iDreamPost
android-app
ios-app

రవితేజ హీరోయిన్ పై తెలుగు ప్రేక్షకులు ప్రశంసలు.. ఎందుకంటే?

  • Published Aug 01, 2024 | 7:49 AM Updated Updated Aug 01, 2024 | 7:49 AM

Telugu Fans Praising Mr Bachchan Movie Heroine Bhagyasri Borse: టాలీవుడ్ ని షేక్ చేయడానికి ఆగస్టు 15న మాస్ మహారాజ రవితేజ మిస్టర్ బచ్చన్ గా వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో రవితేజతో జత కట్టిన భాగ్యశ్రీ బోర్సేపై తెలుగు సినిమా ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Telugu Fans Praising Mr Bachchan Movie Heroine Bhagyasri Borse: టాలీవుడ్ ని షేక్ చేయడానికి ఆగస్టు 15న మాస్ మహారాజ రవితేజ మిస్టర్ బచ్చన్ గా వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో రవితేజతో జత కట్టిన భాగ్యశ్రీ బోర్సేపై తెలుగు సినిమా ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

  • Published Aug 01, 2024 | 7:49 AMUpdated Aug 01, 2024 | 7:49 AM
రవితేజ హీరోయిన్ పై తెలుగు ప్రేక్షకులు ప్రశంసలు.. ఎందుకంటే?

టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలు కూడా మాస్ మహారాజ ఎనర్జీకి, దూకుడుకి కాస్త కంగారు పడుతూ ఉంటారు. అలాంటి మాస్ రాజాకు ఇంకో ఎనర్జిటిక్ మాస్ రాణి తోడైంది. వాళ్లిద్దరూ కలిసి ఇంకో ఊరమాస్ ఎనర్జటిక్ డైరెక్టర్ హరీశ్ శంకర్ తో కలిసి మిస్టర్ బచ్చగా మన ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి చాలానే అప్ డేట్స్, క్రేజీ విషయాలు బయటకు వచ్చాయి. పోస్టర్స్ దగ్గరి నుంచి షో రీల్ వరకు.. క్యారెక్టర్స్ పరిచయాల దగ్గర నుంచి సాంగ్స్ వరకు అన్నీ కూడా సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. ఇంక టీజర్ గురించి అయితే గట్టిగానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ రేంజ్ రియాక్షన్ వచ్చింది.

మిస్టర్ బచ్చన్ సినిమా గురించి ఇప్పుడు గట్టిగానే బజ్ క్రియేట్ అయ్యింది. ఆగస్టు 15న వస్తున్న మూవీస్ లో మిస్టర్ బచ్చన్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్ మహారాజ గట్టిగానే కొట్టబోతున్నాడు అని కామెంట్ చేస్తున్నారు. ఇంక హరీశ్ శంకర్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. వీళ్ల టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీలో హీరోయిన్ చేస్తున్న భాగ్యశ్రీ బోర్సేకి కూడా ఆడియన్స్ నుంచి మంచి అప్లాజ్ లభిస్తోంది. ఆమెను ఇప్పటికే తెలుగు సినిమా ప్రేక్షకులు వాళ్ల క్రష్ లిస్ట్ లో చేర్చేసుకున్నారు. ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొనడమే కాకుండా.. డ్యాన్సులు కూడా చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు అమ్మడుపై తెలుగు ప్రేక్షకులు ప్రశంసలు కురిపించేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by People Media Factory (@peoplemediafactory)

భాగ్యశ్రీపై ప్రశంసలు:

ఈ మాస్ మహారాణిని ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు పొగడ్తలతో ముంచేస్తున్నారు. అందుకు బలమైన కారణమే ఉంది. అదేంటంటే.. తెలుగులో చేస్తున్న తొలి సినిమా అయినా కూడా ఆమె.. ఎంతో కాన్ఫిడెంట్ గా తన పాత్రకు తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. నిజంగా ఈమె డెడికేషన్ కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. నిజానికి చాలామంది హీరోయిన్స్ ఇంకా సొంత డబ్బింగ్ చెప్పుకునేందుకు రెడీ కావట్లేదు. కానీ, తెలుగులో తొలి సినిమాకే భాగ్యశ్రీ సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడంతో అందరూ ఆశ్చర్యపోవడమే కాకుండా.. భాగ్యశ్రీని చూసి చాలా నేర్చుకోవాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. భాగ్యశ్రీ డబ్బింగికి సంబంధించి చిత్ర బృందం అధికారిక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. మరి.. భాగ్యశ్రీ బోర్సే తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by People Media Factory (@peoplemediafactory)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet