య చెంపను కాలితో నిమరడం మీద కూడా చర్చ జరిగింది. ఇక ఆ తర్వాత కూడా రెండు మూడు సినిమాల విషయంలో కొందరు చేసిన కామెంట్స్ చిన్నపాటి దుమారం రేపాయి. కానీ ఇప్పుడు బన్నీ , చరణ్ లు చేసినవి చూస్తే..ఇకపై అంతా ఇదే ట్రెండ్ కొనసాగుతుందేమో అనిపిస్తుంది. అప్పుడే అటు దర్శకులు కూడా ఈగోలు, క్యాలికులేషన్లు లేకుండా స్వేచ్ఛగా.. వారు అనుకున్నది అనుకున్నట్లు తెరపై చూపించగలుగుతారు. మరి నెక్స్ట్ రాబోయే సినిమాలలో ఇలాంటి ఫ్రేమ్స్ పడతాయో లేదో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.