iDreamPost
android-app
ios-app

మహేష్ బాబు పక్కన ఉన్న ఈ అమ్మాయి ఎవరు? అసలు నమ్మలేరు!

  • Published Aug 30, 2024 | 6:09 PM Updated Updated Aug 30, 2024 | 6:09 PM

మహేష్ బాబు పక్కన ఉన్న ఈ అమ్మాయి.. ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ.. ఇటీవల ఓ చిత్రంతో పలకరించిన ఈ బ్యూటీ.. ఓ బిగ్ ప్రాజెక్టులో ఆఫర్ కొట్టేసింది. ఇంతకు ఆ అమ్మాయి ఎవరంటే...?

మహేష్ బాబు పక్కన ఉన్న ఈ అమ్మాయి.. ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ.. ఇటీవల ఓ చిత్రంతో పలకరించిన ఈ బ్యూటీ.. ఓ బిగ్ ప్రాజెక్టులో ఆఫర్ కొట్టేసింది. ఇంతకు ఆ అమ్మాయి ఎవరంటే...?

  • Published Aug 30, 2024 | 6:09 PMUpdated Aug 30, 2024 | 6:09 PM
మహేష్ బాబు పక్కన ఉన్న ఈ అమ్మాయి ఎవరు? అసలు నమ్మలేరు!

సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన ఉన్న ఈ అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా..? ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి దొరికిన సరికొత్త హీరోయిన్. తెలుగు అమ్మాయి అయిన ఈ బుట్టబొమ్మ.. తాజాగా ఓ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. మంచి మంచి చిత్రాలతో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా మారేందుకు తీవ్రంగా కష్టపడుతుంది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అదృష్టాన్ని పొందింది. ఇంతకు ఈ ముద్దుగుమ్మ ఎవరంటే పదాహరణాల తెలిగింటి అమ్మాయి రమ్య పసుపులేటి. తాజాగా మారుతి నగర్ సుబ్రమణ్యం అనే చిత్రంలో నటించింది. కాంచన పాత్రలో మెప్పించింది. 2018లో హుషారు అనే మూవీతో సినీ జీవితాన్ని ప్రారంభించిన ఆమె నటి మాత్రమే కాదు షార్ట్ ఫిల్మ్స్‌లో కూడా నటించింది. ఇప్పుడు వరుస చిత్రాలతో బిజీగా మారింది.

హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన రమ్య.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా. అలా హుషారు చిత్రం చేసిన ఈ బ్యూటీ.. ఫస్ట్ ర్యాంక్ రాజు అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాత మైల్స్ ఆఫ్ లవ్ అనే మూవీలో యాక్ట్ చేసింది. ఇందులో ’తెలియదే తెలియదే.. ఇదివరకెప్పుడైనా మనస్సుకే ప్రేమకటుందని‘ సాంగ్ యూట్యూబ్‌లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ దక్కించుకుంది. ఆ తర్వాత కమిట్ మెంట్ చిత్రంలో బోల్ట్ పాత్రలో మెప్పించింది. ఇవే కాకుండా చదరంగం, బీఎఫ్ఎఫ్ వంటి వెబ్ సిరీస్‌లో కూడా కనిపించింది ఈ తెలుగమ్మాయి. రాధే బన్సీ అనే షార్ట్ ఫిల్మ్‌లో కూడా నటించింది. గతంలో కొన్ని ప్రకటనల్లో కూడా యాక్ట్ చేసింది. ఇప్పుడు మారుతి నగర్ సుబ్రమణ్యం మూవీలో. రావు రమేశ్, ఇంద్రజ వంటి దిగ్గజ స్టార్లతో స్క్రీన్ షేర్ చేసుకుంది.

ఇటీవల విడుదలైన మారుతి నగర్ సుబ్రమణ్యం మంచి టాక్ తెచ్చుకుంది. అంకిత్ కొయ్యకు పెయిర్‌గా యాక్ట్ చేసింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు విశ్వంభర చిత్రంలో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. మెగాస్టార్ చిరంజీవితో నటించే అవకాశాన్ని కొల్లగొట్టింది. ఇవే కాదు మరికొన్ని కొత్త సినిమాల కథలు వింటోంది ఈ బ్యూటీ. అంతే కాదు సోషల్ మీడియాలో కూడా హాట్ ఫోటోలతో కేక పుట్టిస్తుంది. తెలుగు అమ్మాయిలు గ్లామర్ పాత్రలు చేయాలంటే కాస్తంత వెనకడుగు వేస్తారు అన్న మాటలను చెరిపేసేందుకు రెడీ అయ్యింది ఈ బ్యూటీ. ఇన్ స్టాలో తన ఫోటోలు, వీడియోలతో నెటిజన్లతో టచ్‌లో ఉంటోంది. ఆమె పిక్స్ చూస్తే మతిపోవాల్సిందే. అందంతో మెస్మరైజ్ చేస్తోంది. స్టార్ హీరోయిన్‌కు ఏ మాత్రం తీసిపోని గ్లామర్ ఆమెది. త్వరలో బిగ్ స్టార్ కావాలని ఆశిద్దాం.

 

View this post on Instagram

 

A post shared by Sai Ramya Pasupuleti (@ramyaapasupuleti)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet